Imran Khan: ‘గాడిద ఎప్పుడూ గాడిదే.. చారలు గీచినంత మాత్రాన జీబ్రా కాదు’ అని ఎందుకు అన్నారు?

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, SCREENGRAB/JUNAID AKRAM'S PODCAST

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్, తనను తానే గాడిదతో పోల్చుకోవడమే ఈ ట్రోలింగ్‌కు కారణం.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఒక వీడియో క్లిప్‌లో ఇమ్రాన్ ఖాన్.... ''గాడిదకు చారలు గీస్తే అది కంచరగాడిద (జీబ్రా) కాలేదు. గాడిద ఎప్పుడూ గాడిదగానే ఉంటుంది'' అని అన్నారు.

నిజానికి ఆ వీడియోలో ఇమ్రాన్ ఖాన్, తాను బ్రిటన్‌లో గడిపిన రోజుల గురించి మాట్లాడుతున్నారు. బ్రిటన్‌లో నివసించినప్పటికీ, ఆ సమాజంలో కలవలేకపోయానని చెబుతున్నారు.

ఇటీవల ఒక పాకిస్తానీ పాడ్‌కాస్ట్ కార్యక్రమానికి ఇమ్రాన్ ఖాన్ అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన క్లిప్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

''నేను కూడా ఆ సమాజంలో భాగమయ్యా. నాకు చాలా మంచి స్వాగతం లభించింది. బ్రిటిష్ సొసైటీలో చాలా కొంతమందికి మాత్రమే ఇలాంటి అవకాశం లభిస్తుంది. కానీ. నేను దాన్ని ఎప్పుడూ నా ఇళ్లులా భావించలేదు. ఎందుకంటే నేను పాకిస్తానీయుడిని. నేను ఏం చేసినా బ్రిటిష్ వ్యక్తిని కాలేను. మీరు గాడిదకు చారలు గీస్తే, అది కంచరగాడిద కాలేదు. గాడిద ఎప్పుడూ గాడిదలాగే ఉంటుంది'' అని ఆ వీడియోలో ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

ఇంటర్నెట్‌లో ట్రోలింగ్

ఇమ్రాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యను పాకిస్తానీలు ఇంటర్నెట్‌లో విపరీతంగా పంచుకుంటున్నారు. భారత్‌లో కూడా ఈ వీడియో ఎక్కువగా షేర్ అవుతోంది.

పాకిస్తానీ జర్నలిస్టు హసన్ జైదీ ఈ వీడియోను షేర్ చేస్తూ '' వితౌట్ కామెంట్'' అనే వ్యాఖ్యను జోడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

జియో న్యూస్ జర్నలిస్టు మర్తజా అలీ షా కూడా ఈ వీడియోను ట్వీట్ చేస్తూ... ''జీబ్రాల్లాగా నటిస్తోన్న గాడిదలు ఎప్పటికీ జీబ్రాలు కాలేవు: ఇమ్రాన్ ఖాన్'' అని రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

జియో న్యూస్ ఉర్దూ జర్నలిస్టు అబ్దుల్ ఖయ్యుమ్ సిద్ధిఖీ ఈ వీడియోకు...''చారలు గీయడం వల్ల గాడిద, జీబ్రా కాదు. అదెప్పుడూ గాడిదగానే మిగిలిపోతుంది: మాజీ ప్రధాని'' అని వ్యాఖ్యాను జోడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పాకిస్తానీ జర్నలిస్టు నలియా ఇనాయత్ కూడా ''గాడిద, గాడిదగానే ఉంటుంది'' అని మాటల్ని ఉటంకించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారు?

ఈ పాడ్‌కాస్ట్ షో అంతా చూసిన తర్వాత... ఇమ్రాన్ ఖాన్, వాస్తవానికి విదేశాల్లో స్థిరపడిన పాకిస్తానీల గురించి, పాకిస్తాన్ టాలెంట్ ఎలా విదేశాలకు వెళ్లిపోయిందో అనే అంశం గురించి మాట్లాడినట్లు అర్థం అవుతుంది.

షో సందర్భంగా వ్యాఖ్యాత జునైద్ అక్రమ్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడుతూ... ''మీ వీడియోలు చూసి ప్రభావితమైన క్వెట్టాలోని ఒక పిల్లాడు ఈరోజు రోజర్ ఫెడరర్ ఫిజీషియన్‌గా మారాడు. పాకిస్తాన్‌లో తనకంటూ ఏమీ లేదని అతను చెబుతున్నాడు. ఆయన తిరిగి వెనక్కి (పాకిస్తాన్) రావాలి అనుకుంటున్నాడు. దేశానికి ఏదైనా చేయాలి అనుకుంటున్నాడు. కానీ, ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్లగలరు? బహుశా పాకిస్తాన్, ఎక్కువ మందిని విదేశాలకు పంపించే పాలసీని తీసుకొచ్చినట్లుంది. దీనిద్వారా విదేశాల నుంచి వారు పాకిస్తాన్‌కు డబ్బులు పంపిస్తారు. ఆ డబ్బుతో దేశాన్ని నడుపొచ్చు అని భావిస్తున్నట్లుంది'' అని విదేశాలకు వెళ్తోన్న పాకిస్తానీల సంఖ్య పెరుగుతుండటంతో జునైద్ ఈ విధంగా అసంతృప్తి వెళ్లగక్కారు.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, ANI

జునైద్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ''విదేశాలకు వెళ్లే పాకిస్తానీలతో పాటే మన అత్యుత్తమ టాలెంట్ కూడా తరలిపోయింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడి వ్యవస్థ వారిని ఆపుతుంది, అందుకే వారు బయటకు వెళ్లిపోతారు. కానీ, ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. విదేశాల్లో పాకిస్తానీలు ఎంత విజయవంతం అయినప్పటికీ, స్వదేశంలో లభించినట్లుగా అక్కడ వారికి ఆ స్థాయి గౌరవం, స్థానం లభించకపోవచ్చు.

నేను బయట క్రికెట్ ఆడుతుండేవాడిని. విదేశాలకు వెళ్తుండేవాడిని. ఆ సొసైటీలో నేను కూడా ఒక భాగమయ్యా. బ్రిటిష్ సొసైటీలో బయటి వ్యక్తులను అంత త్వరగా స్వీకరించరు. కానీ, నాకు ఘన స్వాగతం లభించింది. కానీ, నేనెప్పుడు దాన్ని నా ఇళ్లుగా భావించలేదు, ఎందుకంటే నేను పాకిస్తానీయుడిని. నేనెంత కృషి చేసినా కూడా ఆంగ్లేయుడిని కాలేను. మీరు గాడిదకు చారలు గీస్తే అది జీబ్రా కాలేదు. అది గాడిద, గాడిదలాగే ఉంటుంది'' అని వివరణ ఇచ్చారు.

గంటా 35 నిమిషాల పాటు జరిగిన పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో తమ ప్రభుత్వాన్ని అమెరికా పడగొట్టిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.

పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో ఏప్రిల్10న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోయింది. దీని తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా షాబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు.

అమెరికా కుట్ర కారణంగానే తమ ప్రభుత్వం పడిపోయిందని ర్యాలీలు, ప్రసంగాల సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తూనే ఉన్నారు. కానీ, దీన్ని ధ్రువీకరించే ఆధారాలను ఆయన సమర్పించలేకపోయారు.

వీడియో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్: మేటి క్రికెటర్ నుంచి పదవీచ్యుత ప్రధాని వరకు.. పదవీచ్యుత నేత ప్రస్థానం ఇది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)