ప్రపంచ కప్ ఫైనల్: పాట్ కమిన్స్ అన్నంత పని చేశాడు

కోహ్లీ, కమిన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియా జట్టు సారథి పాట్ కమిన్స్ అన్నంత పనీ చేశాడా? స్టేడియంలో లక్ష మంది భారతీయ ప్రేక్షకులంతా ఒక్కసారిగా నిశ్శబ్దం పాటించేలా చేయగలిగాడా?

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.

ఆదివారం (నవంబర్ 19) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.

అయితే, ఈ మ్యాచ్‌కి ముందురోజు (శనివారం) మీడియా సమావేశంలో పాల్గొన్నాడు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్.

‘రేపు స్టేడియంలో క్రౌడ్‌ అంతా వన్‌ సైడెడ్‌ ఉండనుంది. దానిపై మాకు క్లారిటీ ఉంది. తమ దేశానికి మద్దతుగా అభిమానులు చేసే అరుపులను నిశ్శబ్దంలోకి నెట్టగలిగితే, దానంత ఆనందం మరోటి ఉండదు. రేపు మా లక్ష్యం కూడా అదే.. అందుకోసం మేం ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం’ అని కమిన్స్‌ వ్యాఖ్యానించాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

స్డేడియానికి వచ్చే అభిమానులను ఉద్దేశించి ఆసీస్ కెప్టెన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అయితే, కమిన్స్ అన్నంత పనీ చేశాడు.

కోహ్లీ అవుట్

ఫొటో సోర్స్, Getty Images

నిశ్శబ్దంగా మారిన స్టేడియం

భారత్, ఆసీస్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు లక్ష మందికి పైగా క్రికెట్ అభిమానులు స్డేడియానికి వచ్చారు. టీమిండియాకు మద్దతిచ్చే వారే ఇందులో ఎక్కువున్నారు.

అభిమానుల్లో చాలామంది ఇండియా జెర్సీలు వేసుకొని రావడంతో స్డేడియమంతా నీలిరంగుమయమైంది.

అభిమానుల కేరింతల నడుమ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన కమిన్స్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఆసీస్ బౌలర్ల ధాటికి ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది ఇండియా. అయితే, విరాట్ కోహ్లీ క్రీజులో ఉండటంతో భారత అభిమానులు ధైర్యంగానే ఉన్నారు.

కానీ, 29 ఓవర్లో అంతా మారిపోయింది. ఆ ఓవర్ బౌలింగ్ చేసింది ఆసీస్ కెప్టెన్. ఆ ఓవర్‌లో కమిన్స్ వేసిన బంతికి విరాట్ ఔటయ్యాడు.

కోహ్లీ అవుటవడంతో కమిన్స్ చెప్పినట్లుగానే పరిస్థితి మారిపోయింది. స్డేడియంలో నిశ్శబ్ధం ఆవహించింది.

నరేంద్రమోదీ స్డేడియంలో అభిమానులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నరేంద్రమోదీ స్డేడియంలో అభిమానులు

ఈ సంఘటనను సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు.

హరూన్ అనే యూజర్.. ఆస్ట్రేలియా చెప్పి మరీ తన పాయింట్‌ను నిరూపించుకొందని ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు .

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

''లక్షా 30 వేల మంది నిశ్శబ్దం కంటే సంతృప్తికరమైనది మరొకటి లేదు. పాట్ కమిన్స్ తన మాటలను నిలబెట్టుకున్నాడు'' అని సర్దార్ అనే యూజర్ అభిప్రాయపడ్డారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

అయితే, కమిన్స్ వ్యాఖ్యలకు పలువురు భారత అభిమానులూ కౌంటర్ ఇచ్చారు.

''పాట్ కమిన్స్ ఫైనల్ మ్యాచ్ గెలిచి నరేంద్ర మోదీ స్టేడియంలోని అంతమంది ప్రేక్షకులను నిశ్శబ్దం చేయడం గురించి మాట్లాడుతున్నాడు. ఆసీస్‌పై భారత్ గెలుస్తుందని ఆశిస్తున్నా, ప్రేక్షకుల గర్జన ఆస్ట్రేలియన్ ఆటగాళ్లకు నెలల తరబడి అసౌకర్యానికి గురి చేస్తుంది'' అని పాండే అనే యూజర్ పోస్టు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

ఈ మ్యాచ్‌లో భారత్‌పై 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ప్రపంచ కప్ ట్రోఫీను అందుకుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)