ఏడీఆర్ నివేదిక: అత్యధిక విరాళాలు బీజేపీకే

నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏ జాతీయ పార్టీకి ఎంత మేర విరాళాలు అందాయనే వివరాలను ఏడీఆర్ తన నివేదికలో తెలిపింది.

ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని, దానిని రద్దు చేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది.

ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచడం సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ సందర్భంలో, జాతీయ పార్టీలకు అసలు విరాళాల తీరు ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం.

రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చులు, పారదర్శకత అంశాలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ అధ్యయనం చేస్తుంటుంది. ఏ జాతీయ పార్టీకి ఎంత మేర విరాళాలు అందాయనే వివరాలను ఏడీఆర్ తన నివేదికలో తెలిపింది. ఆ సమాచారాన్ని ఇక్కడ గ్రాఫిక్స్ రూపంలో చూద్దాం.

విరాళాలు
ఫొటో క్యాప్షన్, బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర పార్టీలకు విరాళాల తీరు
బీజేపీకి అందిన విరాళాలు
ఫొటో క్యాప్షన్, 2022-23లో బీజేపీ తప్ప దాదాపు అన్ని ప్రధాన పార్టీలకు విరాళాల్లో తగ్గుదల కనిపించిందని ఏడీఆర్ నివేదిక చెప్పింది.

2022-23లో బీజేపీకి 90 శాతం కార్పొరేట్ విరాళాలు వచ్చాయని ఏడీఆర్ తన రిపోర్టులో తెలిపింది.

2022-23లో రూ. 850.438 కోట్ల విరాళాలు అందుకున్నట్లు ఆయా జాతీయ పార్టీలు ప్రకటించాయి. ఇందులో బీజేపీకి రూ.719.85 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.79.92 కోట్లు వచ్చాయని ఏడీఆర్ తెలిపింది.

బీజేపీ విరాళాలు
ఫొటో క్యాప్షన్, బీజేపీకి అత్యధిక విరాళాలు కార్పొరేట్‌ల నుంచే అందాయని ఏడీఆర్ నివేదిక చెప్పింది.
బీజేపీ విరాళాలు
ఫొటో క్యాప్షన్, ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు బీజేపీకి అత్యధికంగా విరాళం అందించిందని ఏడీఆర్ నివేదిక చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)