మహువా మోయిత్ర: భారత్‌లో ఫాసిజం తొలి సంకేతాలు ఈ ఏడు అంశాలే

ఫొటో సోర్స్, Facebook/MahuaMoitra
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత దేశంలో ఫాసిజం తొలి సంకేతాలు కనిపిస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్ర హెచ్చరించారు. తొలిసారి ఎంపీగా ఎన్నికైన ఆమె భారతదేశ ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. మహువా మోయిత్ర ప్రసంగం 'స్పీచ్ ఆఫ్ ద ఇయర్' అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బెంగాల్లోని కృష్ణానగర్ స్థానం నుంచి ఎన్నికైన మహువా మొదటిసారిగా లోక్‌సభలో మాట్లాడుతూ- ఫాసిజం ఏడు సంకేతాల గురించి చెప్పారు. ఫాసిజం తొలి సంకేతాలకు సంబంధించి 2017లో అమెరికా హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియం లాబీలో ఉంచిన ఒక పోస్టర్‌ను ఆమె ప్రస్తావించారు.
రెండో ప్రపంచ యుద్ధానికి ముందు, యుద్ధ సమయంలో లక్షల మంది యూదులను, ఇతరులను నాజీలు చంపేసిన ఉదంతాన్ని 'ద హోలోకాస్ట్' అంటారు. ఈ మ్యూజియంలో ప్రదర్శించిన ఈ పోస్టర్‌లో ఫాసిజం తొలి సంకేతాల జాబితా ఉంది.
మహువా బీబీసీతో మాట్లాడుతూ- ఈ జాబితా తాను తయారుచేసినది కాదని, పాతదేనని చెప్పారు. ఫాసిజం తొలి సంకేతాలు దేశంలో కనిపిస్తున్నవేనని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Facebook/MahuaMoitra
"ఫాసిజం అధిక సంఖ్యాకులవాదం(మెజారిటేరియనిజం)తో ముడిపడి ఉంది. అధిక సంఖ్యాకులవాదం ప్రకారం 'మేం అనుకొనేదే సరైనది, మిగతాదంతా తప్పు' అనుకొంటారు. ఈ భావజాలానికి విస్తృతమైన మద్దతు లభిస్తుంది. ఇప్పుడు దేశంలో జరిగింది ఇదే" అని మహువా తెలిపారు.
పెద్దసంఖ్యలో ప్రజలను బలిగొనే నరమేధం జరిగే ఆస్కారముందని తాను భావించడం లేదని, కానీ ఫాసిజం గురించి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నానని ఆమె చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఉన్న తిరుగులేని సంఖ్యాబలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయం ప్రస్తావిస్తున్నానని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"ఒకప్పుడు జర్మనీలో ఉన్నది మాత్రమే ఫాసిజం కాదు. ఫాసిజం ఇప్పుడు కూడా చాలా చోట్ల ఉంది. దేశంలో ఫాసిజంతో లక్షల మందిని చంపేస్తారని నేను అనుకోవడం లేదు. కానీ ఫాసిజం తొలి సంకేతాలయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి" అని మహువా చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు.

ఫొటో సోర్స్, Facebook/MahuaMoitra
వ్యక్తిగత సమాచార (డేటా ప్రైవసీ) భద్రతను డిమాండ్ చేస్తూ మహువా పిటిషన్లు కూడా దాఖలు చేశారు.
"మనకు వ్యక్తిగత సమాచార భద్రత చట్టం లేదు. ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేటు కంపెనీలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ఆర్డినెన్సులు జారీచేస్తోంది. మన ప్రజల్లో కూడా వ్యక్తిగత సమాచార గోప్యతపై తగిన అవగాహన లేదు. కేవలం కొన్ని వస్తుసేవల కోసం వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేయడం ఎంత ప్రమాదకరమో వారికి తెలియడం లేదు" అని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రజల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించేలా చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మహువా తెలిపారు. ప్రభుత్వం దీనిని విస్మరించి, కార్పొరేట్ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తోందని విమర్శించారు.

