అమెరికాలో హత్యకు గురైన తెలుగు యువకుడు సత్యకృష్ణ చిత్తూరి

సత్యకృష్ణ చిత్తూరి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సత్యకృష్ణ చిత్తూరి

తెలుగు యువకుడు సత్యకృష్ణ చిత్తూరి అమెరికాలో హత్యకు గురయ్యారు. ఓల్డ్ బర్మింగ్‌హామ్ హైవే మీద ఉన్న క్రౌన్ సర్వీస్ స్టేషన్‌లో ఫిబ్రవరి 10 ఉదయం 9.45 గంటల ప్రాంతంలో ఆయన హత్యకు గురయ్యారని తల్లాడేగా కౌంటీ షరీఫ్ ఆఫీస్ ధ్రువీకరించింది.

పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేప్పటికే 27 ఏళ్ల సత్యకృష్ణ చనిపోయారని, పోస్ట్ మార్టమ్ కోసం మృత దేహాన్ని అలబామా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్‌కు తరలించామని పోలీసులు ఆ ప్రకటనలో తెలిపారు.

దాడికి పాల్పడిన వ్యక్తి సర్వీస్ స్టేషన్ నుంచి అమెరికన్ కరెన్సీని తీసుకుపోయినట్లు తెలుస్తోంది. అనుమానితుడు 6 నుంచి 6.2 అడగుల ఎత్తున్న నల్లజాతి వ్యక్తి అని ప్రాథమిక సమాచారం లభించింది.

ఎయిర్ జోర్డాన్ బ్యాక్‌ప్యాక్, తెల్ల నైక్ షూస్ ధరించిన ఆ వ్యక్తికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం పరిశోధిస్తున్నామని పోలీసులు వివరించారు.

తల్లాడేగా కౌంటీ
ఫొటో క్యాప్షన్, తల్లాడేగా కౌంటీ పోలీసు కార్యాలయం ఫేస్‌బుక్‌లో విడుదల చేసిన ప్రకటన

దోపిడీ కోసం వచ్చి సత్యకృష్ణను హతమార్చిన సాయుధ దుండగుడిని నిఘా కెమేరాల ద్వారా గుర్తించినట్లు పోలీసులు తెలిపారని అలబామా న్యూస్ వెబ్‌సైట్ ఎఎల్.కామ్ తెలిపింది. పోలీసులు అతడి చిత్రాలను కూడా త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని ఆ వార్తలో తెలిపారు.

అలబామాలో ఓల్డ్ బర్మింగ్‌హామ్ హైవే మీదున్న క్రౌన్ సర్వీస్ స్టేషన్లో పార్ట్ టైమ్ క్లర్క్‌గా పని చేస్తున్న సత్యకృష్ణ ఇటీవలే విశాఖపట్నం నుంచి ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చారని, ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి అని అమెరికాలోని తెలుగువారు సోషల్ మీడియాలో చెబుతున్నారు.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)