Unparliamentary: కేటీఆర్ తరచూ వాడే 'జుమ్లా’ అనే మాటను ‘అన్‌పార్లమెంటరీ’ పదంగా ప్రకటించిన పార్లమెంట్

ఫొటో సోర్స్, Facebook/KTR
జుమ్లా... ఇటీవల కాలంలో తెలుగునాట బాగా వినపడుతున్న పదం ఇది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా కనీసం ఒక్కసారైనా ఈ పదాన్ని వాడుతుంటారు. ముఖ్యంగా బీజేపీని విమర్శించడానికి ఆయన ఈ పదాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
ఇప్పుడు #Jumla అనేది సోషల్ మీడియాలో ఒక హాష్‌ట్యాగ్ కూడా. కానీ ‘జుమ్లాజీవి’ అనేది ఇకపై అన్‌పార్లమెంటరీ పదమని లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. అంటే పార్లమెంటులో జరిగే ప్రసంగాల్లో ఎవరైనా ఎంపీ 'జుమ్లాజీవి' అనే పదం వాడితే దానిని రికార్డుల నుంచి తొలగిస్తారు.
‘జుమ్లాజీవి’ అంటే మాటలు చెప్పడమే కానీ, చేతల్లో చూపించని వ్యక్తి అని అర్థం. ఇదొక్కటే కాదు తాన్‌షాహ్, జయ్‌చంద్, కరప్ట్, డ్రామా ఇలాంటి మరికొన్ని పదాలను కూడా అన్‌పార్లమెంటరీ భాషగా నిర్ణయించారు.

ఈ పదాలను ఎంపీలు వాడకూడదు
- తాన్‌షాహ్(నియంత), జయ్‌చంద్(ద్రోహి), శకుని
- కరప్ట్(అవినీతి), నౌటంకీ(డ్రామా), డిండోరా పీట్నా(సొంత డబ్బా కొట్టుకోవడం)
- నికమ్మా(దద్దమ్మ), బిట్రేయ్డ్(విద్రోహం), హిపోక్రసీ
- అషేమ్డ్(సిగ్గుమాలిన), వినాశ్ పురుష్(వినాశకారి), ఖలిస్థానీ
- చీటర్(మోసకారి), బేహ్రీ సర్కార్(చెవిటి ప్రభుత్వం), బ్లడ్‌షెడ్(రక్తపాతం)
- డాంకీ(గాడిద), ఇన్‌కాంపిటెంట్(సత్తాలేని), ఎబ్యూజ్డ్(దుర్భాష), స్నూప్‌గేట్


ఫొటో సోర్స్, ANI
ఈ నెల 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్‌పార్లమెంటరీ పదజాలంగా భావించే హిందీ, ఇంగ్లిష్ పదాల జాబితాను లోక్‌సభ సచివాలయం విడుదల చేసింది.
శకుని, డిక్టేటర్, డిక్టేటర్‌షిప్, ఖూన్ సె ఖేతి వంటి పదాలు కూడా ఆ జాబితాలో ఉన్నాయని పీటీఐ వార్తా సంస్థ చెబుతోంది.
ఈ పదాలన్నీ పార్లమెంటులోనూ రాష్ట్రాల అసెంబ్లీలలోనూ కొందరి సభ్యుల నుంచి తరచూ వినపడుతూ ఉండేవే. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలను విమర్శించేందుకు ఈ పదాలను ప్రతిపక్షాలు ఎక్కువగా వాడుతుంటాయి.

