జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దు: ఫ్యాక్స్ మెషీన్ ఇంత పనిచేసిందా?.. ‘ఫ్యాక్స్ మెషీన్‌పై దర్యాప్తు జరిపించాలి’

ఫొటో సోర్స్, Getty Images
చెడిపోయిన ఫ్యాక్స్ మెషీన్, 'ఆవేశపూరిత' ట్వీట్లు... వెరసి జమ్మూకశ్మీర్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ), నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), కాంగ్రెస్‌లు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బుధవారం నిర్ణయించాయి. అందుకు సంబంధించి ఫ్యాక్స్ ద్వారా గవర్నర్ సత్య పాల్ మాలిక్‌కు లేఖను పంపేందుకు ప్రయత్నించాయి. కానీ, ఆ లేఖ ఫ్యాక్స్‌లో వెళ్లలేదు. దాంతో ప్రత్యామ్నాయంగా పీడీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆయనకు ట్వీట్ చేశారు.
ఆ తర్వాత ఓ గంటలోనే అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. "పరస్పర వ్యతిరేక రాజకీయ భావజాలం" కలిగిన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
"విరుద్ధ భావజాలం కలిగిన పార్టీలు కలిసి వస్తున్నందున స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యం" అని గవర్నర్ అన్నారని స్థానిక మీడియా పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అదలా ఉండగా, తమకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సంఖ్యా బలం ఉందంటూ పీపుల్స్ కాన్ఫరెన్స్ (పీసీ) పార్టీ నేత సాజద్ లోనీ గవర్నర్‌కు ట్వీట్ చేశారు. తాను కూడా లేఖను పంపేందుకు ప్రయత్నించగా ఫ్యాక్స్ పనిచేయలేదని, దాంతో గవర్నర్ వ్యక్తిగత సహాయకుడికి వాట్సాప్‌లో పంపినట్లు సాజద్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నేతృత్వంలోని కూటమి నుంచి ఈ ఏడాది జూన్‌లో బీజేపీ బయటకు వచ్చింది. అనంతరం ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయడంతో జూన్ 19 నుంచి జమ్మూ కశ్మీర్ రాష్ట్రం గవర్నర్ పాలనలో ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఫ్యాక్స్ మెషీన్ పనిచేయకపోవడంపై దర్యాప్తు జరిపించాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.
"ఫ్యాక్స్ మెషీన్ పనిచేయకపోవడం వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అవ్వడం ఇదే తొలిసారి. రాజ్‌భవన్‌లో ఉన్నది వన్- వే ఫ్యాక్స్ మెషీన్ ( దాని నుంచి లేఖలు వెళ్తాయి. కానీ, దానికి మాత్రం రావు). ఇలాంటి మెషీన్ ఎక్కడా ఉండదు. దానిపై దర్యాప్తు జరిపించాలి" అని ఒమర్ అబ్దుల్లా అన్నారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.
"జమ్మూ కశ్మీర్ రాజ్‌భవన్‌కు అర్జెంటుగా ఓ కొత్త ఫ్యాక్స్ మెషీన్ అవసరం ఉంది" అని ఆయన ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- జమ్ము కశ్మీర్ అసెంబ్లీ రద్దు: ఈ డ్రామా వెనకున్నదేమిటి?
- టీచర్లకు ఏ దేశంలో ఎక్కువ గౌరవం లభిస్తోంది?
- అమెరికా యాత్రికుడిని 'చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు'
- శ్రీలంకలో శవాల దిబ్బ: మన్నార్ సమాధిలో 230 అస్థిపంజరాలు... అవి ఎవరివి? హంతకులెవరు?
- తెలంగాణ అసెంబ్లీ రద్దు వెనుక ఉన్నదేమిటి :ఎడిటర్స్ కామెంట్
- ఊబకాయం కేన్సర్‌కు దారితీయొచ్చు... జాగ్రత్త
- యెమెన్ సంక్షోభం: ఆహార లోపం వల్ల 85,000 మంది చిన్నారుల మృతి
- ‘ఆర్బీఐకి ప్రభుత్వాన్ని ఎదిరించే హక్కు ఉండదు’
- హార్లిక్స్: విటమిన్ D కి మూలం శాకాహార పదార్థాలా, మాంసాహార పదార్థాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)