మంకీపాక్స్ వైరస్‌తో భారత్‌లో తొలి మరణం... 20 మందికి ఐసోలేషన్

ఫొటో సోర్స్, Getty Images
మంకీపాక్స్ వైరస్‌తో భారతదేశంలో తొలి మరణం సంభవించింది. ఈ మేరకు భారత్ అధికారికంగా ధ్రువీకరించింది. చనిపోయిన వ్యక్తి వయసు 22 ఏళ్ళు. ఆయన ఇటీవలే యునైటెడ్్రబ్ ఎమిరేట్స్ నుంచి కేరళ రాష్ట్రానికి వచ్చారు.
ఆ వ్యక్తికి విదేశాల్లో ఉన్నప్పుడే ప్రాథమిక పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని, చనిపోయిన తరువాత తీసుకున్న నమూనాలను పరీక్షించినప్పుడు కూడా మంకీపాక్స్ వైరస్ ఉన్నట్లు నిర్ధరణ అయిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సోమవారం నాడు చెప్పారు. ఇది ఆఫ్రికా కాకుండా మిగతా ప్రపంచంలో మంకీపాక్స్ వైరస్‌తో సంభవించిన నాలుగో మరణం.
చనిపోయిన వ్యక్తికి అత్యంత సన్నిహితంగా మెలిగిన 20 మందిని 'హై రిస్క్' కేటగిరీగా గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచారు.
వారిలో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇటీవల ఆయనతో కలిసి ఫుట్ బాల్ ఆడిన తొమ్మిదిమంది ఉన్నారు.
ఈ వ్యాధి స్మాల్ పాక్స్ వైరస్ కుటుంబానికి చెందిన మంకీపాక్స్ వైరస్‌తో వచ్చింది. ఇది అంత తీవ్రమైనది కాదని, వ్యాప్తి కూడా తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మంకీపాక్స్ వ్యాధిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గత నెలలోనే అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
మంకీపాక్స్ మరణం సంభవించిన వెంటనే కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మృతుడి మెడికల్ రిపోర్టులను లోతుగా పరిశీలించాలని నిర్ణయించినట్లు వీణ తెలిపారు.
ఆ యువకుడికి ముందు జ్వరం వచ్చిందని, జూలై 27న ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారని తెలిసింది. అతని ఒంటి మీద ఎలాంటి మచ్చలు కూడా కనిపించలేదు. దాంతో, అతనికి మంకీపాక్స్ సోకిందేమో అన్న అనుమానం కూడా డాక్టర్లకు కలుగలేదని వీణ వివరిచారు.
యూఏఈలో ఉన్నప్పుడు జూలై 19న చేయించుకున్న పరీక్షల్లో అతడికి మంకీపాక్స్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆ తరువాత అతడు కేరళ చేరుకున్నాడు. అతడి ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు జూలై 30 వరకూ ఆరోగ్యశాఖ అధికారులకు తెలపలేదని కేరళ ఆరోగ్య మంత్రి వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఓఆర్ఎస్: డయేరియా నుంచి ప్రాణాలు కాపాడే సంజీవని ఇది, నిర్లక్ష్యం చేస్తున్నామా
- వరల్డ్ హెపటైటిస్ డే: సెక్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందా... ఇది సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
- కామన్వెల్త్ గేమ్స్ 2022: పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈసారి మెడల్స్ తెస్తారా?
- ‘నీకంటే ముందు నేనే ప్రాణాలు వదిలేస్తాను.. నేను చనిపోతే కన్నీరు కార్చకు సంతోషంగా సాగనంపు’
- రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోల వివాదం మన నైతిక విలువల గందరగోళాన్ని సూచిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











