ఆసియా కప్ 2022: భారత్‌పై పాకిస్తాన్ ఎలా గెలిచింది... ఆసిఫ్ అలీ, ఖుష్‌దిల్ షా చివరి రెండు ఓవర్లలో ఏం చేశారు?

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

ఆసియా కప్‌ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్‌తో అయిదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. పాకిస్తాన్ ఆటగాళ్లు ఆసిఫ్ అలీ, ఇఫ్తేకర్ అహ్మద్, ఖుష్‌దిల్ షా జట్టును విజయం వైపు నడిపించారు.

పాకిస్తాన్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే చివరి రెండు ఓవర్లలో 26 పరుగులు చేయాల్సి ఉంది. భువనేశ్వర్ కుమార్ వేసిన 19వ ఓవర్లో ఆసిఫ్ అలీ, ఖుష్‌దిల్ షా కలిసి 19 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని ఖరారు చేశారు.

దానికి ముందు, 18వ ఓవర్‌లో భారత బౌలర్ రవి బిష్ణోయ్ వేసిన బంతికి ఆసిఫ్ అలీ సింపుల్ క్యాచ్‌ ఇచ్చాడు. కానీ, అర్ష్‌దీప్ సింగ్ వదిలేశాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే పాకిస్తాన్‌కు 19వ ఓవర్లో 19 పరుగులు చేయడం కష్టమై ఉండేది.

అయితే, చివరి ఓవర్‌లో ఆసిఫ్ అలీని అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేయడంతో మళ్లీ భారత్ ఆశలు చిగురించాయి. కానీ, పాకిస్తాన్ ఛాన్స్ ఇవ్వలేదు. తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇఫ్తేకర్ అహ్మద్, ఖుష్‌దిల్ షాకు తోడుగా నిలిచి మ్యాచ్ ముగించాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పాకిస్తాన్ బ్యాటింగ్ సాగిందిలా..

181 పరుగుల లక్ష్యంతో పాకిస్తాన్ బరిలోకి దిగింది. ఓపెనర్లుగా మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ పటిష్టంగా కనిపించారు కానీ, బాబర్ అజామ్ 10 బంతులకే వెనుదిరిగాడు. రవి బిష్ణోయ్ వేసిన బంతికి క్యాచ్ ఇచ్చి, పెవిలియన్ బాట పట్టాడు. బాబర్ అజామ్ 10 బంతుల్లో రెండు ఫోర్లతో 14 పరుగులు చేశాడు.

మరోవైపు, మహ్మద్ రిజ్వాన్ తొలి బంతికే ఫోర్ కొట్టి తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. బాబర్ అవుటయ్యాక, తరువాతి ఓవర్‌లోనే హార్దిక్ పాండ్యా వేసిన బంతులకు రెండు ఫోర్లు బాదాడు. ఆ తరువాత అర్ష్‌దీప్ ఓవర్‌లో రిజ్వాన్ స్పెషల్ షాట్‌తో స్క్వేర్ లెగ్ వైపు సిక్స్ బాదాడు. ఈ షాట్లు రిజ్వాన్ స్పెషాలిటీగా మారాయి. రిజ్వాన్ నిలకడగా ఆడుతూ, పరుగులు రాబట్టాడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు పాకిస్తాన్ జట్టు పటిష్టంగా కనిపించింది.

వన్ డౌన్‌టో వచ్చిన ఫఖర్ జమాన్ 18 బంతుల్లో 15 పరుగులు చేసి తొందరగానే వెనుదిరిగాడు.

టు డౌన్‌లో బ్యాంటింగ్‌కు దిగిన మహ్మద్ నవాజ్, రిజ్వాన్‌కు తోడుగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి పాకిస్తాన్ స్కోరును పరుగులు పెట్టించారు.

మహ్మద్ నవాజ్ కేవలం 20 బంతుల్లో 42 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి మ్యాచ్‌ను దాదాపు తమవైపుకు తిప్పుకున్నాడు.

అప్పుడే, భువనేశ్వర్ కుమార్ తన చివరి ఓవర్లో స్లో బాల్ వేసి నవాజ్‌ను పెవిలియన్‌కు పంపాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

దీని తరువాత హార్దిక్ పాండ్యా, మహ్మద్ రిజ్వాన్‌ను అవుట్ చేశాడు. రిజ్వాన్ 51 బంతుల్లో 71 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి పాకిస్తాన్ స్కోరు నిలబెట్టాడు.

