టీ20 ప్రపంచకప్: వరుసగా మూడు విజయాలతో సెమీ ఫైనల్స్‌కు చేరువైన పాకిస్తాన్

ఆసిఫ్ అలీ, షాదాబ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్ గెలుపు సంబరం

దుబాయ్: టీ20 ప్రపంచకప్ గ్రూప్-2లో భాగంగా శుక్రవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

ఒక దశలో అఫ్గానిస్తాన్ విజయం సాధిస్తుందేమో అన్న స్థితిలో ఉన్న మ్యాచ్‌ను... ఆసిఫ్ అలీ (7 బంతుల్లో 25 నాటౌట్; 4 సిక్సర్లు) తన మెరుపు ఇన్నింగ్స్‌తో పాక్ వశం చేశాడు.

చివరి 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండగా ఆసిఫ్ అలీ ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు.

అంతకుముందు కెప్టెన్ బాబర్ ఆజమ్ (47 బంతుల్లో 51; 4 ఫోర్లు) అర్ధసెంచరీ చేయడంతో పాకిస్తాన్ నిర్ణీత 19 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

148 పరుగుల లక్ష్య ఛేదనతో పాక్ బరిలో దిగింది. ఆరంభంలోనే ముజీబుర్ రహహాన్ బౌలింగ్‌లో ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ (8) అవుటయ్యాడు. తర్వాత వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఫఖార్ జమాన్ (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇన్నింగ్స్ నడిపించాడు.

వీరిద్దరూ సాధికారికంగా ఆడుతూ జట్టు స్కోరును 10 ఓవర్లకు 72/1కు చేర్చారు. రెండో వికెట్‌కు 52 బంతుల్లో 63 పరుగుల్ని జోడించాక నబీ బౌలింగ్‌లో ఫఖార్ జమాన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ అవుట్ విషయమై పాక్ రివ్యూ కోరినప్పటికీ ఫలితం అఫ్గాన్‌కు అనుకూలంగానే వచ్చింది.

బాబర్ అజమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాబర్ అజమ్

ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన బాబర్... టి20ల్లో 1000 పరుగులు చేసిన తొమ్మిదో కెప్టెన్‌గా ఘనతకెక్కాడు. బాబర్ 26 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించగా, కోహ్లి 30 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.

హాఫీజ్ (10) అవుటయ్యాక వచ్చిన సీనియర్ ప్లేయర్ షోయబ్ మలిక్ కూడా ఒక ఫోర్, సిక్సర్‌తో అలరించాడు.

స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ రెండో బంతిని మలిక్ సిక్సర్‌గా మలిచాడు. ఇదే ఓవర్ నాలుగో బంతికి కష్టసాధ్యమైన క్యాచ్‌ను నవీన్ ఉల్ హఖ్ వదిలివేయడంతో బతికిపోయిన బాబర్ ఆజమ్, చివరి బంతికి మళ్లీ రషీద్‌కే దొరికిపోయాడు.

18వ ఓవర్లో కేవలం రెండే పరుగులిచ్చిన నవీన్ ఉల్ హఖ్ షోయబ్ మలిక్ వికెట్ తీయడంతో అఫ్గాన్‌ మ్యాచ్‌పై పట్టు సాధించినట్లుగా కనిపించింది. పాక్ విజయ సమీకరణం 12 బంతుల్లో 24పరుగులుగా మారింది.

కానీ ఒక్క ఓవర్‌లోనే అఫ్గాన్ ఆశలు ఆవిరయ్యాయి. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఆసిఫ్ అలీ నాలుగు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో మరో 6 బంతులు మిగిలి ఉండగానే పాక్ విజయం సాధించింది.

అఫ్గానిస్తాన్ బ్యాటింగ్

అంతకుముందు బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ తొలుత తడబడినా చివరకు పుంజుకుంది.

అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో తొలి 16 ఓవర్ల వరకు పాకిస్తాన్ ఆధిపత్యం కొనసాగింది. కానీ చివరి దశలో వారి బౌలింగ్‌కు ఎదురునిలిచి అఫ్గానిస్తాన్ కాపాడుకునే లక్ష్యాన్ని విధించింది.

కెప్టెన్ మొహమ్మద్ నబీ (32 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు), గుల్బదిన్ నయీబ్ (25 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకోవడంతో అప్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది.

పాక్ బౌలర్లలో ఇమాద్ వసీమ్ 2 వికెట్లు పడగొట్టాడు. షహీన్ షా ఆఫ్రిది, హారిస్ రవూఫ్, హసన్ అలీ, షాదాబ్ ఖాన్ తలా ఓ వికెట్ తీశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్‌ను మ్యాచ్ ఆరంభం నుంచే పాక్ కట్టడి చేసింది.

రెండో ఓవర్‌లోనే ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ (0) డకౌట్ కాగా, మరుసటి ఓవర్‌లో మొహమ్మద్ షహజాద్ (8) మిడాన్‌లో బాబర్ ఆజమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

మొహమ్మద్ నబీ

ఫొటో సోర్స్, Getty Images

క్రీజులోకి వచ్చిన అస్గర్ అఫ్గాన్ బ్యాట్ ఝళిపించాడు. ఇమాద్ వసీమ్ వేసిన నాలుగో ఓవర్‌లో ఒక సిక్స్, ఫోర్‌తో అలరించాడు. ఇదే ఓవర్‌లో రహమానుల్లా సిక్సర్ బాదడంతో 17 పరుగులు లభించాయి.

