ప్రపంచంలో 10 పెను భూకంపాలు.. 9 తీవ్రతతో తొలిసారి ఎప్పుడంటే

ఫొటో సోర్స్, TVBS
రష్యా తూర్పు తీరంలో బుధవారం భారీ భూకంపం సంభవించింది.
దీని తీవ్రత 8.8గా నమోదైంది. దీని కారణంగా రష్యా, జపాన్‌లోని కొన్ని తీర ప్రాంతాల్లో సునామీ వచ్చింది.
సునామీ వచ్చే ప్రమాదముందంటూ అమెరికా దక్షిణ తీర రాష్ట్రాలు, చైనా, మరికొన్ని దేశాల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
ప్రస్తుతం 8.8 తీవ్రతతో రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో వచ్చిన ఈ భారీ భూకంపం ప్రపంచంలో నమోదైన పది పెను భూకంపాలలో ఒకటని అమెరికా జియోలాజికల్ సర్వే చెబుతోంది.
ప్రస్తుతం కమ్చట్కాలో వచ్చిన భూకంపానికి ముందు ప్రపంచంలో 10 పెను భూకంపాల వివరాలు ఈ క్రింద చదవొచ్చు.

కమ్చట్కా ద్వీపకల్పంలోనే రెండు సార్లు..
మంగళవారం రష్యాలో భూకంపం సంభవించిన తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో గతంలో కూడా ప్రపంచంలోనే అత్యంత భారీ భూకంపం వచ్చింది.
ప్రపంచంలో తొలిసారి 9 తీవ్రతతో భూకంపం వచ్చింది కూడా ఇక్కడే.
1952లో ప్రపంచంలోనే తొలిసారిగా 9 తీవ్రతతో సంభవించిన ఆ భూకంపం కారణంగా హవాయిలో భారీ సునామీ ఏర్పడి వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం వాటిల్లింది.
తాజాగా ఏర్పడిన భూకంప తీవ్రత 8.8. ఇది ప్రపంచ పెను భూంకపాల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది.
గతంలో కూడా 8.8 తీవ్రతతో చిలీలోని బియోబియోలోనూ, ఈక్వెడార్‌లోని ఎస్మెరాల్డాస్‌లోనూ భూకంపం సంభవించింది.

ఫొటో సోర్స్, Reuters
ఇండియాలో అత్యంత భారీగా 8.6 తీవ్రతతో
భారత్‌లో ఇప్పటివరకు వచ్చిన అనేక భూకంపాలలో 1950 నాటి ఎర్త్‌క్వేక్ అత్యంత తీవ్రమైనదిగా రికార్డైంది.
1950లో అరుణాచల్‌ప్రదేశ్‌లో 8.6 తీవ్రతతో భూకంపం వచ్చింది.
ప్రపంచంలోని అత్యంత తీవ్ర భూకంపాలలో దీని స్థానం 9.
ఈ భూకంపం ధాటికి అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు అస్సాంలోనూ, టిబెట్‌లోను భారీ నష్టం వాటిల్లింది.
అందుకే దీన్ని అస్సాం-టిబెట్ భూకంపంగా పేర్కొంటుంటారు.
శక్తిమంతమైన ప్రకంపనలవల్ల భూమి బీటలు వారింది. కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. ఆ విలయంలో 780 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఫొటో సోర్స్, Reuters
మరిన్ని పెను భూకంపాలు
- అలాస్కాలోని అడ్కాలో 1957లో 8.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
- ఇండోనేషియాలో 2005లో 8.6 తీవ్రతతో సంభవించిన భూకంపం.
- అలాస్కాలోని యూనిమాక్ ద్వీపంలో 1947లో 8.6 తీవ్రతతో ఏర్పడిన భూకంపం
- రష్యాలోని కుర్లిస్క్‌లో 1963లో 8.5 తీవ్రతతో భూకంపం వచ్చింది.
- ఇండోనేషియాలోని తౌల్‌లో 1938లో 8.5 తీవ్రతతో భూకంపం వచ్చింది.
- చీలిలోని వల్లెనర్‌లో 1922లో 8.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.
(ఆధారం: యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














