పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి

ఫొటో సోర్స్, @PTIofficial/Twitter
బుష్రా మానికాతో తమ నేత ఇమ్రాన్ ఖాన్ వివాహం జరిగిందని పాకిస్తాన్ తహ్రీక్-ఏ-పాకిస్తాన్ పార్టీ (పీటీఐ) ప్రకటించింది. ఇది ఆయనకు మూడో పెళ్లి.
ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ పీటీఐ ఆయనకు అభినందనలు తెలిపింది.
"ఆదివారం, ఫిబ్రవరి 18న రాత్రి 9 గంటలకు కుటుంబ సభ్యులూ, సన్నిహిత మిత్రుల సమక్షంలో నికాహ్ జరిగింది" అని పీటీఐ తన ట్వీట్‌లో తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇమ్రాన్ ఖాన్ పెళ్లి జరుగబోతున్నట్టు గత నెలలోనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే బుష్రా మానికా అనే మహిళను ఇమ్రాన్ ఖాన్‌కు ప్రపోజ్ చేశారనీ, ఆమె నుంచి జవాబు కోసం ఎదురుచూస్తున్నారని అప్పట్లో తహ్రీక్-ఏ-ఇన్సాఫ్ నేత ఒకరు ఓ ప్రకటనలో తెలిపారు.
పాకిస్తాన్ తహ్రీక్-ఏ-ఇన్సాఫ్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ బుష్రా మానికా, "అల్లాహ్ కృపతో మేం ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. మీ ఆశీర్వాదాలు కావాలి" అని రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇమ్రాన్ ఖాన్, బుష్రా మానికాల నికాహ్ ముఫ్తీ సయీద్ ఆధ్వర్యంలో జరిగినట్టు పీటీఐ విడుదల చేసిన ఫొటో ద్వారా తెలుస్తోంది.
గతంలో రేహమ్ ఖాన్‌తో ఇమ్రాన్ ఖాన్ నికాహ్ కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది.
ఇమ్రాన్ ఖాన్, బుష్రా మానికాల పెళ్లి వార్త వెలువడగానే సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది. 'ముబారక్ ఇమ్రాన్ ఖాన్' ప్రస్తుతం పాకిస్తాన్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.

ఫొటో సోర్స్, @PTIofficial/Twitter
దాదాపు పీటీఐ నేతలందరూ ట్విటర్‌లో అభినందన సందేశాలు పోస్ట్ చేశారు.
ఇమ్రాన్ ఖాన్ 2015లో టీవీ యాంకర్ రేహమ్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహ జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. అప్పటి పెళ్లి వార్తలు కూడా కన్‌ఫర్మ్ కావడానికి చాలానే సమయం పట్టింది.

ఫొటో సోర్స్, IMRAN KHAN OFFICIAL
పెషావర్ పబ్లిక్ స్కూలులో జరిగిన తీవ్రవాద దాడి నేపథ్యంలో దేశమంతా సంతాపం పాటిస్తున్న సమయంలో ఆయన రెండో పెళ్లి వార్త బయటకు వచ్చింది.
ఇవి కూడా చూడండి:
- #గమ్యం: విదేశాల్లో మెడిసిన్ చదవాలన్నా నీట్ తప్పనిసరి
- కూలిన విమానం: 66మంది మృతి
- ఎన్కౌంటర్లలో ముస్లింలూ, దళితులే ఎందుకు హతులవుతారు?
- త్రిపురలో మాణిక్ సర్కార్ వర్సెస్ మోదీ ‘సర్కార్’
- జైనబ్ హంతకుడికి నాలుగు మరణశిక్షలు
- గాజా సరిహద్దులో పేలుడు - ఇజ్రాయెలీ సైనికులకు గాయాలు
- ఆయనో బాక్సర్, నైట్‌క్లబ్ డ్యాన్సర్.. ఒక దేశ ప్రధాని కూడా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








