వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు పునరుద్ధరణ

ఫేస్‌బుక్

ఫొటో సోర్స్, Getty Images

దాదాపు 6 గంటల పాటు నిలిచిపోయిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయని ఫేస్‌బుక్ పేర్కొంది.

ఫేస్‌బుక్ యాజమాన్యానికి చెందిన ఈ మూడు సర్వీసులు, ఔటేజ్ సమయంలో పనిచేయలేదు.

భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి గం. 9:30 నుంచి, మంగళవారం ఉదయం 3:30 గంటల వరకు కొందరు వినియోగదారులు ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగించలేకపోయారు.

'ఇది ఇప్పటివరకెప్పుడూ చూడని అతిపెద్ద వైఫల్యమని' ఔటేజ్‌ను ట్రాక్ చేసే డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ పేర్కొంది. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 10.6 మిలియన్ల సమస్యలు నమోదైనట్లు వెల్లడించింది.

2019లో కూడా ఇలాగే ఫేస్‌బుక్ సేవలకు అంతరాయం కలిగింది.

ఔటేజ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు ఫేస్‌బుక్ క్షమాపణలు చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

''నూరు శాతం ఫేస్‌బుక్ సర్వీసుల సేవలు పొందడానికి కాస్త సమయం పట్టొచ్చు'' అని ఆ సంస్థ చీఫ్ టెక్నాలజీ అధికారి మైక్ ష్రోఫెర్ అన్నారు.

తమ సర్వీసులు మళ్లీ పనిచేయడం ప్రారంభించాయని ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ సంస్థలు ట్విటర్ ద్వారా ప్రకటించాయి.

ఫేస్ బుక్

ఫొటో సోర్స్, Facebook

ఫేస్‌బుక్ లాగిన్‌తో సంబంధమున్న కొన్ని యాప్‌లతో పాటు ఎఫ్‌బీకి చెందిన వర్చువల్ హెడ్‌సెట్ ప్లాట్‌ఫామ్ ఓకులస్‌లోనూ సమస్యలు ఎదురైనట్లు కొందరు యూజర్లు వెల్లడించారు. పోకీమాన్ గో వంటి గేమ్‌ యాప్‌లు పనిచేయలేదని చెప్పారు.

2019లో కలిగిన అంతరాయంతో ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, దానితో ముడిపడి ఉన్న ఇతర యాప్‌ల సేవలు 14 గంటలకు పైగా నిలిచిపోయాయి. ఇంత సుదీర్ఘ కాలం పాటు, ఈ స్థాయిలో అంతరాయం కలగడం చాలా అరుదు.

అంతరాయానికి కారణం ఏమిటి?

అయితే, ఈ సమస్య తలెత్తడానికి కారణమేంటో అధికారికంగా ఎవరూ చెప్పలేదు. ఫేస్‌బుక్ సైట్లకు సంబంధించి డీఎన్‌ఎస్‌లో లేదా డోమైన్ నేమ్ సిస్టమ్‌లలో లోపం కారణంగానే ఈ సమస్య వచ్చి ఉండొచ్చని ఆన్‌లైన్ నెట్‌వర్క్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో కూడా డీఎన్‌ఎస్‌లో సమస్యల కారణంగా అనేక ప్రముఖ వెబ్‌సైట్ల సేవలు నిలిచిపోయాయి. ఇలా అనేకసార్లు జరిగింది. గతంలో ఒక యూజర్ కారణంగా ఇలాంటి సమస్యే ఉత్పన్నమైంది. ఆయన సెట్టింగ్స్ మార్చడంతో ఏర్పడిన సాఫ్ట్‌వేర్ బగ్... పెద్ద సంఖ్యలో వెబ్‌సైట్లను ప్రభావితం చేసింది.

తాజా అంతరాయంతో రెడిట్, ట్విటర్ మాధ్యమాల్లో ఫేస్‌బుక్ సర్వీసులపై జోకులు పేలాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఫేస్‌బుక్ కంపెనీకి సంబంధించిన పత్రాలను లీక్ చేసిన మాజీ ఉద్యోగి ఇంటర్వ్యూ వచ్చిన మరుసటి రోజే ఈ అంతరాయం ఏర్పడింది.

''భద్రత కంటే వృద్ధికే ఫేస్‌బుక్ అధిక ప్రాధాన్యతనిచ్చిందని'' సీబీఎస్ న్యూస్‌తో ఆదివారం ఫ్రాన్సెస్ హ్యూజెన్ అన్నారు.

యువ వినియోగదారుల మానసిక ఆరోగ్యంపై ఇన్‌స్టాగ్రామ్ ఎఫెక్ట్ అనే పరిశోధనకు సంబంధించి ఆమె మంగళవారం సెనెట్ సబ్‌కమిటీ ముందు వివరాలు చెప్పనున్నారు. 'ప్రొటెక్టింగ్ కిడ్స్ ఆన్‌లైన్' పేరిట ఈ పరిశోధనలు చేశారు.

ఫేస్‌బుక్

ఫొటో సోర్స్, Reuters

విశ్లేషణ

జేమ్స్ క్లేటన్, ఉత్తర అమెరికా టెక్నాలజీ రిపోర్టర్

ప్రముఖ వెబ్‌సైట్లకు అంతరాయం కలగడం అనేది అసాధారణం కాదు. ఉదాహరణకు గత వారంలో కూడా ఇలాంటిది జరిగింది.

కానీ ఆ అంతరాయం ఎలాంటి సందర్భంలో కలిగింది, దాని తీవ్రత ఎంత, దాని పరిమాణం ఎంత అనే అంశాలను గమనించాలి.

'డొమైన్ నేమ్ సిస్టమ్' వల్ల తలెత్తే అంతరాయాలు చాలా త్వరగా పరిష్కారమవుతాయి. అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుంటాయి. ఇలాంటి అంతరాయాల వల్ల ఒక దేశంలో పనిచేయని వెబ్‌సైట్ మరో దేశంలో పనిచేస్తుంటుంది.

కానీ తాజా ఔటేజ్, ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ సేవలన్నింటినీ ప్రభావితం చేసింది.

6 గంటల పాటు అంతరాయం కలగడం కూడా అసాధారణ అంశం. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి సాంకేతిక నిపుణులు ప్రయత్నిస్తున్న సమయంలో ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయం అల్లకల్లోలంగా మారిందని పలు నివేదికలు తెలుపుతున్నాయి.

ఈ సమస్యకు కారణమేంటో కూడా అస్పష్టంగానే ఉంది. హ్యాక్‌ చేయడం వల్ల సాధారణంగా ఇలాంటి అంతరాయాలు కలగవు. కానీ దాన్ని కూడా తోసిపుచ్చలేం.

ఈ వారం, ఫేస్‌బుక్‌కు ఘోరంగా ప్రారంభమైంది. మాజీ ఉద్యోగి ఒకరు ఆదివారమే ఫేస్‌బుక్ సంస్థకు వ్యతిరేకంగా కొన్ని వివరాలను బయటపెట్టారు.

దాని తర్వాత రోజే ఈ ఔటేజ్ కూడా తలెత్తింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)