హరికేన్ మిల్టన్: 60 లక్షల మంది ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రాన్ని హరికేన్ మిల్టన్ వణికిస్తోంది.
సుమారు 60 లక్షల మంది ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
మెక్సికో గల్ఫ్ ప్రాంతాన్ని దాటి టాంపా నగరం వైపు ప్రయాణిస్తున్న ఈ హరికేన్... ఇప్పుడు మరింత బలపడి భయంకర రూపం దాల్చవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రెండు వారాల కింద వచ్చిన హెలెన్ హరికేన్ ప్రభావం నుంచి ఫ్లోరిడా ప్రజలు ఇంకా తేరుకోలేదు.
తాజా పరిస్థితులపై బీబీసీ ప్రతినిధి స్టీవ్ నిబ్స్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Getty Images











