Hamid Ansari - Nusrat Mirza: భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి పాకిస్తాన్‌కు రహస్య సమాచారం ఇచ్చారా... అలా ఆరోపించిన నుస్రత్ మీర్జా ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
భారత మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి చిక్కుల్లో పడ్డారు.
అన్సారీ సాయంతో భారత్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని తాను తెలుసుకున్నానంటూ పాకిస్తాన్ జర్నలిస్ట్ నుస్రత్ మీర్జా చెప్పడం ఇప్పుడు వివాదంగా మారింది.
యూపీఏ ప్రభుత్వ కాలంలో తాను అయిదు సార్లు భారత్‌కు వచ్చినట్లు మీర్జా చెప్పుకొచ్చారు.
'దిల్లీకి రమ్మంటూ 2005-2011 మధ్య నన్ను హమీద్ అన్సారి అయిదుసార్లు ఆహ్వానించారు. భారత్‌కు సంబంధించిన నిఘా, సున్నితమైన సమాచారాన్ని నాతో పంచుకున్నారు. నేను ఆ సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్‌ఐకు షేర్ చేశా. ఆ సమాచారాన్ని భారత్‌కు వ్యతిరేకంగా ఐఎస్‌ఐ వాడుకుంది' అని పాకిస్తాన్ జర్నలిస్ట్ షకీల్ చౌదరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నుస్రత్ మీర్జా అన్నారు.
బెంగళూరు, చెన్నై, చండీగర్, కోల్‌కతా, పట్నా, లఖ్‌నవూ వంటి నగరాలను సందర్శించానని మీర్జా చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, MIRZANUSRATBAIG
ఈ వార్తలు బయటకు రావడంతో కాంగ్రెస్ పార్టీ, హమీద్ అన్సారి మీద దాడికి దిగింది బీజేపీ. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పాకిస్తాన్ జర్నలిస్ట్ నుస్రత్ మీర్జాను ఎలా కలుస్తురంటూ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ప్రశ్నించారు.
2010లో ఉగ్రవాదం మీద దిల్లీలో జరిగిన సమావేశంలో హమీద్ అన్సారి, నుస్రత్ మీర్జా ఒకే వేదికను పంచుకున్నారంటూ భాటియా ఆరోపించారు. అందుకు సంబంధించిన ఫొటోను చూపించారు.
కానీ నుస్రత్ మీర్జా చెబుతున్నవన్నీ అబద్ధాలని, తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ హమీద్ అన్సారి అన్నారు.
భారత ప్రభుత్వ సలహాతోనే ఉపరాష్ట్రపతి అతిథులను ఆహ్వానిస్తారనే విషయం అందరికీ తెలుసని, అది కూడా కేంద్ర హోంశాఖ ద్వారానే జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
'2010 డిసెంబరు 11న అంతర్జాతీయ ఉగ్రవాదం మీద జరిగిన కాన్ఫరెన్స్‌ను నేను ప్రారంభించా. సమావేశంలో పాల్గొనే వాళ్లను ఆర్గనైజర్లు ఆహ్వానిస్తారు. నేను నుస్రత్ మీర్జాను ఎన్నడూ ఆహ్వానించలేదు. ఆయనను ఎన్నడూ కలవలేదు' అని హమీద్ అన్సారీ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు.
ఇరాన్‌లో తాను భారత రాయబారిగా పని చేసినప్పుడు దేశ భద్రతను తాకట్టు పెట్టానని కూడా ఆరోపణలు చేస్తున్నారని, కానీ తాను ఎన్నడూ జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకునే పని చేశానని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఇరాన్‌లో అంబాసిడర్‌గా ఉన్నప్పుడు నేను చేసిన ప్రతి పనీ నాటి ప్రభుత్వానికి తెలుసు. నేను జాతీయ భద్రతకు నిబద్ధుడనై పని చేశా. వాటి మీద నేను కామెంట్ చేయను. భారత్ ప్రభుత్వానికి అంతా తెలుసు. దీని గురించి చెప్పే అధికారం దానికే ఉంది. ఇరాన్ తరువాత నేను ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారిగా ఉన్నాను. అక్కడ నా పనితీరుకు ఇంటాబయట గుర్తింపు దక్కింది' అని ప్రకటనలో అన్సారి పేర్కొన్నారు.
'భారత ప్రభుత్వ సలహాతోనే అతిథులను ఆహ్వానిస్తారని హమీద్ అన్సారి చెబుతున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసేటప్పుడు, అతిథులను పిలిచేటప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం అనుమతి తీసుకున్నారో లేదో చెప్పాలి?' అంటూ గౌరవ్ భాటియా డిమాండ్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
నుస్రత్ మీర్జా ఎవరు?
పాకిస్తాన్ జర్నలిస్ట్ షకీల్ చౌదరికి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం నుస్రత్ మీర్జా దిల్లీలో పుట్టారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు.
