పాప్ సింగర్ సెలీనా గోమెజ్ ఎంగేజ్‌మెంట్, వరుడు ఎవరంటే

సెలీనా గోమేజ్, బెన్నీ బ్లాంకో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెలీనా గోమేజ్, బెన్నీ బ్లాంకో జంట 2023లోనే వారి రిలేషన్‌షిప్‌ను ధ్రువీకరించారు.
    • రచయిత, ఆండ్రే రోడెన్-పాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాప్ సింగర్ సెలీనా గోమెజ్ నిశ్చితార్థం చేసుకున్నారు. వరుడి పేరు బెన్నీ బ్లాంకో. సెలీనా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపుతూ "ఫరెవర్ బిగిన్స్ నౌ" అనే క్యాప్షన్‌తో ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ జంట గత ఏడాదే వారి రిలేషన్‌షిప్‌ను ధ్రువీకరించారు.

పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్‌తో పాటు పలువురు ప్రముఖులు సెలీనా జంటకు శుభాకాంక్షలు తెలిపారు. సెలీనా ఉంగరం తొడిగిన చేయిని చూపిస్తూ నవ్వుతున్న ఒక ఫొటో, బెన్నీని కౌగిలించుకున్న మరొక ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

సెలీనా పోస్టుపై బెన్నీ 'హే ఆగండి.. ఆమె నా భార్య' అని కామెంట్ పెట్టారు.

"నేనే ఫ్లవర్ గర్ల్ అవుతాను" అని టేలర్ స్విఫ్ట్ రిప్లై ఇచ్చారు.

సెలీనా జంటకు టేలర్‌తో పాటు ర్యాపర్ కార్డి బీ, నటి గ్వినేత్ పాల్, జెన్నీఫర్ ఆనిస్టన్, సుకీ వాటర్‌హౌస్, సింగర్ లిల్ నాస్ ఎక్స్ తదితర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Instagram ముగిసింది

బెన్నీ ఏమన్నారు?

సెలీనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 42.3 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో అత్యధికంగా ఫాలోవర్లున్న మహిళ కూడా ఆమెనే. ఫోన్ కాల్‌లో ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను తన ప్రియమైన వారికి చూపుతున్న వీడియోను సెలీనా షేర్ చేశారు.

వీడియోలో కాల్‌కి అవతలి వైపు ఉన్న వ్యక్తులు ఉత్సాహంతో అరుస్తుండగా సెలీనా "దీనికి యస్" అని చెప్పడం వినిపిస్తుంది.

పాటల రచయిత, రికార్డ్ ప్రొడ్యూసర్ అయిన బెన్నీ బ్లాంకో.. సెలీనాలు తమ రిలేషన్‌షిప్ ప్రకటించడానికి ముందు అంటే 2019లో 'ఐ కాంట్ గెట్ ఎనఫ్', 2023లో 'సింగిల్ సూన్' పాటల్లో కలిసి పనిచేశారు.

రిహానా, కాల్విన్ హారిస్, జస్టిన్ బీబర్ వంటి పాపులర్ స్టార్లతో కలిసి పనిచేశారు బెన్నీ.

మేలో జరిగిన డ్రూ బారీమోర్ షోలో సెలీనా గురించి ఆయన వివరాలు పంచుకున్నారు.

"ఆమె బెస్ట్, అత్యంత నిజాయితీ గల వ్యక్తి" అని బెన్నీ చెప్పారు.

"అంతా నిజమే. రోజూ నిద్రలేచి, ఆమె దగ్గిరికి వెళ్లినట్లు అద్దం వద్దకు వెళతాను, 'నేను ఇక్కడికి ఎలా రాగలిగాను' అని అనుకుంటాను" అని అన్నారు.

"నేను ఇప్పటివరకు కలుసుకున్న మధురమైన, అత్యంత మనోహరమైన, వినయపూర్వకమైన వ్యక్తులలో ఆమె ఒకరు" అని బెన్నీ అన్నారు.

సెలీనా గోమేజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెలీనా

బిలియనీర్

సెలీనా గోమెజ్ పాపులర్ పాటల్లో 'కమ్ అండ్ గెట్ ఇట్' ఒకటి. ఆమె గతంలో పాపులర్ సింగర్ జస్టిన్ బీబర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.

టెక్సస్‌లో జన్మించిన సెలీనా.. సంగీతం, నటనా రంగంలోకి రాకముందు బర్నీ, డిస్నీ ఛానెల్‌లో బాలనటిగా ప్రసిద్ధి చెందారు.

ఇటీవల సెలీనాను బ్లూమ్‌బెర్గ్ సంస్థ బిలియనీర్ సెలబ్రిటీల జాబితాలో చేర్చింది. ఆమెకు దాదాపు రూ. 11 వేల కోట్ల (1.3 బిలియన్ డాలర్స్) ఆస్తి ఉన్నట్లు వెల్లడించింది. ఈ సంపాదనలో అత్యధికంగా ఆమెకు బ్యూటీ మేకప్ బ్రాండ్ ద్వారా వచ్చినట్లు తెలిపింది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో సోమవారం ఆమెకు రెండు నామినేషన్‌లు దక్కాయి. అందులో ఒకటి 'మ్యూజికల్ ఎమిలియా పెరెజ్‌'లో ఉత్తమ సహాయ నటిగా, మరొకటి టీవీ సిరీస్, మ్యూజికల్ లేదా కామెడీలో 'ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్‌'లో ఉత్తమ నటిగా నామినేషన్ దక్కింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)