జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దు: నాయకుల మధ్య సోషల్ మీడియాలో పేలిన మాటల తూటాలు

ఫొటో సోర్స్, Getty Images
జమ్ముూ కశ్మీర్‌లో వేగంగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ సత్యపాల్ మాలిక్ బుధవారం నాడు ఆ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేశారు.
అసెంబ్లీ రద్దు చేసే సమయంలో సత్యపాల్ మాట్లాడుతూ, ‘నేను చట్టం కల్పించిన హక్కులను ఉపయోగిస్తూ అసెంబ్లీని రద్దు చేస్తున్నాను. నేను ఎలాంటి పక్షపాతం చూపలేదు. ప్రజా ప్రయోజనం కోసమే నేను ఆ నిర్ణయం తీసుకున్నా’ అని ఆయన అన్నారు.
పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి ఒక ‘అపవిత్ర కూటమి’ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి అని గవర్నర్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ), నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), కాంగ్రెస్‌లు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ చెప్పారు.
ఈ విషయాన్నే లేఖ రూపంలో రాజ్‌భవన్‌కు ఫ్యాక్స్‌లో పంపడానికి ప్రయత్నిస్తున్నానని, కానీ అది వెళ్లట్లేదని, గవర్నర్‌తో ఫోన్‌లో కూడా మాట్లాడటం కుదరలేదని పేర్కొంటూ ఆ లేఖను ఆమె ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
నవంబర్ 21న గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను ఉద్దేశిస్తూ రాసిన ఆ లేఖలో తమకు ఎన్‌సీకి చెందిన 15మంది, కాంగ్రెస్‌కు చెందిన 12మంది సభ్యుల మద్దతు ఉందని తెలిపారు. 87మంది సభ్యులుండే అసెంబ్లీలో ముఫ్తీ పార్టీకి 29మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
గురువారం నాడు ముఫ్తీ రాజ్‌భవన్‌లోని ఫ్యాక్స్ మెషీన్‌ను హేళన చేస్తూ, ‘చాలామంది రాజ్‌భవన్‌కు పంపిన లేఖలు అక్కడిదాకా చేరట్లేదు, కానీ వాళ్లు తెలీక జవాబు కోసం ఎదురు చూస్తున్నారు’ అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. గవర్నర్ తమ లేఖను స్వీకరించి, జవాబివ్వాల్సింది పోయి అసెంబ్లీనే రద్దు చేశారని వాళ్లిద్దరూ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
గవర్నర్ జవాబు
గురువారంనాడు జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాల ఆరోపణలపై జవాబిచ్చారు.
ఆయనేమన్నారంటే...
- నన్ను ఇక్కడ గవర్నర్‌గా నియమించినప్పటి నుంచి నా దృష్టి ఒక్క అంశంపైనే ప్రధానంగా ఉంది. జమ్మూ కశ్మీర్‌లో అవకతవకల ద్వారా ప్రభుత్వం ఏర్పాటు కాకూడదు.
- రాష్ట్రంలో ఎన్నికలు జరగాలి. ప్రజలు ఎన్నుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.
- కొందరు శాసనసభ్యుల్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇంకొందరిని బెదిరిస్తున్నారని నాకు గత 15రోజులుగా ఫిర్యాదులు అందుతున్నాయి.
- అలా ఫిర్యాదు చేసినవాళ్లలో మెహబూబా ముఫ్తీ కూడా ఉన్నారు. తమ శాసనసభ్యులను బెదిరిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇంకొందరు ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.
- నేను పనిచేస్తున్న రాష్ట్రంలో ఇలాంటివాటికి తావుండకూడదు.
- ప్రజాస్వామ్యంలో ఇలాంటి శక్తులు (పీడీపీ, ఎన్‌సీ, కాంగ్రెస్‌ల కూటమి) ఉండకూడదు. పరిస్థితి వాళ్ల చేతుల నుంచి జారిపోతుందని గమనించి ఒక అపవిత్ర కూటమిగా మారి వాళ్లు నా ముందుకు వచ్చారు.
- వాళ్లు ఫ్యాక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఫిర్యాదు చేసిన ఇద్దరూ పక్కా ముస్లింలు. బుధవారంనాడు ఈద్. ఆ రోజు నా కార్యాలయం మూసి ఉంటుందని వాళ్లకు తెలీదా?