కొన్ని సంవత్సరాలుగా ఆయన పేపర్లకు కాలమ్స్ రాస్తున్నారు కానీ ఫీల్డ్‌లోకి వెళ్లి ఒక జర్నలిస్టుగా ఆయన ఎన్నడూ పని చేయలేదని కరాచీకి చెందిన సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు.
‘ముంబయి దాడులు చేసింది అమెరికానే’
నుస్రత్ మీర్జా నమ్మలేని ఆరోపణలు, కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ ఉంటారని షకీల్ చౌదరి బీబీసీతో అన్నారు. హమీద్ అన్సారీ మీద ఆయన చేసిన ఆరోపణలు విని ఆశ్చర్యపోయానని తెలిపారు.
'ఆయన సరైన ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. ఆయనకు అంత పరిజ్ఞానం ఉన్నట్లుగా కూడా అనిపించడం లేదు' అని షకీల్ అన్నారు.
'నుస్రత్ మీర్జాను నిజమైన జర్నలిస్ట్‌గా మేం చూడం. ఆయన గోరంతను కొండంత చేసి చెబుతుంటారు. జర్నలిస్ట్ సర్కిల్‌లో ఆయనను పెద్దగా నమ్మరు' అని కరాచీకి చెందిన ఒక సీనియర్ జర్నలిస్ట్ తెలిపారు.
ఇలాంటి విశ్వసనీయతలేదని చెబుతున్న జర్నలిస్టును ఎలా ఇంటర్వ్యూ చేశారని, షకీల్‌ని అడగ్గా ఆయన ఇలా చెప్పారు.
'ముంబయి దాడులు అమెరికా చేయించిందని ఒక పెద్ద పత్రికలో ఆయన రాశారు. నీ వద్ద ఏమైనా ఆధారాలున్నాయా? అని నేను అడిగాను. చాలా మంది ఇలానే అనుకుంటున్నారని ఆయన నాతో అన్నారు.
అంతేకాదు పాకిస్తాన్‌లో భూకంపం రావడానికి, జపాన్‌లో సునామీకి కూడా కారణం అమెరికానే అని నుసరత్ మీర్జా రాసేవారు.
వాతావరణాన్ని మార్చగల ఒక వ్యవస్థను అలస్కా భూగర్భంలో అమెరికా రూపొందించిందని ఆయన చెప్పేవారు.
ఇలాంటి నమ్మలేని ఆరోపణలు చేసే వారిని ఇంటర్వ్యూ చేసి ప్రశ్నించడం నాకు అలవాటు' అని షకీల్ తెలిపారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
నుస్రత్ మీర్జా వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించాయని, పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షిద్ మహ్మద్ కసూరీ బీబీసీతో అన్నారు. 'ఆయన గూఢచారి అయితే తన గురించి ప్రపంచానికి వెల్లడించాల్సిన పని ఏముంది?' అని ఆయన ప్రశ్నించారు.
షకీల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కసూరీ మీద కూడా మీర్జా ఆరోపణలు చేశారు.
'భారత్‌కు వెళ్లడానికి నాకు అనేక సార్లు కసూరీ వీసాలు ఇప్పించారు. నేను సేకరించిన సమాచారాన్ని ఆయన, ఐఎస్‌ఐకు పంపుతానని చెప్పేవారు' అని మీర్జా చెప్పుకొచ్చారు.
ఈ ఆరోపణలను కసూరీ ఖండించారు. తాను చాలా మంది భారతీయులు, పాకిస్తానీలకు వీసాలు ఇప్పించానని... ఆ సమయంలో ఏమైనా మీర్జాను కలిసి ఉండొచ్చని ఆయన అన్నారు.
ఈ వివాదం మీద మాట్లాడేందుకు నుస్రత్ మీర్జాను సంప్రదించే ప్రయత్నం బీబీసీ చేసింది. కానీ ఫోన్ కాల్స్‌కు, మెసేజెస్‌కు ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
ఇవి కూడా చదవండి:
- హిందూ రాజ్యాన్ని అంబేడ్కర్ అతి పెద్ద ప్రమాదంగా ఎందుకు భావించారు?
- గోదావరి 1986 నాటి స్థాయిలో పొంగితే ఏటిగట్లు నిలుస్తాయా
- ద్వారక: సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడి నగరం కోసం అన్వేషణ. దొరికిన ఆనవాళ్లు ఏం చెబుతున్నాయి
- రంప తిరుగుబాటుకు, అల్లూరి కి సంబంధం ఉందా?మోదీ ఏమన్నారు, చరిత్ర ఏం చెబుతోంది?- బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- కేటీఆర్ తరచూ వాడే 'జుమ్లా’ అనే మాటను ‘అన్‌పార్లమెంటరీ’ పదంగా ప్రకటించిన పార్లమెంట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













