ఒక్క అడుగు ముందుకేస్తే ఆ ట్రక్కు కూడా నదిలోనే...వడోదర వంతెన ప్రమాద తీవ్రతను చెప్పే ఫోటోలు...

ఫొటో సోర్స్, ANI
బుధవారం గుజరాత్‌లోని వడోదర జిల్లాలో మహి నదిపై ఉన్న పాత వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వడోదర కలెక్టర్ అనిల్ ధమేలియా తెలిపారు.
ఈ వంతెన మధ్య భాగం కూలిపోయింది. దీంతో కొన్ని వాహనాలు నదిలో పడిపోయాయి.


ఫొటో సోర్స్, ANI
వడోదరలో వంతెన కూలి తొమ్మిది మంది మరణించారు."రెండు ట్రక్కులు, ఒక పికప్ వ్యాన్, ఒక ఎకో కారు, ఒక ఆటో రిక్షా నీటిలో పడిపోయాయి" అని వడోదర కలెక్టర్ అనిల్ ధమేలియా తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
వంతెనలో కూలిపోయిన వాహనాల్లోని వారిని, పడవల్లో వెళ్లి రక్షిస్తున్న స్థానికులు.

ఫొటో సోర్స్, ANI
నది ఒడ్డున బురద పేరుకుపోవడంతో గాయపడినవారిని ఇలా ఒడ్డుకు చేర్చి ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు పరిహారం ప్రకటించారు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.

ఫొటో సోర్స్, UGC
వంతెన విరిగిన రెయిలింగ్ దగ్గర ఒక ట్రక్కు వేలాడుతూ కనిపించింది. ఇంకొక్క అడుగు ముందుకు వచ్చి ఉంటే అది కూడా నీళ్లలో పడిపోయి ఉండేది.

ఫొటో సోర్స్, ANI
వంతెనలో పడిపోయిన లారీకి తాడుకట్టి ఒడ్డుకు లాగుతున్న ప్రజలు.

ఫొటో సోర్స్, Nachiket Mehta
ఈ వంతెన దాదాపు నాలుగు దశాబ్దాల నాటిదని, దీన్ని1983–84లో నిర్మించారని ఆనంద్ కలెక్టర్ ప్రవీణ్ చౌధరి బీబీసీకి తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














