మాగ్నస్ కార్ల్‌సన్-హాన్స్ నీమాన్: 19 ఏళ్ల కుర్రాడిపై చెస్ ప్రపంచ చాంపియన్ ఆరోపణలు ఎందుకు?

మాగ్నస్ కార్ల్‌సన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాగ్నస్ కార్ల్‌సన్
    • రచయిత, క్రిస్టీ కూనీ
    • హోదా, బీబీసీ న్యూస్

చెస్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ తొలిసారి బహిరంగంగా తన సహచర ఆటగాడు హాన్స్ నీమాన్ మోసానికి పాల్పడ్డాడంటూ ఆరోపించారు.

''గతంలో ఆటలో మోసానికి పాల్పడినట్లు నీమాన్ అందరి ముందు ఒప్పుకున్నారు. కానీ, ఆయన ఇటీవల అంతకంటే పెద్ద మోసం చేసినట్లు నేను నమ్ముతున్నా'' అంటూ కార్ల్‌సన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కానీ, దీన్ని నిరూపించే సాక్ష్యాలేమీ ఆయన బయటపెట్టలేదు.

ఈ నెల జరిగిన సింక్‌ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్‌లో కార్ల్‌సన్‌ను నీమాన్ ఓడించారు. ఆ తర్వాత నీమాన్‌పై కార్ల్‌సన్ పరోక్ష ఆరోపణలు చేశారు.

చెస్ టోర్నమెంట్‌లో తాను మోసానికి పాల్పడినట్లు వస్తోన్న ఆరోపణలను 19 ఏళ్ల నీమాన్ ఖండించారు. తన కెరీర్‌ను కార్ల్‌సన్ నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ నీమాన్ ఆరోపించారు.

ఆన్‌లైన్ చెస్ టోర్నీల్లో గతంలో రెండుసార్లు చీటింగ్ చేసినట్లు ఈ టీనేజ్ ఆటగాడు ఒప్పుకున్నారు. 12 ఏళ్ల వయస్సులో ఒకసారి, 16 ఏళ్లు ఉన్నప్పుడు ఇలా చేసినట్లు చెప్పారు. కానీ, బోర్డుపై చెస్ ఆడుతుండగా తానెప్పుడూ మోసానికి పాల్పడలేదని నీమాన్ స్పష్టం చేశారు.

తన సచ్ఛీలతను నిరూపించుకోవడానికి కావాలంటే నగ్నంగా ఆడేందుకు కూడా తాను సిద్ధమే అని నీమాన్ అన్నారు.

సింక్‌ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్‌లో నీమాన్‌ చేతిలో కార్ల్‌సన్ ఓటమి పాలైన తర్వాత వీరిద్దరి మధ్య ఈ వివాదం మొదలైంది. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సన్‌ను 'ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్'గా పరిగణిస్తారు. ఈ మ్యాచ్‌కు ముందు వరుసగా 53 క్లాసికల్ చెస్ మ్యాచ్‌ల్లో కార్ల్‌సన్ ఓటమనేదే చూడలేదు. నీమన్ చేతిలో ఓడిపోవడంతో ఈ పరంపరకు బ్రేక్ పడింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ మ్యాచ్ తర్వాత టోర్నమెంట్‌లో ఇంకా ఆరు రౌండ్లు జరగాల్సి ఉన్నప్పటికీ కార్ల్‌సన్ ఎలాంటి వివరణ ఇవ్వకుండానే టోర్నీ నుంచి వైదొలిగారు. తర్వాత ఒక ట్వీట్ చేశారు. ''ఒకవేళ నేను మాట్లాడితే, పెద్ద ప్రమాదంలో పడతాను' అంటూ ఫుట్‌బాల్ మేనేజర్ జోస్ మోరిన్హో చెప్పిన వీడియో క్లిప్‌ను ట్వీట్‌లో పంచుకున్నారు.

మరో ఆన్‌లైన్ టోర్నమెంట్ సందర్భంగా వీరిద్దరూ గతవారం మరోసారి తలపడ్డారు. అయితే, కేవలం ఒక పావు కదిపిన కార్ల్‌సన్, నీమాన్‌పై నిరసనగా ఆ మ్యాచ్ నుంచి తప్పుకున్నారు.

