‘మూడేసి రోజులు గదిలోనే పెట్టి లాక్ చేసేవారు. తిండి కూడా పెట్టేవారు కాదు’ - పాకిస్తాన్ ఎంపీ ఆమిర్ లియాకత్‌పై 31ఏళ్ల తక్కువ వయసున్న భార్య ఆరోపణలు

ఫొటో సోర్స్, TWITTER/AMIR LIYAQUAT
పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడు, టీవీ ప్రముఖుడు ఆమిర్ లియాకత్ మూడో పెళ్లి కథ కూడా కొన్ని నెలలకే ముగుస్తోంది.
49ఏళ్ల ఆమిర్ గత ఫిబ్రవరిలో 18ఏళ్ల సయిదా దానియా షాను పెళ్లి చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆమిర్ నుంచి విడాకులు కోరుతూ దానియా కోర్టును ఆశ్రయించారు.
ఆమిర్‌పై దానియా గృహహింస ఆరోపణలు చేశారు. తమ పెళ్లిని రద్దు చేయాలని ఆమె కోర్టును కోరారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తహరీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)లో ఆమిర్ సభ్యులు.
ఆమిర్‌తో తాను విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దానియా షా వెల్లడించారు. కోర్టులో విడాకులకు అర్జీ పెట్టినట్లు ఆమె చెప్పారు. ఆయన గురించి చాలా విషయాలు మీకు చెప్పాలని ఆమె వీడియోలో అన్నారు.
తనపై ఆమిర్ చాలా క్రూరంగా ప్రవర్తించారని దానియా ఆరోపించారు. ‘‘నన్ను మూడేసి రోజులు గదిలోనే పెట్టి లాక్ చేసేవారు. తిండి కూడా పెట్టేవారు కాదు’’అని ఆమె చెప్పారు.
తుపాకీతో కాల్చేస్తానని ఆమిర్ బెదిరించారని దానియా ఆరోపించారు. గొంతు కూడా ఒకసారి నొక్కేశారని ఆమె అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘నాకు, నా సోదరుడికి, నా కుటుంబానికి ఏదైనా జరిగితే.. దానికి కారణం మాత్రం ఆమిరే’’అని ఆమె అన్నారు.
దానియా ఇంకా ఏం చెప్పారు?
విడాకులతోపాటు తనకు మెయింటెనెన్స్ ఇప్పించాలని కోర్టును దానియా అభ్యర్థించారు. తనను ఆమిర్ ఎంతో వేధించారని, బలవంతంగా అభ్యంతరకర వీడియోలు తీసేవారని ఆమె ఆరోపించారు.
ఆమిర్ తనకు నెలకు లక్ష రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వాలని కోరుతూ కోర్టుకు సమర్పించిన పత్రాలను దానియా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక ఇల్లు, కారు మొత్తంగా రూ.11 కోట్ల విలువైన ఆస్తులను ఆమె డిమాండ్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘నన్ను ఒక చిన్న గదిలో లాక్‌చేసేవారు. ఆ గదిలోనే బంధించి కొట్టేవారు. నన్ను, నా కుటుంబాన్ని బెదిరించేవారు. ఆమిర్.. దెయ్యం కంటే చెడ్డవారు’’అని దానియా వ్యాఖ్యానించారు.
దానియా పిటిషన్‌పై జూన్ 7న కోర్టు విచారణ చేపట్టనుంది.
దానియా చేస్తున్న ఆరోపణలపై ఆమిర్ స్పందించారు. ఆ ఆరోపణలన్నీ అబద్ధాలేనని, వాటిలో ఎలాంటి నిజాలూలేవని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఆమిర్-దానియాల విడాకులపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొంతమంది ఆమిర్‌ను తప్పు పడుతుంటే, మరికొందరు కేవలం డబ్బు కోసమే దానియా ఈ పెళ్లి చేసుకుందని విమర్శిస్తున్నారు. ఆమిర్ గురించి ఆమెకు ముందే అంతా తెలుసని మరికొందరు దానియాను తప్పు పడుతున్నారు.
ఫిబ్రవరిలోనే పెళ్లి..
49ఏళ్ల ఆమిర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 18ఏళ్ల దానియాను మూడో పెళ్లి చేసుకుంటున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. వీరిద్దరి మధ్య 31ఏళ్ల వయసు తేడా ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఈ పెళ్లికి కొన్ని రోజుల ముందే, ఆమిర్‌తో తాను విడిపోతున్నట్లు ఆయన రెండో భార్య సయీదా తూబ్ అన్వర్ వెల్లడించారు.
‘‘నా జీవితంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పులను బరువెక్కిన హృదయంతో చెబుతున్నాను. నా పరిస్థితి గురించి నా స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలుసు. ఆమిర్‌తో ఇక కలిసి జీవించాలని ఎలాంటి ఆశా లేదు. నా అభిప్రాయాన్ని అందరూ గౌరవిస్తారని భావిస్తున్నాను’’అని ఆమె సోషల్ మీడియాలో చెప్పారు. ఆమిర్, తూబ్ 2018లో పెళ్లి చేసుకున్నారు.
మరోవైపు ఆమిర్ మొదటి భార్య కూడా తనకు ఫోన్‌లో ఆయన విడాకులు చెప్పారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: అత్యాచారాలు, గ్యాంగ్‌రేప్‌లు పెరుగుతున్నాయా... హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లలో కూడా ఎలా జరుగుతున్నాయి?
- రష్యన్ ఓలిగార్క్ సూపర్ యాట్ల విలాసం: 3డి సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, స్పా, జిమ్‌లు, బార్లు..
- ఇమ్రాన్ ఖాన్: ‘గాడిద ఎప్పుడూ గాడిదే.. చారలు గీచినంత మాత్రాన జీబ్రా కాదు’ అని ఎందుకు అన్నారు?
- చటేశ్వర్ పుజారా: వరుసగా 4 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు.. అందులో రెండు డబుల్ సెంచరీలు
- కాజల్ అగర్వాల్: 'నిన్ను కన్న క్షణమే నీతో ప్రేమలో పడిపోయా...'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)