డోనల్డ్ ట్రంప్: గెలిచినా ఇంకా అమెరికా అధ్యక్షుడు కాలేదు, ఎందుకు?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు, డోనల్డ్ ట్రంప్, జేడీ వాన్స్, జో బైడెన్, వైట్ హౌస్, క్యాపిటల్ హిల్, ఓవల్ ఆఫీస్, US ELECTION RESULTS 2024

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం ట్రంప్ ప్రసంగాన్ని న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌ దగ్గర స్క్రీన్ మీద చూస్తున్న ప్రజలు
    • రచయిత, జార్జ్ బౌడెన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం తర్వాత డోనల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

130 ఏళ్లలో వైట్ హౌస్‌లోకి అడుగు పెడుతున్న 78 ఏళ్ల మాజీ అధ్యక్షుడిగా ఆయన మరో రికార్డు సృష్టించారు.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో పాటు వివిధ దేశాల అధినేతలు డోనల్డ్ ట్రంప్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల గురించి ఇప్పటి వరకు అధికారికంగా నిర్థరించలేదు. ట్రంప్ ఇంకా అధికారికంగా అధ్యక్షుడు కాలేదు. ఎందుకు?

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా అధ్యక్ష ఎన్నికలు, డోనల్డ్ ట్రంప్, జేడీ వాన్స్, జో బైడెన్, వైట్ హౌస్, క్యాపిటల్ హిల్, ఓవల్ ఆఫీస్, US ELECTION RESULTS 2024

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, జార్జియా రాష్ట్రంలోని యూనియన్ సిటీలో కౌంటింగ్ కేంద్రం వద్ద డిజిటల్ స్క్రీన్ మీద అధ్యక్ష ఎన్నికల ఫలితాలు

ఎన్నికల ఫలితాలను ఎప్పుడు నిర్థరిస్తారు?

కొన్ని స్వింగ్ రాష్ట్రాల్లో పోటీ హోరాహోరీగా సాగిందనే ఆందోళన ఉండటంతో ఫలితాలపై అనిశ్చితి ఏర్పడింది.

అయితే నార్త్ కెరోలినా, జార్జియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఊహించిన దాని కంటే ముందే వచ్చిన విజయాలు, రిపబ్లికన్లకు పట్టున్న రాష్ట్రాల్లో ఫలితాలతో ట్రంప్ అధ్యక్ష పదవికి అవసరమైన మేజిక్ మార్క్ 270 సీట్లను దాటారు.

నాలుగు రోజుల ఓట్ల లెక్కింపు తర్వాత తాజాగా అరిజోనాలోనూ రిపబ్లికన్లు విజయం సాధించినట్లు ప్రకటించారు. దీంతో డోనల్డ్ ట్రంప్‌‍కు 312 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు దక్కాయి.

అరిజోనాలో రిపబ్లికన్ల గెలుపుతో కీలక స్వింగ్ రాష్ట్రాలన్నింటినీ ట్రంప్ క్లీన్ స్వీప్ చేసినట్లైంది.

డోనల్డ్ ట్రంప్ విజేత కావచ్చని ఎన్నికల తర్వాతి రోజు ఉదయాన్నే అమెరికాలో బీబీసీ సహ ప్రసార భాగస్వామి సీబీఎస్ టీవీ కథనాలు ప్రసారం చేసింది.

ఏదేమైనప్పటికీ, ప్రతీ రాష్ట్రానికి సంబంధించిన ఫలితాలు పూర్తిగా, స్పష్టంగా, అధికారికంగా ప్రకటించడానికి కొన్ని రోజులు లేదా వారాలు పట్టవచ్చు.

ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

డోనల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయినట్లేనా?

లేదు. ట్రంప్ ప్రస్తుతం ఎన్నికైన అధ్యక్షుడు మాత్రమే(ప్రెసిడెంట్ ఎలెక్టెడ్), ఆయన సహచరుడు జేడీవాన్స్ ఎన్నికైన ఉపాధ్యక్షుడు.(వైస్ ప్రెసిడెంట్ ఎలెక్టెడ్)

డోనల్డ్ ట్రంప్ 2025 జనవరి 20న అధ్యక్షుడిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు అమెరికా అధ్యక్షుడికి ఉండే అధికారాలు, బాధ్యతలు దఖలు పడతాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు, డోనల్డ్ ట్రంప్, జేడీ వాన్స్, జో బైడెన్, వైట్ హౌస్, క్యాపిటల్ హిల్, ఓవల్ ఆఫీస్, US ELECTION RESULTS 2024

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్ విజయం మీద ఇజ్రాయెల్ స్పందన

ఎన్నికల రోజుకు, ప్రమాణ స్వీకారానికి మధ్య ఏం జరుగుతుంది?