ఫొటో సోర్స్, FACEBOOK / MAHUAMOITRA
మహువా లండన్‌లో బహుళజాతి సంస్థ 'జేపీ మోర్గాన్'లో బ్యాంకింగ్ ఉద్యోగాన్ని వదులుకొని భారత్‌కు వచ్చి 2009లో రాజకీయాల్లో చేరారు.
ఆమె 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంపూర్ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యారు. అక్కడ 1972 నుంచి అప్పటివరకు వామపక్ష అభ్యర్థులు తప్ప ఎవరూ గెలవలేదు.
శాసనసభకు ఎన్నికైనప్పటి నుంచి మహువా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.
మొదటిసారిగా 2019లో లోక్‌సభ ఎన్నికల్లో మహువా పోటీచేశారు. కృష్ణానగర్ స్థానం నుంచి ఆమె గెలుపొందారు.
మంగళవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మహువా పాల్గొన్నారు. లోక్‌సభలో ఆమె తొలి ప్రసంగం ఇదే.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఫాసిజం తొలి సంకేతాలుగా చెబుతూ మహువా ప్రస్తావించిన ఏడు అంశాలు ఏమిటంటే-
1. మూఢ జాతీయవాదంతో దేశ ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల దేశ ప్రజలను కలిపి ఉంచే జాతీయ స్ఫూర్తి దెబ్బతింటోంది. దేశంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలను పౌరసత్వానికి రుజువులు చూపించండని అడుగుతున్నారు.
2. మానవ హక్కుల పట్ల ప్రభుత్వంలో ప్రతీ స్థాయిలో తీవ్రమైన చులకనభావం ఏర్పడింది. పట్టపగలు నడిబజారులో మూకహత్యలు జరిగినా ఎవరూ నోరుమెదపడం లేదు.
3. ముందెన్నడూ లేనంత తీవ్రంగా మీడియాను అణగదొక్కుతున్నారు. నియంత్రిస్తున్నారు. ఐదు అతిపెద్ద మీడియా సంస్థలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒకే వ్యక్తి నియంత్రిస్తున్నారు. ఫేక్ న్యూస్‌తో ప్రజలను దుష్ప్రభావానికి గురిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, LokSabhaTV
4. జాతీయ భద్రతపై అతి ఆందోళనను కలిగిస్తున్నారు, నిరంతరం శత్రువుల కోసం అన్వేషిస్తున్నారు. ఈ సందర్భంలో, విచారకరమైనదేమిటంటే- కశ్మీర్‌లో గత ఐదేళ్లలో చనిపోయిన జవాన్ల సంఖ్య అంతకుముందు గణాంకాలతో పోలిస్తే 106 శాతం ఎక్కువగా ఉంది.
5. ప్రభుత్వం, మతం కలగలసిపోయాయి. దేశంలో ఒక్క సమూహానికి మాత్రమే నివసించే హక్కు ఉండేలా జాతీయ పౌరుల రిజిస్టర్ను, పౌరసత్వ సవరణ బిల్లును దుర్వినియోగం చేస్తున్నారు.
6. అసమ్మతిని, నిరసన గళాలను అణచివేస్తున్నారు. కళాకారులపై, మేధావులపై ఆంక్షలు పెడుతున్నారు.
7. ఎన్నికల ప్రక్రియ స్వతంత్రత దెబ్బతింటోంది.
ఇవి కూడా చదవండి:
- సామాన్యుడి విజయాన్ని సహజంగా చూపించిన 'మల్లేశం'
- కబీర్ సింగ్ సినిమాకు ఈలలు, చప్పట్లు దేనికి...
- ‘‘అమ్మానాన్న పెళ్లి చేసుకోవాలన్నారు.. నేను మాత్రం డీజేగా మారా’’
- చంద్రయాన్-2 మిషన్ సూత్రధారులు ఈ ఇద్దరు మహిళలు
- ఆలయంలో ఉత్సవాలకు ఏనుగులు.. అడ్డు చెబుతున్న జంతు సంరక్షకులు
- హైదరాబాద్: 12 ఏళ్లకే నరకం చూపించారు
- వైట్ హౌస్‌కు మతి చలించింది: అమెరికా ఆంక్షలపై ఇరాన్ విమర్శ
- ‘తాలిబన్ల ఆదాయం ఏటా రూ.లక్ష కోట్లు’.. నిజమేనా?
- అసద్ పైచేయికి రసాయన ఆయుధాలే కారణమా?
- ఇస్లామిక్ యోగా: యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు చేస్తున్న గుజరాత్ ముస్లిం మహిళలు
- అంతులేని ప్రశ్న: రోజుకు ఎన్ని జంతువులు పుడుతున్నాయి?
- ట్రావెల్ ఫొటో పోటీలు 2019: చూపుతిప్పుకోనివ్వని ఫొటోలు... విజేతలు వీరే
- మనిషి పాదాల పరిమాణం రోజురోజుకు పెరిగిపోతోంది.. ఎందుకో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









