‘తిలక్ వర్మ కోహ్లీలాంటోడు’ అని మాజీ క్రికెటర్లు ఎందుకంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రవీణ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘తిలక్ వర్మ పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ లాగా ఇన్నింగ్స్ ఆడాడు, అది కూడా ఫైనల్ లో’’ అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
ఆదివారం దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత, సోషల్ మీడియాలో, ఆసియా కప్ అధికారిక బ్రాడ్ కాస్టర్‌లో ప్రధానమైన చర్చనీయాంశం ఏదైనా ఉందంటే అది తిలక్ వర్మ గురించి మాత్రమే.
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ తిలక్ ఇన్నింగ్స్‌ను 2022 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో పోల్చాడు.

"తిలక్ వర్మకు ధైర్యం ఉంది"

ఫొటో సోర్స్, Getty Images
ఐపీఎల్ 2022 కోసం తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంది.
తన మొదటి సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 397 పరుగులు చేశాడు తిలక్. భవిష్యత్తులో తాను ఒక సెన్సెేషన్ అవుతానన్న నమ్మకాన్ని కలిగించాడు.
మొదటి సీజన్ విజయం తర్వాత, రోహిత్ శర్మ "తిలక్ వర్మకు ధైర్యం ఉంది" అని అన్నాడు.
‘‘తిలక్ వర్మ ఒక ప్రత్యేక ఆటగాడిగా ఎదగబోతున్నాడని నాకు కచ్చితంగా తెలుసు" అని సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, వ్యాఖ్యాత హర్ష భోగ్లే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రాశారు.
రెండు సక్సెస్‌ఫుల్ సీజన్ల తర్వాత, తిలక్ వర్మ టీమ్ ఇండియాలో చేరడానికి మార్గం సుగమం అయింది. ఆగస్టు 2023లో, వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసే అవకాశం అతనికి లభించింది.
అయితే గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో, తిలక్ వర్మకు టీమ్ ఇండియాలో సరైన స్థానం దక్కింది. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. తిలక్ వర్మ 56 బంతుల్లో 107 పరుగులు చేయడం ద్వారా జట్టు నమ్మకాన్ని నిలబెట్టాడు.
తర్వాతి మ్యాచ్‌లో, ఒక అడుగు ముందుకు వేసి కేవలం 47 బంతుల్లో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
"చాలా ఒత్తిడి ఉంది"

ఫొటో సోర్స్, Getty Images
ఇక మ్యాచ్ తర్వాత, "నాపై చాలా ఒత్తిడి ఉంది. అతను బాగా బౌలింగ్ చేస్తున్నాడు. శాంసన్ మంచి మద్దతు ఇచ్చాడు. దూబే ఇన్నింగ్స్ కూడా అద్భుతంగా ఉంది"
"నేను చాలా కష్టపడ్డా. నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన ఇన్నింగ్స్‌లలో ఒకటి. ఇది భారతీయులందరి కోసం" అంటూ తిలక్ స్పందించాడు.

ఫొటో సోర్స్, ANI
మ్యాచ్, తిలక్ వర్మల ఆట తీరుపై ఎవరేమన్నారంటే...
"ఆపరేషన్ సిందూర్ మైదానంలో కనిపించింది. ఫలితం మాత్రం అదే – భారత్ విజయం సాధించింది! మన క్రికెటర్లకు అభినందనలు" అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా భారత జట్టును ప్రశంసించారు.
నటుడు అమితాబ్ బచ్చన్ కూడా భారత జట్టును అభినందించారు. అంతకు ముందు ఓ టీవీ చానెల్ చర్చలో, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్, భారత యువ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మను అభిషేక్ బచ్చన్‌గా సంబోధించడంపై కూడా బచ్చన్ స్పందించారు.
‘‘ అక్కడ నాలుక తడబడింది, ఇక్కడ, బ్యాటింగ్, బౌలింగ్ లేదా ఫీల్డింగ్ లేకుండా, అతను శత్రువును తడబడేలా చేశాడు!! అని అమితాబ్ తన ఎక్స్ పోస్ట్‌లో రాశారు.
"తిలక్ చాలా గొప్పగా ఆడావ్" అంటూ కెవిన్ పీటర్సన్ స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా అభిమానుల్లో సంతోషం కనిపించింది. అమృత్‌సర్‌లో ఫ్యాన్స్ టపాకాయలు కాలుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు.
మరోవైపు ఆపరేషన్ తిలక్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో అభిమానులు ట్రెండ్ చేశారు.
భారత జట్టును కాపాడిన తిలక్ వర్మ - అద్భుతమైన ప్రదర్శన! అంటూ ఒక క్రికెట్ అభిమాని ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా కప్ టీ20 ఫైనల్ మ్యాచ్‌లో భారత్-పాకిస్తాన్ పోరును అభిమానులు ఆసక్తిగా వీక్షించారు. కరాచీలో ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్‌పై మ్యాచ్‌ని చూశారు.
అయితే మ్యాచ్ పాకిస్తాన్ చేజారుతున్నట్లు కనిపించడంతో జట్టు అభిమానులు ఇలా నిరాశగా కనిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొట్టిన బంతిని క్యాచ్ చేసిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా ఇలా సంతోషం వ్యక్తం చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఇన్నింగ్స్ ఆరంభంలో బాగా ఆడినట్లు కనిపించిన పాకిస్తాన్ జట్టు సగం మ్యాచ్ తర్వాత వేగంగా వికెట్లు కోల్పోవడంతో పాకిస్తాన్ జట్టు అభిమాని ఒకరు ఇలా దిగాలుగా కనిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించడంతో వారణాసిలో అభిమానులు ఇలా రోడ్లపైకొచ్చి సంబరాలు చేసుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