తుది ఫలితాల్లో చెల్లుబాటయ్యే ప్రతీ ఓటు చేరిన తర్వాత ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నికల ఫలితాన్ని నిర్థరిస్తుంది.

ప్రతీ రాష్ట్రానికి సంబంధించి ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వేర్వేరుగా ఉంటాయి. ఇవన్నీ ఎలక్టోరల్ కాలేజ్‌కు చేరతాయి. ఎలక్టోర్ కాలేజ్ ఈ ఓట్లను సేకరించడం ద్వారా ఓటర్ల హక్కులను కాపాడటంతో పాటు దాని ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది.

సాధారణంగా, రాష్ట్రాలన్నీ తమ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను ఎవరైతే పాపులర్ ఓట్లను గెలుచుకుంటారో వారికి అందిస్తాయి. ఇది డిసెంబర్ 17 తర్వాత నిర్వహించే సమావేశాల్లో నిర్థరిస్తారు.

అమెరికా కొత్త కాంగ్రెస్ ( పార్లమెంట్) 2025 జనవరి 6న సమావేశమై ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను లెక్కించి కొత్త అధ్యక్షుడెవరో ప్రకటిస్తుంది.

2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను లెక్కించేందుకు 2021 జనవరిలో అమెరికన్ కాంగ్రెస్ సమావేశమైంది.

ఈ సమావేశంలో ఓట్లను లెక్కించిన తర్వాత జో బైడెన్‌ను అధ్యక్షుడిగా ప్రకటించడాన్ని అడ్డుకోవాలనే తలంపుతోనే ట్రంప్ అనుచరులు కాపిటల్ హిల్ మీద దాడి చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు, డోనల్డ్ ట్రంప్, జేడీ వాన్స్, జో బైడెన్, వైట్ హౌస్, క్యాపిటల్ హిల్, ఓవల్ ఆఫీస్, US ELECTION RESULTS 2024

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మిషిగన్‌లో రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్, వాన్స్ ఫోటోలతో ఏర్పాటు చేసిన బోర్డు

ఎన్నికల్లో విజేతగా నిలిచిన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇప్పుడేం చేస్తారు?

ఎన్నికల్లో గెలిచిన డోనల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాలన మార్పుకు సంబంధించి తమ బృందంతో కలిసి జో బైడెన్ నుంచి పరిపాలనను తమ చేతుల్లోకి తీసుకోవడంపై పని చేస్తారు.

అలాగే పాలనలో విధానపరంగా తమకు అవసరమైన విధానాలు, కీలక శాఖలు ఎవరికి ఇవ్వాలి, పాలనకు సంబంధించి కీలక స్థానాల్లో ఎవరిని నియమించాలి అనే దానిపైనా కసరత్తు చేస్తారు. ప్రభుత్వ బాధ్యతలను స్వీకరించడంపైనా దృష్టి పెడతారు.

ప్రస్తుతం అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదాలు, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో అమెరికా చేపడుతున్న సైనిక ఆపరేషన్లు, ఇతర రహస్యాల గురించిన సమాచారాన్ని ట్రంప్ టీమ్ సేకరిస్తుంది.

ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులకు అమెరికన్ సీక్రెట్ సర్వీస్ భద్రత కల్పిస్తుంది.

ఎన్నిక ముగిసిన తర్వాత కొన్నిరోజులకు ప్రస్తుతం వైట్‌హౌస్‌లో ఉంటున్న అమెరికా అధ్యక్షుడు, ఎన్నికైన అధ్యక్షుడిని వైట్‌హౌస్‌లోకి ఆహ్వనిస్తారు.

ఇదంతా ఎందుకంటే కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే అధ్యక్షుడి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రస్తుత అధ్యక్షుడు కూడా హాజరై అధికార మార్పిడి ప్రశాంతంగా జరుగుతోందనే సంకేతం పంపేందుకు.

అయితే 2021లో జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ట్రంప్ హాజరు కాలేదు.

అయితే, రోనల్డ్ రీగన్ ప్రారంభించిన సంప్రదాయాన్ని గతంలో ట్రంప్ పాటించాల్సి వచ్చింది. పదవి నుంచి వైదొలగుతున్న అధ్యక్షుడు, తన తర్వాత వచ్చే అధ్యక్షుడు చదివేలా ఒక లేఖ రాసి ఓవల్ ఆఫీస్‌లో ఉంచుతారు.

తనకు ముందున్న అధ్యక్షుడు చాలా ఉదారమైన లేఖను వదిలి వెళ్లారని జో బైడెన్ అప్పట్లో రిపోర్టర్లతో చెప్పారు.

ఇప్పుడు జో బైడెన్ రాసిన లేఖను ట్రంప్ తప్పక చదవాలి.

ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నూతన అధ్యక్షుడు వెంటనే తన పని ప్రారంభిస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)