తమిళనాడు: విజయ్ ర్యాలీలో తొక్కిసలాట దృశ్యాలు.. 9 ఫోటోలలో

కరూర్ తొక్కిసలాట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తొక్కిసలాటలో అయినవారిని పోగొట్టుకుని గుండెలవిసేలా రోదిస్తున్న బంధువులు

తమిళ నటుడు, టీవీకే నేత విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 39 మంది మృతి చెందారని తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి సెంథిల్ కుమార్ తెలిపారు.

ప్రాణాలు కోల్పోయిన హేమలత, ఆమె ఇద్దరు పిల్లలు సాయిజీవ, సాయిలేచన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన హేమలత, ఆమె ఇద్దరు పిల్లలు సాయిజీవ, సాయిలేచన
కరూర్ విజయ్ సభ తొక్కిసలాట
ఫొటో క్యాప్షన్, రోదిస్తున్న మృతుల బంధువులు

శనివారం(సెప్టెంబర్ 27) కరూర్‌లోని వేలుచామిపురంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో టీవీకే నేత విజయ్ పాల్గొన్నారు. జనం భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. సంఘటన జరిగిన ప్రదేశంలో వందల సంఖ్యలో చెప్పులు, తువ్వాళ్లు, వాటర్ బాటిళ్లు చెల్లాచెదురుగా పడిఉన్నాయి.

Thamaraikannan (Vedasanthur), Manikandan (Vellakoil), Ramesh (Kodangipatti)
ఫొటో క్యాప్షన్, తమరై కణ్ణన్, మణికంఠన్, రమేష్ తొక్కిసలాటలో మృతి చెందారు
కరూర్ విజయ్ సభ తొక్కిసలాట
ఫొటో క్యాప్షన్, ఘటనాస్థలంలో ఎక్కడ చూసినా చెప్పులే కనిపిస్తున్నాయి

ఆస్పత్రుల వద్ద బాధితుల బంధువులు రోదిస్తున్నారు. కరూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 61 మంది చికిత్స పొందుతున్నారు.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున తమిళనాడు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

తొక్కిసలాట

ఫొటో సోర్స్, CMO Tamilnadu

ఫొటో క్యాప్షన్, బాధితులను పరామర్శిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్
తొక్కిసలాట
ఫొటో క్యాప్షన్, ఘటనాస్థలి వద్ద పరిస్థితి
తొక్కిసలాట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరూర్ ప్రభుత్వ బోధనాసుపత్రిలో 52 మంది చికిత్సపొందుతున్నారు. వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచారు.
తొక్కిసలాట
ఫొటో క్యాప్షన్, తొక్కిసలాటలో మృతి చెందినవారికి ఒకొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని విజయ్ ప్రకటించారు. గాయపడిన వారికి 2 లక్షల పరిహారాన్ని ఇస్తానంటూ ఆయన ఒక ప్రకటన చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)