స్పీడ్ డేటింగ్: ప్రభుత్వమే పెళ్లిళ్లు ఎందుకు కుదుర్చుతోంది?

వీడియో క్యాప్షన్, దక్షిణ కొరియాలో జననాల రేటు తగ్గుతున్న కారణంగా - యువత కోసం స్పీడ్ డేటింగ్ ఈవెంట్లను నిర్వహిస్తున్న ప్రభుత్వం

సౌత్ కొరియాలో పెళ్లిళ్లు తగ్గిపోతున్నాయి, జననాల రేటు కూడా తగ్గుతోంది.

ఈ రెండు సమస్యలపై ఆందోళన చెందుతున్న అక్కడి ప్రభుత్వం పరిష్కారానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది.

అందులో భాగంగానే బ్యాచిలర్స్‌ను పార్టీలకు పిలిచి, అందరినీ ఒక చోట చేర్చి జంటలను కలుపుతోంది. వివాహాలకు ఈ స్పీడ్ డేటింగ్ ఈవెంట్స్ వేదికగా మారాయి.

మరో వైపు మ్యారేజ్ బ్యూరోలు విపరీతంగా పెరిగిపోయాయి. తమ వద్ద ప్రొఫైల్ నమోదు చేసుకున్నవారికి భాగస్వామిని వెతికిపెడుతున్నాయి.

దక్షిణ కొరియాలో పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం చేపడుతోన్న కార్యక్రమాలు పైన వీడియోలో చూద్దాం..

దక్షిణ కొరియాలో వివాహం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)