సైబరాబాద్ ‘హైటెక్ సిటీ’ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి

ఫొటో సోర్స్, tdp.ncbn.official/facebook
సైబరాబాద్‌ను తానే నిర్మించానని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు.
అయితే, అలాంటి చోటే టీడీపీ ఓడిపోయింది. మహాకూటమి సీట్ల కేటాయింపుల్లో భాగంగా సాఫ్ట్ వేర్ కార్యాలయాలకు కేంద్రంగా ఉన్న శేరిలింగపల్లి నియోజకవర్గాన్ని టీడీపీ సాధించికుంది. తమ అభ్యర్థిగా భవ్య ఆనంద్ ప్రసాద్‌ను బరిలోకి దింపింది.
అయితే, హైటెక్ సిటీని అభివృద్ధి చేశానన్న చంద్రబాబు ప్రచారం పనిచేయలేదని ఎన్నికల ఫలితాన్ని బట్టి అర్థమవుతోంది.
అక్కడ టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన అరికె పూడి గాంధీ దాదాపు 43,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గతంలో ఈయన తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించి, టీఆర్ఎస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయనకే టీఆర్ఎస్ టికెట్ దక్కింది.
టీడీపీ ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ఖమ్మం జిల్లా, హైదరాబాద్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి, తమ అభ్యర్థులు గెలుస్తారని ఆశించింది. ఈ ప్రాంతాల్లో ఆంధ్రా ప్రాంతం వారు అత్యధికంగా స్థిరపడ్డారు. వారు తమను ఆదరిస్తారని టీడీపీ భావించింది.
టీడీపీకి బలమైన పట్టుకున్న కూకట్‌పల్లిలో కూడా ఆ పార్టీ విజయం సాధించలేకపోయింది. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు.
ఇవి కూడా చదవండి
- కేసీఆర్ ప్రెస్‌మీట్: ''చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్‌కు.. నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా''
- ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు’ - చంద్రబాబు నాయుడు
- హరీశ్‌రావు: దేశంలో అత్యధిక మెజారిటీ ఈయనదేనా?: బీబీసీ రియాల్టీచెక్
- నియోజకవర్గాల వారీగా గెలిచిన అభ్యర్థుల జాబితా - Live updates
- కేసీఆర్ వ్యక్తిత్వం: మాటే మంత్రంగా నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం
- తన్నీరు హరీశ్‌రావు: కేసీఆర్ మేనల్లుడిగా వచ్చినా.. సొంత గుర్తింపు సాధించుకున్న నాయకుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




