గుజరాత్ తీరంలో పాకిస్తాన్ బోటు... రూ.200 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

పాకిస్తాన్ బోటును తీసుకొని వస్తున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ బోటు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ బోటును తీసుకొని వస్తున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ బోటు

గుజరాత్ రాష్ట్ర తీరంలో పాకిస్తాన్ బోటు కనిపించడం కలకలం సృష్టించింది. భారతదేశ తీర జలాల్లో పాకిస్తాన్ బోటు కనిపించగా దాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకున్నాయి.

బోటులో 40 కేజీల డ్రగ్స్‌ దొరికినట్లు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తెలిపింది. మార్కెట్‌లో ఈ డ్రగ్స్ విలువ సుమారు 200 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

గుజరాత్‌లోని జఖావ్ తీరానికి దాదాపు 33 నాటికల్ మైళ్ల దూరంలో పాకిస్తాన్ బోటు కనిపించిందని తీర రక్షక దళం తెలిపింది.

పోలీసులు అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్ బోటులోని సిబ్బంది, డ్రగ్స్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పోలీసులు అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్ బోటులోని సిబ్బంది, డ్రగ్స్

భారత తీర రక్షణ దళం పట్టుకున్న ఈ బోటులో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి సమాచారం కోసం తదుపరి విచారణ సాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇటీవల కాలంలో గుజరాత్‌లో భారీ స్థాయిలో డ్రగ్స్ దొరుకుతున్నాయి. పోయిన ఏడాది అక్టోబరులో ముంద్రా పోర్టులో 2,998 కేజీల డ్రగ్స్ పట్టుబడ్డాయి. మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.21,000 కోట్లు ఉంటుందని అంచనా.

గుజరాత్ తీరంలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడిన ఘటనల్లో ఇదీ ఒకటి.

డ్రగ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఏడాది ఆగస్టులో రూ.1,026 కోట్ల విలువైన 513 కేజీల డ్రగ్స్ గుజరాత్‌లోని ఒక ఫ్యాక్టరీలో పట్టుకున్నారు.

ఇదే ఏడాది జులైలో రూ.376 కోట్ల విలువైన 75.3కేజీల హెరాయిన్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పట్టుకుంది.

2021 జనవరి నుంచి 2022 ఫిబ్రవరి మధ్య సుమారు రూ.3,617 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ‘న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రిపోర్ట్ చేసింది. సుమారు 68,984 కిలోల డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు.

ఒకప్పుడు భారతదేశంలో మాదకద్రవ్యాల రవాణా పంజాబ్ కేంద్రంగా జరిగేది. కానీ ఇప్పుడు గుజరాత్ కేంద్రంగా జరుగుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి డ్రగ్స్‌ను గుజరాత్‌కు తీసుకొచ్చి, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని వారు తెలిపినట్లు న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది.

వీడియో క్యాప్షన్, డ్రగ్స్‌‌కు అలవాటుపడిన వారిలో లక్షణాలు ఎలా ఉంటాయి, తల్లిదండ్రులు ఏం చేయాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)