ఈ టోర్నీలో కార్ల్‌సన్ విజేతగా నిలిచారు. ఆ తర్వాత, చెస్‌ ఆటలో జరిగే మోసాలను తీవ్రంగా పరిగణించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కుంభకోణం గురించి మరింత చెబుతానని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

''నేను అసహనానికి లోనయ్యా. అత్యుత్తమ చెస్ టోర్నీల్లో అత్యున్నత స్థాయి చెస్ ఆడటం కొనసాగించాలని నేను కోరుకుంటున్నా'' అంటూ సోమవారం ట్విటర్‌లో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

''చెస్‌లో చీటింగ్ అనేది చాలా పెద్ద విషయం. ఇది ఆట అస్తిత్వానికే ముప్పు. మనమంతా ఎంతో ప్రేమించే చెస్ ఆట పట్ల శ్రద్ధ వహించే వారందరూ, చెస్ పోటీల నిర్వాహకులు... ఆటలో మోసాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పెంచడం, మోసం చేసే పద్ధతులను గుర్తించడం పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

నీమాన్ బహిరంగంగా అంగీకరించిన దానికంటే ఎక్కువగా ఇటీవల మోసం చేశాడని నేను నమ్ముతున్నా'' అని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇటీవలి సంవత్సరాల్లో ఆటలో నీమాన్ పురోగతి 'అసాధారణంగా' ఉన్నందున అతనిపై అనుమానం కలిగిందని కార్ల్‌సన్ అన్నారు.

సింక్‌ఫీల్డ్ కప్‌లో భాగంగా మ్యాచ్‌లో నీమాన్ టెన్షన్ పడలేదు, పైగా పూర్తి శ్రద్ధతో ఆడినట్లు కూడా కనిపించలేదని కార్ల్‌సన్ చెప్పారు. కేవలం కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో నీమాన్ నల్లపావులతో ఆశ్చర్యకరరీతిలో ఆడాడని ఆయన తెలిపారు.

''చీటింగ్ విషయంలో కచ్చితంగా ఏదైనా చర్య తీసుకోవాలి. ఈ ప్రక్రియలో నా వంతుగా, గతంలో చాలాసార్లు మోసాలకు పాల్పడిన ఆటగాళ్లతో నేను ఆడాలనుకోవట్లేదు. భవిష్యత్‌లో వారు ఏమి చేయగలరో నాకు తెలియదు. నేను ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నా. కానీ, నీమాన్ అనుమతి లేకుండా బాహాటంగా ఏమీ మాట్లాడలేను.

మాగ్నస్ కార్ల్‌సన్

ఫొటో సోర్స్, Reuters

ఇప్పటివరకు నా చర్యల ద్వారా నేను చెప్పాలనుకున్నది చెప్పగలిగాను. నేను, నీమాన్‌తో చెస్ ఆడటానికి ఇష్టపడట్లేదు అనేది నా చర్యల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది'' అని కార్ల్‌సన్ ప్రకటనలో పేర్కొన్నారు.

దీనిపై వ్యాఖ్య కోసం నీమాన్ ప్రతినిధులను బీబీసీ సంప్రదించింది.

ఈ వివాదం చెలరేగినప్పుడు నీమాన్ తనపై ఆరోపణలను ఖండించారు. కార్ల్‌సన్, ఇతరులు తన కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నీమాన్ ఆరోపించారు.

''ఒకవేళ వారు నేను నగ్నంగా చెస్ ఆడాలని కోరుకుంటే అందుకు నేను సిద్ధం. నేను దాన్ని లెక్క చేయను. ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు లేని మూసి ఉంచిన గదిలో నన్ను ఆడమంటే కూడా నేను ఆడతాను. నేనిక్కడ గెలవడం కోసం ఉన్నా. అదే నా లక్ష్యం'' అని నీమాన్ అన్నారు.

వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో పోటీపడిన ఏకైక బ్రిటిష్ ప్లేయర్, గ్రాండ్ మాస్టర్ నిగెల్ షార్ట్ దీనిగురించి బీబీసీతో మాట్లాడారు.

కార్ల్‌సన్‌పై గెలిచేందుకు నీమాన్ మోసం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, 'ఫౌల్ ప్లే' ఆరోపణలపై తనకు సందేహంగా ఉందని షార్ట్ అన్నారు.

''ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా ఈ వివాదం ఇలా ముందుకు వెళ్లడం చాలా దురదృష్టకరం'' అని షార్ట్ వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, బర్మింగ్‌హాం నగరంలో ప్రధాన ఆకర్షణ ప్రాంతాలకు పెరిగిన డిమాండ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)