Cheteshwar Pujara: ససెక్స్ తరపున వరుసగా 4 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు.. అందులో రెండు డబుల్ సెంచరీలు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్

ఫొటో సోర్స్, Getty Images
భారత బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలతో సత్తా చాటాడు. ఇంగ్లండ్‌లో జరుగుతోన్న కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్-2లో ససెక్స్ జట్టు తరపున పుజారా ఈ ప్రదర్శనను నమోదు చేశాడు.
ఫామ్ లేమి కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన పుజారా... తాజా ప్రదర్శనలతో మళ్లీ అందరి దృష్టిని తనవైపు మరల్చుకున్నాడు.
మిడిల్‌సెక్స్ జట్టుతో జరుగుతోన్న మ్యాచ్‌లో ససెక్స్ రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 170 పరుగులు చేశాడు. ఇందులో 22 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లోనే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షహీన్ షా అఫ్రిదీ బౌలింగ్‌లో పుజారా అప్పర్ కట్‌తో సిక్స్ కొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ససెక్స్ 392 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో పుజారా 16 పరుగులే చేయగలిగాడు. అనంతరం మిడిల్‌సెక్స్ 358 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ససెక్స్ 68 ఓవర్లలో 4 వికెట్లకు 335 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పుజారా (170 నాటౌట్) అజేయంగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మిడిల్‌సెక్స్ వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ స్థానంలో ససెక్స్ జట్టులో చోటు దక్కించుకున్న పుజారా గత మూడు మ్యాచ్‌ల్లోనూ శతకాలు నమోదు చేశాడు.
డెర్బీషైర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 201 పరుగులు చేశాడు. ఆ తర్వాత వోర్సెస్టర్‌షైర్‌పై 109 పరుగులు, డర్హమ్ జట్టుపై 203 పరుగులు నమోదు చేశాడు.
పుజారా ప్రదర్శనపై సామాజిక మాధ్యమాల్లో క్రికెటర్లు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ కూడా పుజారా ప్రదర్శనపై ట్వీట్ చేసింది.
నాలుగు మ్యాచ్‌ల్లో 143.40 సగటుతో 717 పరుగులు చేసిన పుజారా ఈ సీజన్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ తరఫున అద్భుతంగా ఆడుతున్నాడని పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కూడా పుజారాను ప్రశంసించారు. ''భారత జట్టులో లేనప్పుడు దిగ్గజ క్రికెటర్లు ఇలాగే సెంచరీలు, డబుల్ సెంచరీలు బాది సెలెక్టర్ల తలుపు తడుతుంటారు. ఐపీఎల్ గ్లామర్‌కు దూరంగా ఉన్నా.. తనను మరచిపోవద్దనే సంకేతాలను పుజారా పంపిస్తున్నాడు'' అని కైఫ్ ట్వీట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
షహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో పుజారా కొట్టిన సిక్స్ వీడియోను క్రిష్ అనే యూజర్ షేర్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
భారత్ తరఫున 95 టెస్టులు ఆడిన పుజారా 43.87 సగటుతో 6713 పరుగులు చేశాడు. ఇందులో 32 అర్ధసెంచరీలు, 18 సెంచరీలు ఉన్నాయి. అయిదు వన్డేల్లోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
ససెక్స్ జట్టులో భారత బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారాతో పాటు, పాకిస్తాన్ వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ కూడా సభ్యుడు.
అంతకు ముందు డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొహమ్మద్ రిజ్వాన్‌తో కలసి చటేశ్వర్ పుజారా ఆరో వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని ససెక్స్ జట్టుకు అందించాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
వీరిద్దరూ కలసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చటేశ్వర్ పుజారా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పుడు పుజారాను మొహమ్మద్ రిజ్వాన్ హత్తుకుని, భుజంపై తడుతూ అభినందించాడు.
ఈ వీడియోలను కొందరు క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- కాజల్ అగర్వాల్: 'నిన్ను కన్న క్షణమే నీతో ప్రేమలో పడిపోయా...'
- మదర్స్ డే: తల్లి అయ్యేందుకు సరైన వయసు ఏది? నిపుణులు చెప్పిన సమాధానం ఇది
- తాలిబాన్ ఆదేశం: ‘మహిళలు బురఖా ధరించాల్సిందే.. లేకుంటే కుటుంబంలోని మగవాళ్లకు జైలు శిక్ష’
- భారత్‌లో మెక్‌డోనాల్డ్స్ ఫాస్ట్‌ఫుడ్ సంస్థ ఎలా విజయం సాధిస్తోంది
- Mother's Day: మాతృ దినోత్సవాన్ని మొదలుపెట్టింది, తర్వాత రద్దు చేయాలని డిమాండ్ చేసిందీ ఈమే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)