‘60’ మందిని ఉరి తీసిన తలారి మృతి

ఫొటో సోర్స్, AFP
- రచయిత, కాత్రిన్ ఆర్మ్‌స్ట్రాంగ్
- హోదా, బీబీసీ న్యూస్
సీరియల్ కిల్లర్లను, రాజకీయ నాయకులను ఉరి తీసి.. తన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకొచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన తలారి షాజహాన్ భుయాన్ సోమవారం మరణించారు.
74 ఏళ్ల షాజహాన్‌కు సోమవారం ఛాతీలో నొప్పి రావడంతో ఢాకాలోని ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన ఆసుపత్రిలోనే మరణించారని స్థానిక మీడియా వెల్లడించింది.
తలారిగా భుయాన్ 26 కంటే ఎక్కువ మందిని ఉరితీసినట్లు చెబుతున్నారు.
కానీ, కొన్ని నివేదికలు మాత్రం ఆయన ఉరితీసిన వారి సంఖ్య 60 వరకు ఉండొచ్చని చెప్తున్నాయి.
ఒకప్పుడు విప్లవకారుడైన భుయాన్ హత్య, దొంగతనం కేసులో జైలుకి వెళ్లారు. ఆయనకు కోర్టు 42 ఏళ్ల జైలు శిక్ష విధించగా జైలులో ఉంటూ తలారిగా మారారు.
స్వచ్ఛందంగా తలారి పనిచేసినందుకు గాను తన జైలు శిక్ష తగ్గించాలని భుయాన్ కోరారు. ఆయన కోరిక మేరకు 10 ఏళ్లు ముందుగానే ఆయనను జైలు నుంచి విడుదల చేశారు. భుయాన్ గత ఏడాది జైలు నుంచి విడుదలయ్యారు.

బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రహమాన్‌ను హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన మిలిటరీ ఆఫీసర్లు అధికారులను జైలులో ఉరి తీసింది కూడా షాజహానే.
యుద్ధ నేరాల అభియోగాలు ఎదుర్కొన్న అలీ అహ్సాన్ ముజాహిద్, సలాహుద్దీన్ ఖదీర్ చౌధురీ వంటి రాజకీయ నాయకులను.. సీరియల్ కిల్లర్ ఎర్షాద్ శిక్దర్‌ను కూడా ఆయన ఉరి తీశారు.
తాను చేస్తున్న పనిని ఆయన ఎప్పుడూ సమర్థించుకునేవారు. ‘‘ఒకవేళ నేను వారిని ఉరితీయకపోతే, మరొకరు ఆ పని చేస్తారు’’ అని ఆయన అనేవారు.
తలారిగా అనుభవాలు, ఉరి తీసే ప్రక్రియను వివరిస్తూ ఆయన రాసిన పుస్తకం ఈ ఏడాది మొదట్లో విడుదల అయింది. అందరి దృష్టిని ఆకర్షించింది.
జైలు నుంచి విడుదలైన వెంటనే ఆయన తన కన్నా 50 ఏళ్లు చిన్నదైన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. ఫలితంగా చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- మెదక్: బక్రీద్ సందర్భంగా ఇక్కడ జరిగిన గొడవేంటి? ఎందుకు జరిగింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