రిజ్వాన్ అవుట్ అయిన తరువాత మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపినట్టు కనిపించింది. కానీ, తరువాత వచ్చిన బ్యాట్స్‌మన్ విజృంభించి మ్యాచ్ ముగించారు.

ఈ మ్యాచ్‌లో భారత జట్టులో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. అయితే, రవి బిష్ణోయ్ మెరుగ్గా ఆడాడు. నాలుగు ఓవర్లలో 26 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. హార్దిక్ పాండ్యా నాలుగు ఓవర్లలో 44 పరుగులు, భువనేశ్వర్ కుమార్ నాలుగు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చారు. ఇద్దరూ చెరో వికెట్ తీశారు.

భారత్ బ్యాటింగ్

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలు బ్యాట్ ఝళిపిస్తే పరుగుల వరదేనని ఈ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో మరోసారి రుజువయింది.

నసీమ్ షా వేసిన తొలి ఓవర్లో, రోహిత్ శర్మ ముందు ఫోర్ కొట్టి, చివరి బంతికి సిక్సర్ బాదాడు. మొదటి ఓవర్‌లోనే 11 పరుగులు వచ్చాయి.

రెండో ఓవర్‌లో ఇద్దరూ కలిసి తొమ్మిది పరుగులు జోడించారు. నసీమ్ షా వేసిన మూడో ఓవర్ తొలి, చివరి బంతికి కేఎల్ రాహుల్ సిక్సర్లు బాదాడు. మూడు ఓవర్లకు 34 పరుగులు చేశారు. అయిదు ఓవర్లకు 54 పరుగులు జోడించారు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ భారీ మూల్యమే చెల్లించుకోవాలసి వస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు.

అప్పుడే, హరీస్ రవూఫ్ వేసిన బంతిని పైకి కొట్టే ప్రయత్నంలో రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చాడు. ఖుష్దిల్ షా అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దాంతో, రోహిత్ శర్మ 16 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 28 పరుగులు చేసి వెనుదిరిగాడు.

తరువాతి ఓవర్లో షాదాబ్ ఖాన్ తొలి బంతికే కేఎల్ రాహుల్‌ (20 బంతుల్లో 28 పరుగులు)ను పెవిలియన్‌కు పంపాడు.

కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లీ ప్రతాపం..

రెండు వికెట్లు కోల్పోయిన భారత కాస్త తడబడింది. వన్ డౌన్‌లో విరాట్ కోహ్లీ క్రీజులో పాతుకుపోయాడు కానీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ ఎక్కువసేపు నిలబడలేకపోయారు.

సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 13 పరుగులు (రెండు ఫోర్లు), రిషబ్ పంత్ 12 బంతుల్లో 14 పరుగులు (రెండు ఫోర్లు) చేసి వెనుదిరిగారు.

విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో తను పూర్తిగా ఫామ్‌లోకి వచ్చేసినట్టు కనిపించింది. 34వ బంతికి సిక్సర్ కొట్టి అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు.

మరోవైపు దీపక్ హూడా, కోహ్లీకి గొప్ప మద్దతు ఇచ్చాడు. దీపక్ 14 బంతుల్లో రెండు ఫోర్లతో 16 పరుగులు చేశాడు.

మ్యాచ్ చివరి ఓవర్ నాలుగో బంతికి కోహ్లీ రనౌట్ అయ్యాడు. మొత్తం 44 బంతుల్లో 60 పరుగులు (4 ఫోర్లు, 1 సిక్సర్) చేసి జట్టుకు మంచి స్కోర్ అందించాడు.

చివరి రెండు బంతుల్లో, రవి బిష్ణోయ్ రెండు ఫోర్లు కొట్టి భారత్‌ స్కోరును 181 పరుగులకు చేర్చాడు. పాకిస్తాన్ పేలవమైన ఫీల్డింగ్ కూడా సహకరించింది.

వీడియో క్యాప్షన్, ఉమ్రాన్ మాలిక్: బుల్లెట్‌ లాంటి బంతుల వెనుక రహస్యమిదే

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)