ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

అమృత్‌పాల్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

1.పంజాబ్ పోలీసులు వెతుకుతున్న అమృత్‌పాల్ సింగ్ ఎవరు?

అమృత్‌పాల్ సింగ్ కోసం గత కొన్ని రోజులుగా పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది.

సింగ్ సారథ్యంలోని 'వారిస్ పంజాబ్ దే' సంస్థ కార్యకర్తల మీద ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు 114 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. తొలి రోజు 78 మందిని, రెండో రోజు 34 మందిని, మూడో రోజు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో అమృత్‌పాల్ సింగ్‌కు చాలా సన్నిహితులు అని చెబుతున్న అయిదుగురు వ్యక్తులు కూడా ఉన్నారు.

''వారిస్ పంజాబ్ దే'' సంస్థకు వచ్చిన విదేశీ విరాళాలతోపాటు ఈ కేసులో ఐఎస్ఐ ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు ఐజీ సుఖ్‌చైన్ గిల్ వెల్లడించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

చడ్డీ గ్యాంగ్

2.ఎవరికీ దొరక్కుండా దొంగతనాలు చేసే చెడ్డీ గ్యాంగ్ ఎంత ప్రమాదం

ఎండాకాలం వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా దొంగతనాలు ఎక్కువవుతాయి. వేసవి సెలవులకు ఊళ్లకు వెళ్లేవారి ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చెడ్డీ గ్యాంగ్, పార్థీ గ్యాంగ్ లాంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు చెలరేగిపోతాయని పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.

ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ సంచరించినట్లు సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా తిరుపతి జిల్లాలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే గతంలో తిరుచానూరు, చిగురువాడ, తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ కదలికలను పోలీసులు గుర్తుచేసుకుంటున్నారు.

వేసవి వచ్చేయడం, దొంగల ముఠాల కదలికలు కూడా కనిపించడంతో ప్రజలను అప్రమత్తం చేసి, వారిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తిరుపతి జిల్లా పోలీసులు.

అసలు ఈ గ్యాంగ్స్ ఎలా పనిచేస్తాయి?, ఎలా దొంగతనాలు చేస్తాయి? అన్నది వివరించిన తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, ఆ దొంగలను ఎలా గుర్తు పట్టవచ్చు, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఎలా కాపాడుకోవచ్చో కూడా బీబీసీకి వివరించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

అలియా భట్

ఫొటో సోర్స్, Getty Images

3.ఫొటోగ్రాఫర్లపై బాలీవుడ్ నటులకు కోపం ఎందుకు?

వరీందర్ చావ్లా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముంబయికి 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలీబాగ్ అనే తీర పట్టణంలోని హెలీప్యాడ్ వద్ద ఆయన ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, ముంబయిలోని తన ఇంటికి ఈ హెలీప్యాడ్ నుంచే హెలీకాప్టర్‌లో బయల్దేరనున్నట్లు ఆయనకు సమాచారం అందింది.

అది 2022 నవంబర్ 2వ తేదీ. ఆరోజు షారూఖ్ ఖాన్ పుట్టినరోజు. జన్మదిన శుభాకాంక్షలు అందజేయడానికి ముంబయిలోని తన ఇంటికి వద్దకు వచ్చే వేలాదిమంది అభిమానులను ఆయన ఎప్పుడూ పలకరిస్తారు.

అభిమానులను షారూఖ్ ఖాన్ నిరాశపరచరనే సంగతి చావ్లాకు తెలుసు. అందుకే ఆయన చాలా ఓపికగా ఎదురు చూశారు.

ఎట్టకేలకు, షారూఖ్ ఖాన్ ఉన్న కారు వచ్చింది. వెంటనే చావ్లా, ఆయనకు కనిపించేలా సైగ చేశారు. షారూఖ్ ఖాన్ కూడా ఆయన వైపు చేయి చూపారు. మరుక్షణమే చావ్లా ఆ దృశ్యాన్ని 'క్లిక్' మనిపించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

వడగళ్లు

4.వడగళ్ల వానలు వేసవిలోనే ఎందుకు ఎక్కువ?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ మార్చి నెలలో వడగళ్ల వానలు పడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు కనుమల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాతోపాటు తెలంగాణలోని కరీంనగర్, హైదరాబాద్‌లలో పెద్ద ఎత్తున వడగళ్లు పడ్డాయి.

మార్చి రెండో వారంలో తెలంగాణలో పడ్డ వడగళ్ల పరిమాణం పెద్దదిగా ఉండటమే కాకుండా రోడ్లు కనిపించనంత భారీ స్థాయిలో అవి నేలపై పడ్డాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురిసిన వడగళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయని ఆంధ్రా విశ్వవిద్యాలలయం వాతావరణ విభాగాధిపతి ప్రొఫెసర్ నాయుడు బీబీసీతో చెప్పారు.

2022లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఏప్రిల్‌లో వడగళ్ల వానలు పడ్డాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

విటమిన్ టాబ్లెట్లు

ఫొటో సోర్స్, Getty Images

5.రోగనిరోధక శక్తి పెరగడానికి ఏం తినాలి?

ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి గురించి చాలామంది చాలా విషయాలు పంచుకుంటున్నారు.

రోగ నిరోధక శక్తి పెంచడానికి సాధారణ ఆహారం నుంచి కషాయాలు, లేహ్యాలు, పానీయాలు, పొడులు.. శ్లోకాలు, మంత్రాలు, తంత్రాలు, పూజలు ఒకటేమిటి ఎన్నో ఎన్నో చెప్తున్నారు.

చెప్పేవారిలో నిపుణులు ఉంటున్నారు, అనుభవంతో జ్ఞానం సంపాదించినవారు ఉంటున్నారు, అవేమీ లేకుండా ఎవరుపడితే వారు కూడా చెప్తున్నారు.

దీంతో ఏం తినాలి? ఎందుకు తినాలి? ఏది మంచిది? ఏది మంచిది కాదు అనేది తెలియని ఒకరకమైన గందరగోళం ఏర్పడుతోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)