వివాదాలు, విజయాలు.. ఇదీ డోనల్డ్ ట్రంప్ జీవన ప్రస్థానం..

ఫొటో సోర్స్, New York Daily News Archive/Getty Images
డోనల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్‌లోని క్వీన్స్ ప్రాంతంలో జన్మించారు. అయిదుగురు తోబుట్టువుల్లో నాలుగో వ్యక్తి ట్రంప్.
ఆయనకు ఫ్రెడ్ జూనియర్, రాబర్ట్ అనే అన్నదమ్ములు.. మేరియన్, ఎలిజబెత్ అనే అక్కలు ఉన్నారు.
ట్రంప్ తోబుట్టువుల్లో ప్రస్తుతం ఎలిజబెత్ మాత్రమే బతికున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
వ్యాపారంలో వడివడిగా
న్యూయార్క్ శివారు ప్రాంతాల్లో ట్రంప్ తండ్రి ఫ్రెడ్‌కు ఒక భవన నిర్మాణ సంస్థ ఉండేది.
1968లో తొలిసారి ట్రంప్ తన కుటుంబ వ్యాపారాల్లో చేరారు.
చేరిన కొన్నాళ్లకే ఆయన సొంతంగా వ్యాపారంలో ఎదిగారు. మన్‌హటన్ వేదికగా ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులు, హోటళ్లు
అట్లాంటిక్ సిటీ, షికాగో, లాస్ వెగాస్ నుంచి భారత్, తుర్కియే, ఫిలిప్పీన్స్ వరకు ఆయనకు క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులు, హోటళ్లు ఉన్నాయి.
డోనల్డ్ ట్రంప్ విలాసవంతమైన జీవన విధానం న్యూయార్క్ వ్యాపార ప్రపంచంలో ఆయన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది.
‘ది అప్రెంటిస్’ అనే టీవీ షో వినోద ప్రపంచంలో ట్రంప్ స్టార్‌డమ్ పెరిగేందుకు సాయపడింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
మూడు పెళ్లిళ్లు
ట్రంప్ మూడుసార్లు పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఐదుగురు పిల్లలు.
1977లో తొలిసారి ఇవానా జెల్నికోవాను వివాహమాడారు.
ట్రంప్‌కు మొదటి భార్య ఇవానాతో ముగ్గురు పిల్లలున్నారు.
డోనల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్ వారి సంతానం.
ట్రంప్ రెండో భార్య పేరు మార్లా మాపుల్స్. వారికి ఒక కూతురు. పేరు టిఫనీ.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ తన మూడో భార్య మెలానియా క్నౌస్‌ను 2005లో పెళ్లి చేసుకున్నారు. అంతకు ఏడేళ్ల ముందు వారు కలుసుకునేటప్పటికి ట్రంప్ వయసు 52 ఏళ్లు కాగా ఆమెకు 28 ఏళ్లు.
వీరిద్దరికి బారన్ అనే కుమారుడు ఉన్నారు.
2015లో ట్రంప్ టవర్ వద్ద నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వైట్‌హౌస్ పదవి కోసం పోటీపడుతున్నట్లు ప్రకటించారు.
ఆ సమయంలో కుటుంబ సభ్యులు ట్రంప్ పక్కనే ఉన్నారు. ఆ విధంగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.
‘‘మళ్లీ అమెరికాను ఉన్నతంగా తీర్చిదిద్దుదాం(మేక్ అమెరికా గ్రేట్ అగైన్)’’ అనేది ఆయన నినాదం.

ఫొటో సోర్స్, Bloomberg/Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
వివాదాలతో హోరాహోరీగా సాగిన ప్రచారం అనంతరం, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించి, 2017లో ఆయన అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Bloomberg/Getty Images
చైనాతో వాణిజ్య యుద్ధం
అమెరికా మిత్రదేశాలతో సంబంధాల విషయానికొస్తే ఆయన పదవీ కాలం కాస్త అస్థిరతతో కొనసాగింది. ట్రంప్ విదేశీ నేతలతో తరచూ బహిరంగంగానే విభేదించేవారు.
కీలకమైన వాతావరణ, వాణిజ్య ఒప్పందాలను తన పదవీకాలంలో వెనక్కు తీసుకున్నారు. చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోలేకపోయారని ఆయన పదవీ కాలం చివరినాళ్లలో తీవ్ర విమర్శలు పాలయ్యారు.
తనకు కూడా ఈ వైరస్ సోకడంతో 2020 ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తప్పనిసరి పరిస్థితుల్లో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Bloomberg/Getty Images
2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలను అంగీకరించేందుకు ఆయన ఇష్టపడలేదు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు.
జనవరి 6న వాషింగ్టన్‌లో ఆయన మద్దతుదారులను కాంగ్రెస్ వైపు నిరసన ర్యాలీ చేయాలని కోరారు.
ఆ ర్యాలీలో అల్లర్లు చెలరేగాయి.
ఆ రోజు ఆయన చర్యల కారణంగా క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Reuters
ట్రంప్ రాజకీయ జీవితం ఇక ముగిసిందనుకున్నారు. కానీ, మరోసారి అధ్యక్షుడిగా పోటీ చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ముందు వరుసలోకి కూడా వచ్చేశారు.
తీవ్రమైన అభియోగాలు ఉన్నప్పటికీ ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Handout/Getty Images
పోర్న్ స్టార్ వివాదం, ప్రచారంలో కాల్పులు
2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఒక పోర్న్‌స్టార్‌కు ట్రంప్ డబ్బులు చెల్లించారని, అయితే ఆ చెల్లింపులను కప్పిపుచ్చేందుకు తన బిజినెస్ లెక్కల్లో తప్పుడు వివరాలు చూపించారని అభియోగాలు నమోదయ్యాయి.
ఈ కేసు తీర్పులో ఆయనను మొత్తం 34 ఆరోపణల కింద దోషిగా గుర్తించినట్లు న్యూయార్క్‌లోని మన్‌హటన్ క్రిమినల్ కోర్ట్ ప్రకటించింది.
ఆ తర్వాత జూలైలో పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా.. 20 ఏళ్ల ఓ గన్‌మెన్ ఆయనపై కాల్పులు జరిపారు.

ఫొటో సోర్స్, AP

ఫొటో సోర్స్, Bloomberg/Getty Images
ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే నిర్వహించిన రిపబ్లికన్ నేషనల్ కన్వెక్షన్‌లో, పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ను ధ్రువీకరించారు.
ట్రంప్ రెండోసారి ఇప్పుడు అధికారం చేపడితే.. అమెరికాకు అత్యంత ఎక్కువ వయసున్న అధ్యక్షుడు ఆయనే అవుతారు.
తన పదవీ కాలం ముగిసే నాటికి ట్రంప్‌కు 82 ఏళ్లు వస్తాయి.

ఫొటో సోర్స్, The Washington Post/Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














