కల్వకుంట్ల చంద్రశేఖరరావు: తెలంగాణ నుంచి అత్యధిక సార్లు ఎమ్మెల్యే

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తాజా ఫలితాలతో పాత రికార్డులు తుడిచిపెట్టుకపోతున్నాయి. గజ్వెల్ నియోజకవర్గంలో విజయంతో కేసీఆర్ తెలంగాణ ఎన్నికల చరిత్రలోనే కొత్త రికార్డును నెలకొల్పారు.
తెలంగాణ నుంచి అత్యధికంగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అరుదైన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు.
రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకు దివంగత కాంగ్రెస్ నేత బాగా రెడ్డి, జనారెడ్డి, కేసీఆర్ మాత్రమే ఏడు సార్లు గెలుపొందారు.
గజ్వెల్‌లో మరోసారి గెలుపొందడంతో బాగారెడ్డి, జనారెడ్డిలను దాటి కేసీఆర్ అరుదైన రికార్డును సాధించారు.
జహీరాబాద్ నుంచి బాగా రెడ్డి ఏడుసార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జానారెడ్డి చలకుర్తి నుంచి 1978లో తొలిసారిగా జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. కానీ, ఈ సారి ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహులు చేతిలో ఆయన ఓడిపోయారు.
కేసీఆర్ కూడా 1983లో తొలిసారి సిద్ధిపేట నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ వరస విజయాలు సాధిస్తూ వస్తున్నారు.
హరీష్‌రావు కొత్త రికార్డు
సిద్ధిపేట గెలుపుతో హరీశ్‌రావు కూడా అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు. 1,18,699 ఓట్ల ఆధిక్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా నిలిచారు. అలాగే, అత్యంత పిన్నవయసులో వరసగా ఏడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఇంకో రికార్డు సృష్టించారు.
ప్రస్తుతం ఆయన వయసు 46 ఏళ్లు. గతంలో ఈ రికార్డు కేరళకు చెందిన కేఎం మణి పేరు మీద ఉంది. ఆయన 49 ఏళ్ల వయసులో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
13 సార్లు ఎమ్మెల్యేగా కరుణానిధి రికార్డు
దేశంలో అత్యధికసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు తమిళనాడు మాజీ సీఎం దివంగత కరుణానిధి, కేరళలో కాంగ్రెస్ సీనియర్ నేత కేఎం మణి పేరుమీద ఉన్నది.
వీరిద్దరూ 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది దాదాపు 60 ఏళ్ల పాటు శాసనసభలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం దివంగత జ్యోతిబసు 11 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
తర్వాత స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే ఉన్నారు. ఆయన తొమ్మదిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
ఇవి కూడా చదవండి
- హరీశ్‌రావు: దేశంలో అత్యధిక మెజారిటీ ఈయనదేనా?: బీబీసీ రియాల్టీచెక్
- టీఆర్ఎస్ ప్రస్థానం: పోరు నుంచి పాలన వరకు కారు జోరు
- ‘హైటెక్‌సిటీ’లో తెలుగుదేశం పార్టీ ఓటమి
- సంక్షేమ పథకాల హైవేపై కారు జోరు - ఎడిటర్స్ కామెంట్
- పవన్ కల్యాణ్: ‘ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది’
- నియోజకవర్గాల వారీగా గెలిచిన అభ్యర్థుల జాబితా - Live updates
- కేసీఆర్ వ్యక్తిత్వం: మాటే మంత్రంగా నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం
- తన్నీరు హరీశ్‌రావు: కేసీఆర్ మేనల్లుడిగా వచ్చినా.. సొంత గుర్తింపు సాధించుకున్న నాయకుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