ఈ పదాలు కూడా నిషేధమే
- బాల్ బుద్ధి, ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే (దొంగే పోలీసును దొంగ దొంగ అనడం)
- అహంకార్(అహంకారం), కాలా దిన్(బ్లాక్ డే)
- గూండా గర్దీ(గూండా గిరీ), గూండే కి సర్కార్(రౌడీ సర్కార్)
- తలవే చాట్నా(బూట్లు నాకడం), దాదాగిరి, ఘడియాలి ఆంశు(మొసలి కన్నీళ్లు)

ఈ అన్‌పార్లమెంటరీ పదాల జాబితా బయటకు రాగానే ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. తమ గొంతును నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించాయి.
'మోదీ ప్రభుత్వ నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు ప్రతిపక్షాలు ఉపయోగించే పదాలను ఇక నుంచి అన్‌పార్లమెంటరీగా పరిగణిస్తారు. తరువాత ఏంటి విశ్వగురు?' అంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
'లోక్‌సభ, రాజ్యసభలో ఉపయోగించకూడని అన్‌పార్లమెంటరీ పదాల జాబితాలో 'సంఘ్' లేదు. భారత్‌ను బీజేపీ ఎలా నాశనం చేస్తూ ఉందో వివరించడానికి ప్రతిపక్షాలు వాడే అన్ని పదాలను ప్రభుత్వం నిషేధించింది.' అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
'ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే...అది అవినీతికి పాల్పడితే దాన్ని అవినీతి అనకూడదు. అవినీతిని మాస్టర్‌స్ట్రోక్ అని పిలవాలి. రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం వంటి వట్టి మాటలు చెప్పే వాళ్లను 'జుమ్లాజీవి' అని కాకుండా 'థ్యాంక్యూ' చెప్పాలి.
ఇదే పార్లమెంటులో రైతులను 'ఆందోళనజీవులు' అన్నది ఎవరు?' అంటూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, ANI
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
'కొత్త భారత్‌కు కొత్త డిక్షనరీ' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ప్రతి ఏడాది జాబితా విడుదల
ప్రతి ఏడాది అన్‌పార్లమెంటరీ పదాల జాబితాను విడుదల చేస్తారని లోక్‌సభకు చెందిన అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు. మీడియాలో తరచూ వినిపించే పదాలను కూడా తాజా జాబితాలో నిషేధించినట్లు వెల్లడించారు. తన పేరు వెల్లడించడానికి ఆ అధికారి ఒప్పుకోలేదు.
'ఈ జాబితాను మేం సొంతగా తయారు చేయం. లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ఏదో ఒక సందర్భంలో వాటిని అన్‌పార్లమెంటరీ పదాలుగా పిలిచి ఉండాలి. ఇది స్పీకర్ తీసుకునే నిర్ణయం. వారి ఆదేశాల మేరకే ఈ జాబితాను సిద్ధం చేశాం.
లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీలలో వాడే పదాలను ఈ జాబితాలో చేర్చాం. ఇది 2021లో తయారు చేసింది. ప్రతి ఏడాది మేం అప్‌డేట్ చేస్తాం. 2022 అయిపోయిన తరువాత కొత్త జాబితా వస్తుంది.
సాధారణంగా జాబితాను రూపొందించే ప్రక్రియ జనవరి-ఫిబ్రవరిలో మొదలవుతుంది. ఈ జాబితాను లోక్‌సభ అధికారులు రూపొందిస్తారు. కానీ రాజ్యసభకు కూడా ఇది వర్తిస్తుంది. మేం మా పని చేశాం. ఏ సందర్భంలో వాడారు అనే దాన్ని బట్టి పదాలను అన్‌పార్లమెంటరీగా ప్రకటిస్తారు.' అని ఆ అధికారి వివరించారు.
ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్ బొమ్మతో పేపర్ ప్లేట్లు, ఇదేమిటని అడిగిన 18 మందిని జైల్లో పెట్టారు... అసలేం జరిగింది?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలు ఈ మొక్కను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
- శ్రీలంకకు సైన్యాన్ని పంపుతోంది, గొటబయా పారిపోవడానికి సాయం చేసిందనే వదంతులు భారత్‌పై ఎందుకు వస్తున్నాయి
- ‘భార్య తాళిబొట్టును విసిరికొట్టడం వల్ల కలిగిన మనోవేదన’ అనే కారణం చెప్పి భర్త విడాకులు పొందవచ్చా
- వైసీపీ పేరు మార్చడం సాధ్యమవుతుందా, గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











