ఇజ్రాయెల్-హమాస్: రెండేళ్ల నిరీక్షణ ముగిసిన క్షణం.. బందీల విడుదల వేళ భావోద్వేగాలు - 8 ఫోటోలలో

ఫొటో సోర్స్, Chris McGrath/Getty Images
హమాస్ విడుదల చేసిన బందీలకు స్వాగతం పలికేందుకు టెల్ అవీవ్‌లోని హోస్టేజ్ స్క్వేర్‌కు ఇజ్రాయెల్ ప్రజలు భారీగా తరలివచ్చారు.
బందీల విడుదల కోసం కొన్నినెలలుగా అక్కడ ర్యాలీలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా తమ దగ్గర ఉన్న ఇజ్రాయెల్ బందీల్లో 20మందిని హమాస్ రెడ్‌క్రాస్‌కు అప్పగించింది.
2023 అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి తరువాత రెండేళ్ల పాటు సాగిన యుద్ధానికి ఇటీవలి కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతానికి ముగింపునిచ్చింది. ఒప్పందంలో భాగంగా హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడుదల చేసేందుకు అంగీకారం కుదిరింది.
వారి విడుదల సందర్భంగా హోస్టేజెస్ స్క్వేర్ వద్ద బందీల కుటుంబసభ్యులు, బంధువులే కాకుండా పెద్ద ఎత్తున ప్రజలు చేరారు.


ఫొటో సోర్స్, Reuters
బందీలకు స్వాగతం చెప్పేందుకు తెల్లవారుజామునుంచే వారి కుటుంబసభ్యులు, బంధువులతో పాటు ఇజ్రాయెల్ ప్రజలు పెద్ద సంఖ్యలో హోస్టేజ్ స్క్వేర్ వద్దకు చేరుకున్నారు. బందీల విడుదల వార్త వినగానే వారంతా భావోద్వేగానికి లోనయ్యారు.

ఫొటో సోర్స్, Alexi J. Rosenfeld/Getty Images
హమాస్ అప్పగించిన బందీలను రెడ్‌క్రాస్ ఇజ్రాయెల్ భద్రతాదళాలకు అప్పగించింది. బందీలను ఇజ్రాయెల్ మిలటరీ కాన్వాయ్ రిసెప్షన్ పాయింట్ దగ్గరకు తీసుకెళ్లింది.

ఫొటో సోర్స్, Chris McGrath/Getty Images
హమాస్ బందీలను విడుదల చేయడానికి సంబంధించి అధికారిక సమాచారం రాకముందే బందీలు కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడుతున్న ఫోటోలు కనిపించాయి.

ఫొటో సోర్స్, Mostafa Alkharouf/Anadolu via Getty Images
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 250 మంది పాలస్తీనా ఖైదీలను, నిర్బంధంలో ఉన్న 1,700 మందిని ఇజ్రాయెల్ విడుదల చేయనుంది.

ఫొటో సోర్స్, HAZEM BADER / AFP) (Photo by HAZEM BADER/AFP via Getty Images
కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పెద్దసంఖ్యలో ప్రజలు ఉత్తరగాజాకు తరలివచ్చారు. ఉత్తర గాజాలో కీలక పట్టణమైన ఖాన్ యూనిస్ మొత్తం శిథిలావస్థలో కనపిస్తోంది. సహాయసామాగ్రి ఉన్న లారీలు గాజాకు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Doaa Albaz/Anadolu via Getty Images

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














