టీచర్లకు గౌరవం ఇవ్వడంలో చైనా నం.1, మరి భారత్?

ఫొటో సోర్స్, Getty Images
ఉపాధ్యాయులను అత్యంత గౌరవం ఇచ్చే దేశాల్లో చైనా ప్రథమ స్థానంలో నిలిచిందని తాజా జరిగిన ఓ అంతర్జాతీయ సర్వేలో తేలింది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో మలేసియా, తైవాన్ ఉండగా, భారత్ ఎనిమిదవ ర్యాంకు సాధించింది.
బ్రెజిల్, ఇజ్రాయెల్, ఇటలీ దేశాలు అట్టడుగున ఉన్నాయి. బ్రిటన్ 35వ స్థానంలో ఉంది.
చైనాలో టీచర్ల పట్ల పిల్లలు గౌరవంగా మెలుగుతారని 81 శాతం మంది చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే అది 36 శాతం మాత్రమే ఉంది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అండ్ సోషల్ రీసెర్చ్, వర్కీ ఫౌండేషన్ నిర్వహించిన ఈ అధ్యయనంలో 35,000 మంది మాట్లాడారు.

ఫొటో సోర్స్, Prashant ravi
టీచర్లను గౌరవించే సంస్కృతి
యూరప్, దక్షిణ అమెరికా దేశాల్లో "సాధారణంగా ఉపాధ్యాయులను విద్యార్థులు గౌరవించడం తక్కువగా" ఉంటోందని ఈ అధ్యయనం తెలిపింది.
ఉపాధ్యాయులను గౌరవించే సంస్కృతి చైనా, భారత్, సింగపూర్, దక్షిణ కొరియా సహా ఆసియా దేశాల్లో బలంగా ఉంది. ఈ దేశాల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి పరీక్షల్లోనూ మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు.
ఉపాధ్యాయలకు మంచి గౌరవం లభించినప్పుడు ఆ వృత్తిని ఎంచుకునేందుకు ప్రతిభావంతులు ఎక్కువగా ముందుకొస్తారని, దాంతో చదువుల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఈ అధ్యయనం చెబుతోంది.
ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు బోధనా వృత్తిని ఎంచుకోవాలని కోరుకుంటున్నారో అధ్యయనకర్తలు పరిశీలించారు.
భారత్, చైనా, ఘనా దేశాల్లో అత్యధిక కుటుంబాలు తమ పిల్లలను ఉపాధ్యాయులు అయ్యేలా ప్రోత్సహిస్తున్నారు.
రష్యా, ఇజ్రాయేల్, జపాన్‌లో మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ దేశాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోకుండా నిరుత్సాహపరుస్తున్నారని తేలింది.
బ్రిటన్‌లో 23 శాతం కుటుంబాలు తమ పిల్లలను బోధన రంగాన్ని ఎంచుకునే ప్రోత్సహిస్తాయని వెల్లడైంది.

ఫొటో సోర్స్, Praveen/bbc
ప్రజల అభిప్రాయం ఏమిటి?
ఉపాధ్యాయుల వృత్తి జీవితం పట్ల ప్రజల అభిప్రాయం ఎక్కడ ఎలా ఉందో తెలుసుకునేందుకు అధ్యయనకర్తలు ప్రయత్నించారు.
అత్యధిక పని గంటలు ఉండే న్యూజీలాండ్‌తో పాటు, అతి తక్కువ పని గంటలు ఉండే పనామా, ఈజిప్టుల్లోనూ టీచర్ల పనిని తక్కువ అంచనా వేస్తారని తేలింది.
ఫిన్‌లాండ్, కెనడాలో మాత్రం తమ ఉపాధ్యాయులు నిర్దేశిత సమయం కంటే ఎక్కువ సేపు పని చేస్తారని ప్రజలు భావిస్తారు.
టీచర్లకు అత్యధిక పని గంటలు ఉన్న దేశాల్లో బ్రిటన్ నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ వారానికి 50 గంటలకు పైగా పనిచేస్తారు.
2013లోనూ ఇలాంటి సర్వే జరిగింది. ఈ అయిదేళ్లలో ఉపాధ్యాయుల వేతనాల పట్ల ప్రజల అభిప్రాయంలో ఎక్కువగా తేడా కనిపించింది.
వేతనాల విషయంలో 2013తో పోల్చితే, 2018లో టీచర్లకు మద్దతు తగ్గింది. ఫిన్‌లాండ్‌లో 80 శాతం నుంచి 21 శాతానికి, బ్రిటన్‌లో 74 శాతం నుంచి 34 శాతానికి తగ్గింది.
ఉపాధ్యాయులకు సమాజం ఇచ్చే గౌరవానికి, విద్యార్థుల ప్రతిభకు మధ్య సంబంధం ఉంటుందనడానికి ఈ అధ్యయనం రుజువు చూపించిందని ఈ సర్వే నిర్వహించిన ఫౌండేషన్ వ్యవస్థాపకులు సన్నీ వర్కీ అన్నారు.
దీన్ని బట్టి ఉపాధ్యాయులను గౌరవించడం ఒక నైతిక కర్తవ్యం మాత్రమే కాదు, విద్యా వ్యవస్థ బాగుపడాలంటే టీచర్లను గౌరవించడం ఎంతో ముఖ్యం.
ఉపాధ్యాయ వృత్తిని గౌరవించడంలో ముందున్న 10 దేశాలు
1. చైనా
2. మలేసియా
3. తైవాన్
4. రష్యా
5. ఇండోనేసియా
6. దక్షిణ కొరియా
7. టర్కీ
8. భారత్
9. న్యూజీలాండ్
10. సింగపూర్
ఇవి కూడా చదవండి
- తెలంగాణ విద్యుత్ రంగం: 24 గంటల విద్యుత్ విజయమా? వ్యయమా?
- 1,398 మంది రైతుల రుణాలు మాఫీ చేసిన అమితాబ్ బచ్చన్
- నల్లగొండ జిల్లాలో ఆడపిల్లల అమ్మకాలు ఆగిపోయాయా? సంక్షేమ పథకాలతో సమస్య పరిష్కారమైందా?
- 96 ఏళ్ల వయసులో మూడో తరగతి పాసైన బామ్మ
- ‘అమ్మా... అందరూ నన్ను చూసి ఎందుకు నవ్వుతారు?’
- కంచుకోటలోనూ కమ్యూనిస్టులు ఎందుకు తడబడుతున్నారంటే..
- హ్యాపీయెస్ట్ కంట్రీస్‌లో సంతోషం అంతంతేనా?
- ‘క్రైస్తవ మత ప్రచారకుడిని చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు’
- హార్లిక్స్: విటమిన్ D కి మూలం శాకాహార పదార్థాలా, మాంసాహార పదార్థాలా?
- అండమాన్‌లో క్రైస్తవ మత ప్రచారకుడి హత్య: ‘సువార్త బోధించేందుకే అక్కడికి వెళ్లాడు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)