కానీ 6 పరుగుల వ్యవధిలోనే వీరిద్దరూ అవుట్ కావడంతో అఫ్గాన్ పవర్‌ప్లేలోనే 4 వికెట్లను కోల్పోయింది.

ఆ తర్వాత కరీమ్ జానత్ (17 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్), నజీబుల్లా జద్రాన్ (21 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు నిలకడ ప్రదర్శించారు. కానీ ధాటిగా ఆడలేకపోయారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

నిలబెట్టిన భాగస్వామ్యం

76/6తో కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ మొహమ్మద్ నబీ, గుల్బదిన్ నయీబ్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు అజేయంగా 45 బంతుల్లో 71 పరుగులు జోడించారు.

నబీ అదును చూసి బౌండరీలు బాదగా... హసన్ అలీ బౌలింగ్‌లో గుల్బదిన్ చెలరేగాడు. అలీ వేసిన 18వ ఓవర్‌లో సిక్సర్ సహా రెండు ఫోర్లతో 21 పరుగులు రాబట్టాడు.

రవూఫ్ వేసిన 19వ ఓవర్‌లో వీరద్దరూ కలిసి 3 ఫోర్ల సహాయంతో 15 పరుగులు పిండుకున్నారు. కానీ చివరి ఓవర్‌లో షహీన్ షా ఆఫ్రిది అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఒక్క బౌండరీ కూడా రాలేదు. సింగిల్స్ సహాయంతో 7 పరుగులు చేశారు.

టీ20 ప్రపంచకప్: ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ గెలుపు

నికోలస్ పూరన్

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/gettyimages

ఫొటో క్యాప్షన్, నికోలస్ పూరన్

ఐసీసీ పురుషుల టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు తొలి విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో గెలుపొందింది.

విజయంపై ఆశలు రేకెత్తించిన మహ్ముదుల్లా చివరి బంతికి విఫలం కావడంతో బంగ్లాదేశ్‌కు ఓటమి తప్పలేదు. విజయానికి ఆఖరు బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా రసెల్ వేసిన బంతిని మహ్ముదుల్లా ఆడలేకపోయాడు. దీంతో గెలుపు వెస్టిండీస్ ఖాతాలో చేరింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. వికెట్ కీపర్, నికోలస్ పూరన్ (22 బంతుల్లో 40; 1 ఫోర్, 4 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు పోరాడే స్కోరును అందించాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

రోస్టన్ చేజ్ (46 బంతుల్లో 39; 2 ఫోర్లు) రాణించగా, జేసన్ హోల్డర్ (5 బంతుల్లో 15 నాటౌట్; 2 సిక్సర్లు) మెరిపించాడు. ప్రత్యర్థి బౌలర్లలో మెహదీహసన్, ముస్తఫిజుర్ రహమాన్, షోరిఫుల్ ఇస్లామ్ తలా 2 వికెట్లు తీశారు.

అనంతరం బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులే చేయగలిగింది. లిటన్ దాస్ (43 బంతుల్లో 44; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. మహ్ముదుల్లా (24 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు.

విండీస్ బౌలర్లలో రవి రాంపాల్, జేసన్ హోల్డర్, ఆండ్రీ రసెల్, అకీల్ హొస్సేన్, డ్వేన్ బ్రావో తలా ఓ వికెట్ తీశారు. నికోలస్ పూరన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' పురస్కారం లభించింది.

143 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ ఓపెనర్లు తడబడ్డారు. టి20ల్లో తొలిసారిగా ఓపెనర్‌గా వచ్చిన షకీబుల్ హసన్ (9) విఫలయం కాగా, మరో ఓపెనర్ మొహమ్మద్ నయీమ్ (17; 2 ఫోర్లు) త్వరగానే అవుటయ్యాడు. దీంతో పవర్‌ప్లేలో బంగ్లాదేశ్ కూడా వెస్టిండీస్ తరహాలో 2 వికెట్లకు 29 పరుగులే చేసింది.

హొస్సేన్ బౌలింగ్‌లో సౌమ్య సర్కార్‌ (17; 2 ఫోర్లు)ను అద్భుతమైన క్యాచ్‌తో గేల్ పెవిలియన్ పంపాడు. షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా వచ్చిన బంతిని డైవ్ చేస్తూ గేల్ క్యాచ్ పట్టాడు.

ఆ తర్వాత ముష్ఫికర్ రహీమ్ (8) బౌల్డయ్యాడు. ఓ ఎండ్‌లో లిటన్ దాస్ పోరాడటంతో బంగ్లాదేశ్ 15 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

విజయానికి చివరి 30 బంతుల్లో 44 పరుగులు చేయాల్సి ఉండగా విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో విజయ సమీకరణం చివరి 2 ఓవర్లకు 22 పరుగులుగా మారింది. 19 ఓవర్‌లో బ్రేవో బౌలింగ్‌లో సిక్సర్ బాదిన మహ్ముదుల్లా విజయంపై ఆశలు రేపాడు.

