రుషికొండ భవనాల లోపల ఏముంది?

వీడియో క్యాప్షన్, రుషికొండ ‘రహస్య’ భవనాల్లో ఏముందంటే?

“విదేశాల నుంచి దిగుమతి అయిన మార్బుల్స్, టైల్స్‌తో నిర్మించిన గదులు, దాదాపు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో బాత్రూంలు, భవనం లోపల విలాసవంతమైన నడకదారులు, ఖరీదైన షాండ్లియర్లు, 400 మంది ఒకేసారి సమావేశమయ్యేలా మీటింగ్ రూమ్స్, భవనాల బయట ఎటుచూసినా పచ్చదనం, భవనాల లోపల నుంచి ఎటు చూసినా సముద్రం కనిపించేలా నిర్మాణం’’

ఈ వర్ణనంతా విశాఖ రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాలు, అందులోని హంగులు, సదుపాయాల గురించే.

రుషికొండ

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడంతో టీడీపీ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. రుషికొండపై భవనాల్లో ఏముందో మీడియాకు చూపించారు.

గత మూడేళ్లుగా రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలు ఎందుకో తెలియనివ్వలేదు. అసలు అందులో ఏం నిర్మిస్తున్నారో చెప్పలేదు అని టీడీపీ నేతలు ఆరోపించారు.

ఇంతకీ రుషికొండపై భవనాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)