మధ్యప్రదేశ్‌లో మెజార్టీ కాంగ్రెస్‌కే, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోనూ పై‘చేయి’

ఫొటో సోర్స్, Getty Images
పార్లమెంటు ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టబోతుండగా, మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ తిరుగులేని విజయం సాధించింది.
తేది: 12.12.2018, ఉదయం 7
రాజస్థాన్‌లో కాంగ్రెస్ 99 స్థానాలు సాధించగా, బీజేపీ 73, ఇతరులు 27 స్థానాలు సాధించారు.
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ మూడింట రెండొంతులకు పైగా మెజారిటీ సాధించింది. బీజేపీ 15, కాంగ్రెస్ 68, ఇతరులు 7 స్థానాలను కైవసం చేసుకున్నారు.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ 109 చోట్ల, కాంగ్రెస్ 114 చోట్ల, ఇతరులు 7 చోట్ల గెలుపొందారు.
ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ వెనుకబడడం మోడీకి షాక్ లాంటిది.
2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేజిక్కించుకోడంలో ఈ మూడు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయి.
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 15 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉంది.


ఫొటో సోర్స్, Getty Images
రాజస్థాన్
ఎగ్జిట్ పోల్ చెప్పినట్టే రాజస్థాన్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది.
రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 200 స్థానాలుండగా 199 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఊహించినట్టే కాంగ్రెస్ 99 స్థానాలను కైవసం చేసుకుంది.
ముఖ్యమంత్రి వసుంధరా రాజే (బీజేపీ) ఝాలార్‌పాటన్ స్థానం నుంచి గెలిచారు.
కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ గెహ్లాత్, సచిన్ పైలెట్ కూడా విజయం సాధించారు. గెహ్లాత్ సర్దార్‌పురా నుంచి గెలవగా, టోంక్ నియోజకవర్గంలో సచిన్ పైలెట్ విజయం సాధించారు.
సీఎం పదవి కోసం అశోక్ గెహ్లాత్, సచిన్ పైలెట్ కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. వీరిలో ఎవరు సీఎం కానున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

ఫొటో సోర్స్, Hindustan Times
మధ్యప్రదేశ్
మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్-బీజేపీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచింది.
కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నా, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన స్పష్టమైన మెజార్టీ మాత్రం ఆ పార్టీకి రాలేదు.
బుధ్ని నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గెలుపొందారు.
పదిహేనేళ్లుగా అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత, చౌహాన్ ప్రభుత్వంపై ఉన్న అవినీతి ఆరోపణలు, రైతుల సమస్యలపై జరిగిన ఆందోళనలు ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించాయని చెప్పవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. మొత్తం 90 స్థానాలకు 68 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది.
బీజేపీ 15 స్థానాలకే పరిమితమైంది.
రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న రమన్ సింగ్ రాజ్‌నాంద్‌గాం స్థానంలో మొదట్లో వెనుకంజలో ఉన్నా ఆఖరికి గెలిచారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నారాయణ్‌పూర్ స్థానంలో మంత్రి కేదార్ కశ్యప్ ఓడిపోయారు.

ఫొటో సోర్స్, MNF/Facebook
మిజోరాం
మిజోరంలో అధికార పార్టీ కాంగ్రెస్ కు ఈ సారి ఎదురుగాలి తప్పలేదు.
ప్రతిపక్షపార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ తిరుగులేని విజయం సాధించింది.
మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 స్థానాల్లో విజయఢంకా మోగించింది.
కాంగ్రెస్ పార్టీ కేవలం 05 స్థానాలకే పరిమితం అయ్యింది.
2013లో జరిగిన ఎన్నికల్లో కేవలం 5 స్థానాలు గెల్చుకున్న ఎంఎన్ఎఫ్ ఈ సారి ఏకంగా 26 సీట్లు సాధించగా 34 స్థానాలతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ 05 స్థానాలకు పడిపోయింది.
ఈశాన్య రాష్ట్రాల్లో కేవలం మిజోరంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. ఇప్పుడు ఇక అది కూడా లేనట్టే.
నిజానికి 1987లో రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కాంగ్రెస్ , ఎంఎన్ఎఫ్ పార్టీల మధ్యే అధికార మార్పిడి జరుగూతూ వచ్చింది.
గడచిన పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 74 ఏళ్ల ముఖ్యమంత్రి లల్ థన్వాలకి కూడా ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పలేదు.
ఆయన సెర్చిప్, దక్షిణ ఛాంఫై రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు.
గడచిన పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓటమికి ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన కారణాల్లో ఒకటని చెప్పొచ్చు.
అక్షరాస్యత విషయంలో దేశంలో కేరళ తర్వాత రెండో స్థానంలో ఉన్న మిజోరంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది.
పేరుకు ఈశాన్య రాష్ట్రాల్లో భాగమైనప్పటికీ... పర్యాటకంగా అభివృద్ధి కూడా అంతంత మాత్రమే.
మౌళిక సౌకర్యాల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయంగా కూడా కాంగ్రెస్ కు ఎదురుదెబ్బలు తప్పలేదు.
హోంమంత్రి, స్పీకర్ సహా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చెయ్యడంతో ఒకానొక సమయంలో ఆ పార్టీ బలం 34 నుంచి 29 స్థానాలకు పడిపోయింది.
మొత్తంగా నిరుద్యోగం, అంతంత మాత్రంగా వ్యవసాయాభివృద్ధి, పేదరికం సహా అనేక కారణాలు కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయి.
క్రైస్తవమత ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో బీజేపీ ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోలేదు. ఫలితంగా కాంగ్రెస్, ఎంఎన్‌ఎఫ్ ల మధ్య ప్రధాన పోటీ సాగింది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ రాష్ట్ర సమితి: విజయానికి 7 ప్రధాన కారణాలు
- బాంబే బ్లడ్ గ్రూప్: ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్
- సంక్షేమ పథకాల హైవేపై కారు జోరు - ఎడిటర్స్ కామెంట్
- మాల్యా వెంటనే భారత్‌కు వస్తారా?
- ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా
- బ్రెగ్జిట్: థెరెసా మే ప్రభుత్వానికి ఆరు ప్రత్యామ్నాయాలు
- గద్దర్ ఇంటర్వ్యూ: 'ఓటు కూడా ఒక పోరాట రూపమే'
- ప్రతిపక్షాల సమావేశం ఎన్డీయేను ఉక్కిరిబిక్కిరి చేయడానికేనా...
- ‘20 లక్షల మంది' ముస్లింలు కర్నూలుకు ఎందుకు వచ్చారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








