ఇది అలాంటిలాంటి కుక్క కాదు, 323 పిల్లలకు తండ్రి

ఫొటో సోర్స్, Doug Peters/PA Media Assignments
ఇంగ్లండ్‌లోని ట్రిగ్గర్ అనే కుక్కు 300కు పైగా పిల్లలకు తండ్రి. ఈ కుక్కను డాగ్‌ఫాదర్ అని కూడా పిలుస్తారు.
ఛారిటీ ద్వారా పలు నగరాల్లోని అనేక కుక్క పిల్లలకు తండ్రి అయిన ట్రిగ్గర్, ఇక ఈ బ్రీడింగ్ ప్రోగ్రామ్ నుంచి తప్పుకోనుంది.
గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన ట్రిగ్గర్ తొమ్మిదేళ్లుగా గైడ్ డాగ్స్ బ్రీడింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉంది. దీని కలయికతో ఆడ కుక్కలకు మొత్తంగా 39 ప్రసవాలు కాగా, వాటికి 323 పిల్లలు పుట్టాయి.
2021లో ఒకేసారి 16 పిల్లలకు తండ్రి అయి ట్రిగ్గర్ రికార్డు సృష్టించింది.
ట్రిగ్గర్ బిడ్డ బిల్లీ (మగ కుక్క) తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించవచ్చని స్వచ్ఛంద సంస్థ (గైడ్ డాగ్స్) భావిస్తోంది.

ఫొటో సోర్స్, Doug Peters/PA Media Assignments
పిల్లలను ఏం చేశారు?
ఈ కుక్కపిల్లలను లండన్, గ్లాస్గో, కార్డిఫ్, ఐల్ ఆఫ్ వైట్ తదితర ప్రాంతాల్లోని వ్యక్తులకు అందించినట్లు గైడ్ డాగ్స్ తెలిపింది.
అందులో అంధులు, పాక్షిక దృష్టిగల వ్యక్తుల జీవితాలకు ఈ కుక్క పిల్లలు "స్వాతంత్ర్యం, విశ్వాసం" తెచ్చాయని ఆ సంస్థ అంటోంది.

ఫొటో సోర్స్, Doug Peters/PA Media Assignments
ఈ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ట్రిగ్గర్ 294 పిల్లలకు తండ్రి అయింది. ఇతర సహాయ డాగ్ ఛారిటీలు, గైడ్ డాగ్ స్కూల్‌ల ఆధ్వర్యంలో మరో 29 పిల్లలకు తండ్రి అయింది.
దీనివల్లే ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశాలలో రెండు ఆడ కుక్కలు కూడా పిల్లలను కన్నాయి.

ఫొటో సోర్స్, PA Media
ఇపుడు ట్రిగ్గర్ ఏం చేయనుంది?
ట్రిగ్గర్ సాయంతో చివరి కాన్పులో ఆరు కుక్క పిల్లలు పుట్టాయి. ఇందులో జెన్నీ, రీటా, హెర్మియోన్, శాండీ, ఇండీ అనే ఐదు ఆడ కూనలు, బిల్లీ అనే ఒక మగ కూన ఉంది.
ఎనిమిది వారాల వయసున్న ఈ కూనలు గైడ్ డాగ్‌లో జర్నీని ప్రారంభించబోతున్నాయి.
ఆ పిల్లలు ఏడాది పాటు వలంటీర్ల (కుక్కపిల్లల పెంపకందారుల)తో కలిసి జీవిస్తాయని ఆ సంస్థ అంటోంది.

ఫొటో సోర్స్, Doug Peters/PA Media Assignments
చారిటీ అనంతరం ట్రిగ్గర్ బాన్‌బరీలో పదవీ విరమణ చేయనుంది. అనంతరం దానితో ఏడేళ్లుగా ఉంటున్న బ్రీడింగ్ డాగ్ వలంటీర్ సారా బ్రైన్ అధికారికంగా దత్తత తీసుకోనున్నారు.

ఫొటో సోర్స్, PA Media
వారసత్వం ఎలా?
ట్రిగ్గర్ మృదువైన స్వభావం, అద్భుతమైన ఆరోగ్యం ఈ ప్రోగ్రామ్‌కు సరైన ఎంపికలా చేసిందని గైడ్ డాగ్స్ బ్రీడింగ్ ఆపరేషన్స్ హెడ్ జానైన్ డిక్సన్ అన్నారు.
"ట్రిగ్గర్ వారసత్వాన్ని కొనసాగించడానికి బిల్లీ మరి కొన్నేళ్లలో బ్రీడింగ్ ప్రోగ్రామ్‌లో చేరవచ్చని భావిస్తున్నాం" అని ఆమె చెప్పారు.
"ఈలోగా ట్రిగ్గర్‌కు పుట్టిన 9 ఆడ కూనలు, దాని హాఫ్-ఫ్రెంచ్ మగ కుక్క అయిన పియర్, ట్రిగ్గర్ జన్యు వారసత్వంతో కొత్త తరం కుక్కలను ఉత్పత్తి చేయడానికి బ్రీడింగ్ ప్రోగ్రామ్‌కు సహకరిస్తున్నాయి" అని జానైన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ట్రూంగ్ మై లాన్: రూ. 3.6 లక్షల కోట్ల మోసం, మహిళా బిలియనీర్‌కు మరణశిక్ష, అసలేం జరిగిందంటే..
- కుతుబ్ మినార్ కన్నా ఎత్తున్న ఈ ఐస్‌బర్గ్ గురించి ఇప్పుడు అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు?
- హవానా సిండ్రోమ్: ఈ అంతుచిక్కని ఆరోగ్య సమస్యకూ రష్యా నిఘా వ్యవస్థకూ సంబంధం ఉందా?
- ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురాంల 'గీతగోవిందం' మ్యాజిక్ రిపీటయిందా?
- రష్యా: సెక్స్ థీమ్ పార్టీలపై పోలీసులు ఎందుకు దాడి చేస్తున్నారు... అక్కడ అసలేం జరుగుతోంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