కానీ అదే ఓవర్ చివరి బంతికి లాంగాన్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి లిటన్ దాస్ అవుటయ్యాడు. చివరి ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సి ఉండగా 9 పరుగులే చేసిన వెస్టిండీస్‌కు ఓటమి తప్పలేదు.

నికోలస్ పూరన్

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/gettyimages

ఫొటో క్యాప్షన్, నికోలస్ పూరన్

ఆరంభంలోనే తడబాటు

టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్‌ను ఎంచుకోగా, వెస్టిండీస్ బ్యాటింగ్‌కు దిగింది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైన డిఫెండింగ్ చాంపియన్ విండీస్ జట్టుకు ఈ మ్యాచ్ ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 12 పరుగుల వద్ద ఎవిన్ లూయిస్ (6) అవుటయ్యాడు.

అంతకుముందు, ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతికే రనౌట్ అయ్యే ప్రమాదాన్నితప్పించుకున్న గేల్ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు.

ముస్తఫిజుర్ వేసిన బంతిని పాయింట్ దిశగా ఆడిన గేల్ పరుగు కోసం ప్రయత్నించాడు. అక్కడే ఉన్న షకీబ్ వెంటనే బంతిని వికెట్ల వైపు విసిరినప్పటికీ గురి తప్పడంతో గేల్ బతికిపోయాడు. షకీబ్ విసిరిన బంతి వికెట్లను సమీపించిన సమయంలో గేల్ క్రీజుకు చాలా దూరంలో ఉన్నాడు.

అయితే కాసేపటికే మెహదీహసన్ బౌలింగ్‌లో గేల్ ఇన్నింగ్స్ ముగిసింది. 10 బంతులాడిన గేల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

దీంతో పవర్ ప్లేలో వెస్టిండీస్ 2 వికెట్లకు 29 పరుగులు చేసింది. షిమ్రోన్ హెట్‌మైర్ (9) కూడా విఫలమయ్యాడు. అరంగేట్ర ఆటగాడు రోస్టన్ చేజ్‌ అడపాదడపా పరుగులు సాధిస్తూ స్ట్రయిక్ రొటేట్ చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

వ్యూహంలో భాగంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో పూరన్ స్థానంలో వచ్చిన కెప్టెన్ పోలార్డ్ మాత్రం పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో మిడిల్ ఓవర్లలో రన్‌రేట్ మందగించింది. చివరకు 13వ ఓవర్లో పోలార్డ్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు.

ఒక్క బంతీ ఆడకుండానే రసెల్ అవుట్

వెంటనే క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రసెల్ (0) కనీసం ఒక్క బంతి కూడా ఎదుర్కోకుకుండానే రనౌటయ్యాడు. టస్కీన్ అహ్మద్ వేసిన బంతిని రోస్టన్ చేజ్ బౌలర్ వైపుకి ఆడాడు. దాన్ని ఆపేందుకు టస్కీన్ కాలుతో బంతిని తాకాడు. అది నేరుగా వెళ్లి నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న ఆండ్రీ రసెల్ వికెట్లను గిరాటేసింది. అప్పటికే పరుగు కోసం రసెల్ క్రీజును వదిలి ముందుకు రావడంతో అతను అవుట్ కాక తప్పలేదు. అప్పటికి జట్టు స్కోరు 62/4.

పూరన్ క్రీజులోకి వచ్చాక పరుగుల వేగం పెరిగింది. షకీబ్ బౌలింగ్‌లో పూరన్ వరుసగా రెండు సిక్సర్లతో ధాటిని కనబరిచాడు. తర్వాత మెహదీహసన్ వేసిన 18వ ఓవర్‌లోనూ మరో రెండు సిక్సర్లు బాదాడు. దీంతో ఈ రెండు ఓవర్లలోనూ విండీస్ 16 చొప్పున పరుగులు రాబట్టింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

అయితే వరుస బంతుల్లో పూరన్, రోస్టన్ చేజ్‌లను షోరిఫుల్ ఇస్లామ్ అవుట్ చేశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి పూరన్ డీప్ కవర్‌లో నయీమ్‌కు క్యాచ్ ఇవ్వగా.. చేజ్ స్టంపౌట్ అయ్యాడు.

చివరి ఓవర్‌లో డేన్ బ్రేవో (1) కూడా అవుటయ్యాడు. దీంతో మళ్లీ క్రీజులోకి వచ్చిన పోలార్డ్ ఒక సిక్స్ బాదగా, హోల్డర్ రెండు వరుస సిక్సర్లతో చెలరేగడంతో జట్టు పోరాడే స్కోరును సాధించింది.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 3 క్యాచ్‌లను నేలపాలు చేసింది. ఇందులో రెండు రోస్టన్ చేజ్‌వి కాగా ఒకటి హోల్డర్‌ది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

షకీబుల్ హసన్

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/gettyimages

ఫొటో క్యాప్షన్, షకీబుల్ హసన్