- ఈద్ రోజు మా వంట మనిషి కూడా సెలవులో ఉంటాడు. అలాంటిది మిగతా సిబ్బంది ఎలా అందుబాటులో ఉంటారు?
- ఒక వేళ నేను ఫ్యాక్స్‌ను అందుకొని ఉన్నా, నా నిర్ణయాన్ని మార్చుకొని ఉండేవాడిని కాదు.
- నేను ట్విటర్ వాడను. ఎప్పుడూ ట్వీట్ చేయను. అయినా ప్రభుత్వాన్ని సోషల్ మీడియా ద్వారా ఏర్పాటు చేయడమో, కూలదోయడమో జరగదని వాళ్లకు తెలిసుండాలి.
- వాళ్లు దీన్ని కోర్టులో సవాలు చేయాలనుకుంటే చేయొచ్చు. వాళ్లే ఐదు నెలల నుంచి అసెంబ్లీని రద్దు చేయాలని కోరుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Twitter
రామ్ మాధవ్ వివాదాస్పద ట్వీట్
ఈ నేపథ్యంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు.
‘సరిహద్దు అవతలి నుంచి అందిన ఆదేశాలకు అనుగుణంగానే పీడీపీ, ఎన్‌సీలు గత నెలలో స్థానిక ఎన్నికలను బహిష్కరించాయి. బహుశా తాజాగా సరిహద్దు అవతలి నుంచి అందిన ఆదేశాల్లో ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉందేమో’ అని రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు.
కానీ ఆ వ్యాఖ్యలను నిరూపించమని ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా సవాలు విసరడంతో, రామ్ మాధవ్ నవ్వుతూ వాటిని వెనక్కి తీసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘నేను మీ దేశభక్తిని ప్రశ్నించడం లేదు. కానీ, ఉన్నట్టుండి పీడీపీ, ఎన్‌సీల మధ్య చిగురించిన ప్రేమ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆతృత అనేక అనుమానాలకు, రాజకీయ కామెంట్లకు తావిస్తోంది. నాకు మిమ్మల్ని కించపరిచే ఉద్దేశం లేదు’ అని ఒమర్ అబ్దుల్లాను ఉద్దేశిస్తూ రామ్ మాధవ్ మరో ట్వీట్ చేశారు.
‘మీమీద ఎలాంటి బయటి ఒత్తిడీ లేదని చెప్పడం ద్వారా పీడీపీ, ఎన్‌సీ ప్రేమ నిజమైందని తెలుస్తోంది. కానీ, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. ఇప్పుడు రెండు పార్టీలు ఎన్నికల బరిలో దిగాలి. నేను మళ్లీ చెబుతున్నా... నా వ్యాఖ్యలు రాజకీయపరమైనవే తప్ప, వ్యక్తిగతమైనవి కాదు’ అని రామ్ మాధవ్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని రామ్ మాధవ్‌కు సవాలు విసురుతున్నట్లు ఒమర్ అబ్దుల్లా చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
‘మీ చేతుల్లో రా, ఐబీ, ఎన్‌ఐఏ లాంటి సంస్థలున్నాయి. వాటి సాయంతో మీ ఆరోపణలను నిరూపించుకోవాలి. లేకపోతే క్షమాపణ చెప్పాలి. అంతేకానీ ఇలాంటి రాజకీయాలకు పాల్పడకూడదు’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.
‘పీడీపీ, ఎన్‌సీ... ఈ రెండు పార్టీలు ఏదో ఒక దశలో బీజేపీతో కలిసి పనిచేశాయి. కానీ రామ్ మాధవ్ లాంటి వాళ్లు చేసే వ్యాఖ్యలు రాజకీయాల స్థాయిని దిగజారుస్తున్నాయి’ అని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
- యెమెన్ సంక్షోభం: ఆహార లోపం వల్ల 85,000 మంది చిన్నారుల మృతి
- డిప్రెషన్ సమస్యకు వేడినీళ్ల సమాధానం
- అభిప్రాయం: సుష్మా స్వరాజ్ రాజకీయ జీవితం ముగిసినట్లేనా?
- ఇందిరను ఫిరోజ్ మోసం చేశారా? ఇందులో నిజమెంత?
- ప్రతి నెలా జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే, ఈ ఆరు సూత్రాలు పాటించండి
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటి? పాటించకపోతే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








