మదర్స్ డే - కాజల్ అగర్వాల్: 'నిన్ను కన్న క్షణమే నీతో ప్రేమలో పడిపోయా...'

ఫొటో సోర్స్, fb/Kajal Aggarwal
"నువ్వు ఎప్పుడూ నా బంగారానివే.. నిన్ను మొదటిసారి ఎత్తుకున్నప్పుడు, నీ చిట్టి చేతులు, చిన్ని కళ్లు చూశాను. నీ వెచ్చని ఊపిరి నాకు తగిలింది. ఆ క్షణమే నీతో ప్రేమలో పడిపోయాను.
నువ్వు నా మొదటి బిడ్దవి, నా మొదటి కొడుకువి, ఎప్పటికీ మొదటివాడివే. రాబోయే రోజుల్లో నేను నీకు ఎన్నో నేర్పుతాను. కానీ, నువ్వు నాకు అప్పుడే చాలా నేర్పావు. అమ్మతనం రుచి చూపించావు. నిస్వార్థంగా ప్రేమించడం నేర్పించావు. నా హృదయంలో ఒక భాగం బయటికొచ్చి నా చేతుల్లో ఒదిగిపోగలదని నిరూపించావు.
ఇంకా నేను నేర్చుకోవాలసినవి చాలా ఉన్నాయి. ఎన్నో అనుభూతులను నాకు మొదటిసారి రుచి చూపించినందుకు నీకు థాంక్స్. నువ్వు మంచివాడిగా, ధైర్యశాలిగా, తెలివైన, చురుకైన, ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పటికే నీలో ఉన్నాయి. అందుకే, నువ్వు నా బిడ్డవి అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నువ్వే నాకు సూర్యుడివి, నా చందమామవి, నక్షత్రానివి.. ఈ మాటలు ఎప్పుడూ మరచిపోకు"
సినీ నటి కాజల్ అగర్వాల్ మే 8న మాతృదినోత్సవం సందర్భంగా తన బిడ్డకు రాసిన లేఖ ఇది. దీన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో పోస్టు చేశారు.

ఫొటో సోర్స్, KAJAL\INSTAGRAM
మరోవైపు, మదర్స్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు అమ్మపై తమకున్న ప్రేమను, అభిమానాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మహేశ్ బాబు వాళ్ల అమ్మతో తన పిల్లలు తీయించుకున్న ఫొటో, తన సహచరి నమ్రత, పిల్లలతో ఉన్న ఫొటో పెట్టి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
"మా అమ్మకు, ప్రపంచంలోని తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. నీ ప్రేమకు సాటి లేదు" అంటూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రాం గోపాల్ వర్మ తన తల్లి గురించి ట్వీట్ చేస్తూ, "నేను అంత మంచి కొడుకుని కాలేకపోయినా, నువ్వు చాలా మంచి అమ్మవి" అని రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈమధ్య కాలంలో సూపర్ డూపర్ హిట్ అయిన కేజీఎఫ్ 1 & 2 సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్వీట్ చేస్తూ "ఈ ప్రపంచంలో నిజమైన యోధులకు మదర్స్ డే శుభాకాంక్షలు" అన్నారు. కేజీఎఫ్ సినిమాలో అమ్మ సెంటిమెంట్ బాగా పండిన సంగతి తెలిసిందే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఏ వేదికపైన అయినా అమ్మ గురించి మాట్లాడే అవకాశాన్ని వదులుకోరు లారెన్స్ రాఘవ.
"ప్రపంచంలోని అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. నాకు తొలి దైవం మా అమ్మ" అంటూ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, fb/lawrence
బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, వాళ్ల అమ్మతో ఉన్న ఫొటో పెడుతూ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
మహింద్ర అండ్ మహింద్ర కంపెనీ చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా 'ఇడ్లీ అమ్మ'కు ఇల్లు కట్టిస్తానని గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టు ట్విటర్‌లో రాశారు.
"మదర్స్ డే సందర్భంగా ఇడ్లీ అమ్మకు కానుకగా ఇస్తామన్న ఇంటి నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసినందుకు మా బృందానికి కృతజ్ఞతలు. ప్రేమ, ఆప్యాయత, నిస్వార్థం లాంటి అమ్మతనపు లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నారామె. ఆమెకు, ఆమె చేస్తున్న పనికి సహకరించగలగడం మా అదృష్టం. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
రచయిత, న్యాయవాది, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహచరి మిషెల్ ఒబామా తన తల్లి గురించి చెబుతూ, "చిన్న వయసులో సొంతంగా ఆలోచించడం, నా హక్కుల గురించి గొంతు విప్పడం, నా విలువ తెలుసుకోవడం నేర్పించారు మా అమ్మ" అంటూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేస్తూ, "మదర్స్ డే సందర్భంగా తల్లులందరికీ అభినందనలు. మనల్ని కన్న తల్లులు, తల్లి లాంటి దేవతలు, మాతృదేశం, భూమాత గురించి నా కవితల్లో ప్రస్తావించాను. విశ్వవ్యాప్తమైన అమ్మకు వందనాలు" అని రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
బీజేపీ నేత కిషన్ రెడ్డి ప్రపంచంలోని తల్లులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
"మాతృదేవోభవ.. దేవుడు అన్నిచోట్లా ఉందలేడు కాబట్టి అమ్మను సృష్టించాడు. ఆమె నవ్వు, త్యాగం మనల్ని ఉన్నత మానవులుగా తీర్చిదిద్దుతుంది. ఈ ప్రపంచాన్ని మెరుగైన సమాజంగా తీర్చిదిద్దుతున్న తల్లులందరికీ వందనాలు, కృతజ్ఞతలు" అని రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
ఇవి కూడా చదవండి:
- మదర్స్ డే: తల్లి అయ్యేందుకు సరైన వయసు ఏది? నిపుణులు చెప్పిన సమాధానం ఇది
- తాలిబాన్ ఆదేశం: ‘మహిళలు బురఖా ధరించాల్సిందే.. లేకుంటే కుటుంబంలోని మగవాళ్లకు జైలు శిక్ష’
- బాంగ్బాంగ్ మార్కోస్: తండ్రి అవినీతి రాజకీయ సామ్రాజ్యాన్ని కొడుకు పునఃప్రతిష్టిస్తారా
- డాన్స్ వ్యాధి: 16వ శతాబ్దపు ఐరోపాలో వేలాది మంది ప్రాణాలు తీసిన ఈ వింత వ్యాధి ఏంటి?
- ప్రపంచంలో ఎక్కడా లేనన్ని ఇంటర్నెట్ షట్డౌన్లు ఒక్క భారతదేశంలోనే ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)