ఆస్ట్రేలియా: షేన్‌ వార్న్ మృతి

షేన్‌ వార్న్

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మృతి చెందారు.

52 ఏళ్ల షేన్‌ వార్న్ గుండెపోటుతో కన్నుమూసినట్లు ఆయన మేనేజ్‌మెంట్ కంపెనీ వెల్లడించింది.

క్రికెట్ దిగ్గజాల్లో ఆయన కూడా ఒకరు.

థాయ్‌లాండ్‌లోని కో సమౌ దీవిలో ఉన్న తన విల్లాలో షేన్ వార్న్ శుక్రవారం అపస్మారక స్థితిలో కనిపించారని ఆయన మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రకటించింది.

‘‘అనుమానాస్పద గుండెపోటుతో షేన్ కీత్ వార్న్ కన్నుమూశారని చెప్పడానికి చింతిస్తున్నాం’’ అని కంపెనీ వెల్లడించింది.

ఆయనకు వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఆయన్ను బతికించుకోలేకపోయామని పేర్కొంది.

‘‘ఇప్పుడు ఏకాంతం కావాలని ఆయన కుటుంబం కోరుకుంటోంది. మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తాం’’ అని తెలిపింది.

15 ఏళ్లపాటు టెస్ట్ క్రికెట్ ఆడిన షేన్ వార్న్ 145 మ్యాచ్‌ల్లో 708 వికెట్లు తీశారు.

1993 నుంచి 2005 వరకూ 194 వన్ డే ఇంటర్నేషనల్స్ (ఓడీఐ)ల్లో 293 వికెట్లు తీశారు.

1999లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో వార్న్ సభ్యుడు.

2007లో ఆటగాడిగా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్న్ 2013 వరకూ ట్వంటీ20 క్రికెట్ ఆడాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా కొంతకాలం పాటు ఆడిన వార్న్ 2020లో ఆ జట్టు మెంటార్‌గా నియమితులయ్యారు.

అప్పట్నుంచి ఇప్పటి వరకూ క్రికెట్ కామెంటేటర్‌గా, విశ్లేషకుడిగా ఆయన తన అభిమానులను అలరిస్తున్నారు.

షేన్‌ వార్న్ మృతి చెందాడన్న వార్తను నమ్మలేకపోతున్నామంటూ పలువురు క్రికెట్ సెలబ్రిటీలు ట్వీట్ చేసి, తమ సంతాపం ప్రకటిస్తున్నారు.

షేన్ వార్న్ విసిరిన బాల్ ఆఫ్ ది సెంచరీ ఊహాచిత్రం
ఫొటో క్యాప్షన్, షేన్ వార్న్ విసిరిన బాల్ ఆఫ్ ది సెంచరీ

నమ్మలేకపోతున్నా - వీరేంద్ర సెహ్వాగ్

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మాటల్లో చెప్పలేనంత షాక్ - షోయబ్ అఖ్తర్

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇది నిజం కాదని చెప్పండి ప్లీజ్ - దినేశ్ కార్తీక్

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

లెజెండరీ, ఫ్రెండ్ - కుమార సంగక్కర

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)