ఆసియా కప్ 2025 విజేత భారత్, పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా కప్ 2025 టీ20 విజేతగా నిలిచింది భారత్. దుబయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది.
147 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది.
ఈ టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లలోనూ భారత్ విజయదుందుభి మోగించింది.
53 బంతుల్లో 69 పరుగులు చేసిన తిలక్ వర్మ భారత్ విజయంలో కీలకంగా నిలిచాడు. శివమ్ దూబె 33 పరుగులతో అజేయంగా ఉన్నాడు.
ఆసియా కప్ 2025 టీ20 టోర్నీలో అన్ని మ్యాచ్‌లలోనూ భారత్ గెలుపొందింది.
20 ఓవర్‌లో తిలక్ వర్మ కొట్టిన సిక్స్‌తో మ్యాచ్ దాదాపుగా భారత్ చేతుల్లోకి వచ్చింది.
చివరి ఓవర్ 4వ బంతికి రింకూ ఫోర్‌తో భారత్ విజయం సాధించింది.
తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.


ఫొటో సోర్స్, Getty Images
19వ ఓవర్ చివరి బంతిని షాట్ కొట్టేందుకు ప్రయత్నించి శివమ్ దూబె ఔటయ్యాడు. భారత్ 19 ఓవర్లకు 137 పరుగుల వద్ద ఉంది.
భారత జట్టు 17 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది.
క్రీజ్‌లో గట్టిగా నిలదొక్కుకున్న తిలక్ వర్మ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
తిలక్ వర్మ, శివమ్ దూబె క్రీజులో ఉన్నారు.
భారత్ లక్ష్యం 147 పరుగులు.

ఫొటో సోర్స్, Getty Images
సంజు సామ్సన్, తిలక్ వర్మ కలిసి భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.
కానీ 24 పరుగులు చేశాక సంజు శాంసన్‌ను అబ్రార్ అహ్మద్ అవుట్ చేశాడు.
12.2 ఓవర్లకు 77 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది.
అంతకుముందు 10 ఓవర్లకు 58 పరుగులు చేసిన భారతజట్టు మూడు వికెట్లు కోల్పోయింది.
ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్‌లో, 4వ ఓవర్ చివరి బంతికి శుభ్‌మన్ గిల్ 12 పరుగులు చేసి వెనుదిరిగాడు.
మూడో ఓవర్ మూడో బంతికి షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో సూర్య కుమార్ యాదవ్ పెవిలియన్ బాట పట్టాడు.
రెండవ ఓవర్ మొదటి బంతికే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ ఔటయ్యాడు. ఫహీమ్ అష్రఫ్ అభిషేక్ శర్మ వికెట్ తీసుకున్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 19.1 ఓవర్లో 146 పరుగులు చేసింది.
భారత్ లక్ష్యం 147 పరుగులు.

ఫొటో సోర్స్, Getty Images
కుల్దీప్ 4 వికెట్లు తీయడంతో పాకిస్తాన్ జట్టు 19.1 ఓవర్లో 146 పరుగులకే పరిమితమైంది.
సాహిబ్జాదా ఫర్హాన్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. .
బుమ్రా, అక్షర్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు పడగొట్టారు.
పాకిస్తాన్‌కు శుభారంభం లభించినప్పటికీ, ఆ తర్వాత వికెట్లు వెంటవెంటనే పడడంతో 146 పరుగులు మాత్రమే చేయగలిగింది.
వరుణ్ చక్రవర్తి 10వ ఓవర్ 4వ బంతికి సాహిబ్జాదా ఫర్హాన్‌ను ఔట్ చేయడం ద్వారా భారత్‌కు తొలి వికెట్ దక్కింది.
ఫర్హాన్ 37 బంతుల్లో 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 9.4 ఓవర్ల తర్వాత, పాకిస్తాన్ ఒక వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది.
పవర్‌ప్లేలో శివమ్ దుబే, బుమ్రాతో సహా నలుగురు బౌలింగ్ చేశారు.
వరుణ్ చక్రవర్తి భారత్‌కు తొలి వికెట్ ఇచ్చాడు. 10వ ఓవర్ నాల్గవ బంతికి సాహిబ్జాదా ఫర్హాన్‌ను అవుట్ చేశాడు.
ఫర్హాన్ 37 బంతుల్లో 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఫొటో సోర్స్, Getty Images
12.5 ఓవర్లలో పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సైమ్ అయూబ్‌ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు.
13 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 2 వికెట్లకు 113 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ 37 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
14వ ఓవర్ మూడో బంతికి అక్షర్ పటేల్ మొహమ్మద్ హారిస్‌ను ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపాడు.
15వ ఓవర్ నాల్గవ బంతికి 46 పరుగులు చేసిన ఫఖర్ జమాన్‌ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు.
పాకిస్తాన్ 17 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. పాకిస్తాన్ 21 పరుగుల తేడాతో ఏడు వికెట్లు కోల్పోయింది.
17వ ఓవర్లో ఖాతా తెరవకుండానే కుల్దీప్.. యాదవ్ షాహీన్ అఫ్రిది, ఫహీమ్ అష్రఫ్‌లను పెవిలియన్‌కు పంపాడు.
అంతకుముందు, 8 పరుగులు చేసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
భారత క్రికెట్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
టాస్ సమయంలో గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ప్లేయింగ్ 11లో ఉండడని భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ ప్రకటించాడు. పాండ్యా స్థానంలో రింకూ సింగ్ ఆడుతున్నాడు.
అయితే, పాకిస్తాన్ తన ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులూ చేయలేదు.
ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు భారత్ జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. పాకిస్తాన్ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
గ్రూప్ దశ, సూపర్-4 తర్వాత, ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడటం ఇది మూడోసారి.
గత రెండు మ్యాచుల్లోనూ భారత్ పాకిస్తాన్‌పై విజయం సాధించింది.
అయితే, ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్‌లో తలపడటం ఇదే తొలిసారి.
గత భారత, పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. ఈ ఏడు మ్యాచ్‌లలోనూ భారత్ పాకిస్తాన్‌ను ఓడించింది.
ఆసియా కఫ్ 2025 ఫైనల్ తుది జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్షర్ పటేల్, శివమ్ దుబే, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్, షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ నవాజ్, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














