ఆస్కార్ కార్పెట్ మీద మెరిసిన తళుకుల తారల ఫ్యాషన్ లుక్స్ చూశారా..?

ఫొటో సోర్స్, Getty Images
ఆస్కార్ వేడుకల్లో ప్రఖ్యాతి గాంచిన కార్పెట్ కలర్ ఈసారి మారింది. సంప్రదాయంగా రెడ్ కార్పెట్ పరిచే నిర్వాహకులు ఈసారి కార్పెట్‌ను ‘షాంపేన్ కలర్’లో వేశామని చెప్పారు.
అయితే ఆస్కార్ వేడుకల కార్పెట్ కలర్ మారింది కానీ తారల గ్లామర్ మాత్రం ఎప్పటిలాగానే మెరుపులీనింది.
కేట్ బ్లాంచెట్ తన కెరీర్‌లో ఎనిమిదో సారి ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. ఆమె బ్లూ వెల్వెట్ ధరించారు. యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ ఏజెన్సీ కార్యక్రమంలో భాగంగా.. శరణార్థులు తయారు చేసిన రిబ్బన్‌ను తన డ్రెస్ మీద పెట్టుకున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఎవిరిథింగ్ ఎవిరివేర్ ఆల్ ఎట్ వన్స్ తార మిషెల్ యోవా వజ్రాలు పొదిగిన వైట్ గౌన్ ధరించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
ది ఫేబుల్‌మాన్స్ సినిమాలో స్టీవెన్ స్పీల్‌బర్గ్ తల్లిగా నటించి కెరీర్‌లో ఐదోసారి ఉత్తమ నటి నామినేషన్ పొందిన మిషెల్ విలియమ్స్.. క్రిస్టల్స్ అమర్చిన వైట్ చానల్ డ్రెస్ ధరించి వచ్చారు.

ఫొటో సోర్స్, Reuters
టాప్ గన్: మావెరిక్‌లోని తన పాట ‘హోల్డ్ మై హ్యాండ్’ను ఈ కార్యక్రమంలో పాడిన లేడీ గాగా.. బ్లాక్ వెరస్కేస్ డ్రెస్ ధరించి వచ్చారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Getty Images
ఈ కార్యక్రమంలో రిహానా కూడా ప్రదర్శన ఇచ్చారు. బ్లాక్ పాంథర్: వాకాండా ఫరెవర్ సినిమాలోని ‘లిఫ్ట్ మి అప్’ పాట పాడారామె. లెదర్ స్ట్రాప్స్‌తో కూడిన అలాయియా డ్రెస్‌లో నిండు గర్భిణిగా అందంగా కనిపించారు.

ఫొటో సోర్స్, Reuters
బ్రిటిష్ నటి ఫ్లోరెన్స్ పగ్ బ్లాక్ షార్ట్స్ మీద రఫుల్డ్ స్టేట్‌మెంట్ గౌన్ ధరించారు. ఆమె మెడలోని సిల్వర్ నెక్లెస్ ఆకర్షణీయంగా ఉంది.

ఫొటో సోర్స్, Reuters
జేమీ లీ కర్టిస్ తన కెరీర్‌లో తొలి ఆస్కార్ అందుకున్నారు. క్రిస్టల్స్ పొదిగిన డోల్స్ అండ్ గబ్బానా గౌన్ ధరించి వచ్చారామె. ‘ఈ కార్పెట్ నా దుస్తుల కలర్‌తో మ్యాచ్ అవుతుంది’ అని ఆమె జోక్ కూడా చేశారు.

ఫొటో సోర్స్, Reuters
బ్లాక్ పాంథర్: వాకాడా ఫరెవర్ సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటి అవార్డుకు నామినేట్ అయిన ఏంజెలా బాసెట్ రాయల్ పర్పుల్ షేడ్ గౌను ధరించారు.

ఫొటో సోర్స్, Reuters
బ్లాండ్ సినిమాలో మార్లిన్ మన్రో పాత్ర పోషించిన అనా డి అర్మాస్ ఉత్తమ నటి అవార్డుకు నామినేట్ అయ్యారు. ఆమె మెరుపుల గౌను ధరించి వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
కారా డెలివింగ్నే నాటకీయమైన ఎలీ సాబ్ గౌన్ ధరించి కార్పెట్‌కు ఎరుపు వన్నె తెచ్చారు.

ఫొటో సోర్స్, Reuters
హాలె బెరీ ధరించిన వైట్ సాటిన్ టామార రాల్ఫ్ డ్రెస్ మీద రోజ్ గోల్డ్ డెకరేషన్ ఆకట్టుకుంది. 21 ఏళ్ల కిందట ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్న ఈ హాలీవుడ్ తార ఇప్పుడు తన చేతుల మీదుగా ఉత్తమ నటి అవార్డును ప్రదానం చేశారు.

ఫొటో సోర్స్, Reuters
Malala Yousafzai arrived in a shimmering silver Ralph Lauren gown with ruched waist.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్.. సిల్వర్ కలర్ రాల్ఫ్ లారెన్ గౌను ధరించి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో నామినేట్ అయిన స్ట్రేంజర్ ఎట్ ద గేట్ పిక్చర్‌కు ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.

ఫొటో సోర్స్, Reuters
టాప్ గన్: మావెరిక్ నటి జెన్నిఫర్ కానెలీ.. లూయీ విటన్ డిజైన్ డ్రెస్ ధరించి ఈ వేడుకలకు హాజరయ్యారు.

ఫొటో సోర్స్, Reuters
ఎవా లాంగోరియా ధరించిన జుహేర్ మురాద్ డిజైన్ అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఫొటోలన్నీ కాపీరైట్‌కు లోబడి ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమా ఏం మ్యాజిక్ చేసింది? ఏకంగా 7 ఆస్కార్ అవార్డులు ఎలా కొట్టేసింది?
- ది ఎలిఫెంట్ విస్పరర్స్: ‘ఆస్కార్ వచ్చింది కానీ ఇప్పుడు మా రఘు మాతో లేనందుకు బాధగా ఉంది’ - బొమ్మన్, బెల్లీ
- ఆస్కార్ 2023- ‘‘నాటునాటు’’ పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డు... రికార్డు సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమా
- ఆస్కార్ 2023- ‘‘నాటునాటు పాటను తరాల పాటు గుర్తుంచుకుంటారు...’’ ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనల వెల్లువ
- ఆస్కార్ 2023- 'ఆస్కార్ నామినేషన్, ప్రమోషన్లకు సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది'
- ఆస్కార్ అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








