కశ్మీర్: 'నియంత్రణ రేఖ వద్ద భారత్ కాల్పుల్లో మా సైనికులు నలుగురు మరణించారు' - పాకిస్తాన్

ఫొటో సోర్స్, dgispr
నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి భారత్‌తో జరిగిన కాల్పుల్లో తమ సైనికులు నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పాకిస్తాన్ వెల్లడించింది. ఈ ఘటనల్లో ఇద్దరు పౌరులు కూడా మరణించినట్లు సమాచారం.
భారత్ అధీనంలోని కశ్మీర్‌లోని ఆందోళనకర పరిస్థితులపై నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకు భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల తీవ్రతను పెంచిందని పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ గురువారం ట్విటర్ ద్వారా తెలిపారు.
ఈ ఘటనల్లో ముగ్గురు పాక్ సైనికులు అమరులయ్యారని, పాక్ సైన్యం దీటుగా స్పందించడంతో ఐదుగురు భారత సైనికులు మృతి చెందారని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, OfficialDGISPR/twitter
పాక్ కాల్పుల్లో భారత సైనికులు చాలా మందికి గాయాలయ్యాయని, కొన్ని బంకర్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య చెదరుమదురుగా కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఈ కాల్పుల్లో గాయపడ్డ మరో పాక్ సైనికుడు మరణించినట్లు గఫూర్ శుక్రవారం ఉదయం ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అయితే, పాకిస్తాన్ ప్రకటనలో అవాస్తవాలున్నాయని, ఎల్‌ఓసీ వద్ద కాల్పుల్లో తమ సైనికులెవరూ మరణించలేదని భారత్ సైన్యం తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్ ఇంకా కర్ఫ్యూలోనే..
జమ్మూ కశ్మీర్‌కున్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం ఆగస్టు 5న ఆర్టికల్ 370ని సవరించిన సంగతి తెలిసిందే.
ఎన్నో ఏళ్లుగా సంక్షోభంతో రగులుతున్న కశ్మీర్‌ను ఈ నిర్ణయంతో అభివృద్ధి పథంలోకి తీసుకువస్తామని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అంటోంది.
కశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 పెద్ద అవరోధంగా మారిందంటూ భారత హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రసంగించారు.
ఆర్టికల్ 370 సవరణ నిర్ణయం తీసుకుని పది రోజులకుపైగా గడిచినా, కశ్మీర్ ప్రాంతం ఇంకా కర్ఫ్యూలోనే కొనసాగుతోంది. అక్కడ ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది.

ఫొటో సోర్స్, Getty Images
హిందుత్వ అజెండాలో భాగంగానే..
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) హిందుత్వ అజెండా అమలులో భాగంగానే మోదీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిందని పాకిస్తాన్ ఆరోపించింది.
పాక్ స్వాతంత్ర్య దినం సందర్బంగా తమ అధీనంలోని కశ్మీర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో.. భారత్‌తో యుద్ధానికి తమ దేశం పూర్తి సింసిద్ధంగా ఉందని, ఇటుకలు వేస్తే తాము రాళ్లతో బదులు చెప్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.
ఆర్టికల్ 370ని సవరించడం ద్వారా మోదీ తన ఆఖరి అస్త్రం ప్రయోగించారని, తదుపరి ఆయన చూపు కశ్మీర్ స్వాతంత్ర్యంపైనేనని ఆయన చెప్పారు. పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్‌పై చర్యలు తీసుకునేందుకు భారత్ ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు.
ఆర్ఎస్ఎస్‌ను జర్మన్ నియంత హిట్లర్‌కు చెందిన నాజీ పార్టీతో ఇమ్రాన్ పోల్చారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- కశ్మీర్లో ఆ 5 రోజుల్లో ఏమేం జరిగాయి
- 'సైనిక విన్యాసాలు చేస్తూ శాంతి చర్చలా...' దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆగ్రహం..
- కశ్మీర్: 'భారత్ మాతాకీ జై' అనే నినాదాలతో ఉన్న ఈ వీడియో ఎక్కడిది?- Fact Check
- షార్క్‌లు మనుషులపై ఎందుకు దాడులు చేస్తాయంటే...
- కశ్మీర్: పాకిస్తాన్ అభ్యర్థనను అంతర్జాతీయ సమాజం ఎందుకు వినడం లేదు
- మనుషుల అవయవాలు జంతువుల్లో వృద్ధి - ఈ పరిశోధనల లక్ష్యం ఏంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








