టోక్యో పారాలింపిక్స్‌లో సిల్వర్ మెడల్స్ గెలిచిన భవీనా పటేల్‌, నిషద్ కుమార్... వినోద్ కుమార్‌కు కాంస్యం

భావినా పటేల్

ఫొటో సోర్స్, ANI/PIB INDIA

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ బోణీ కొట్టింది. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్ దేశానికి తొలి పతకం అందించారు.

టేబుల్ టెన్నిస్ క్లాస్-4 ఫైనల్లో స్వర్ణ పతకం కోసం చైనా క్రీడాకారిణి యింగ్‌ జావోతో పోరాడిన భవీనా ఓడిపోయారు.

దీంతో ఆమె రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

ఇక, పురుషుల టి-47 హైజంప్‌లో నిషద్ కుమార్ రజత పతకం గెల్చుకున్నారు. వీరితో పాటు పురుషుల ఎఫ్-52 డిస్కస్ త్రో విభాగంలో వినోద్ కుమార్ కాంస్య పతకం సాధించారు. ఈ విజయంతో టోక్యో పారాలింపిక్స్‌లో ఆదివారం నాడు భారత్‌కు మూడో మెడల్ లభించింది.

అంతకు ముందు శనివారం జరిగిన సెమీ ఫైనల్లో భవీనా పటేల్ చైనా ప్లేయర్ చాంగ్ మియావోను 7-11, 11-7, 11-4, 9-11, 11-8తో ఓడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

భవీనా పటేల్‌ రజతం గెలవడంతో గుజరాత్‌లోని ఆమె స్వగ్రామంలో సంబరాలు చేసుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

భవీనా పటేల్ ఆడిన మొదటి పారాలింపిక్స్‌లోనే పతకం తీసుకొస్తుండడంతో మెహసాణాలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు సంతోషంతో గర్బా ఆడారు.

"భవీనా మేం గర్వపడేలా చేసింది. ఆమెకు ఘనంగా స్వాగతం పలుకుతాం" అని తండ్రి హస్ముఖ్ భాయ్ పటేల్ ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ప్రధాని నరేంద్ర మోదీ భవీనా పటేల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

"భవీనా పటేల్ చరిత్ర సృష్టించారు. ఆమె జీవిత ప్రయాణం స్ఫూర్తి నింపుతుంది. మరింత మంది యువత క్రీడలవైపు వచ్చేలా ఆకర్షిస్తుంది" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

"దేశం గర్వపడేలా చేశావు" అని రాహుల్ గాంధీ కూడా ట్విటర్‌లో భవీనా పటేల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

పారాలింపిక్స్‌లో క్రీడలకు ముందు బీబీసీతో మాట్లాడిన భవీనా తనకు ఏడాది వయసులోనే పోలియో వచ్చినట్లు చెప్పారు.

"నేను ఐటీఐ చేయడానికి వెళ్లినప్పుడు, అక్కడ నాలాంటి వాళ్లు టేబుల్ టెన్నిస్ ఆడడం మొదటిసారి చూశాను" అన్నారు.

అలా టేబుల్ టెన్నిస్ ఆడడం ప్రారంభించిన భవీనా పటేల్ దాదాపు 26 దేశాల్లో జరిగిన పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

కెరీర్‌లో భవీనా పటేల్ 22 అంతర్జాతీయ పతకాలు సాధించారు. వీటిలో స్వర్ణ, రజత పతకాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా టోక్యో పారాలింపిక్స్‌లో రజతం గెలిచారు.

వీడియో క్యాప్షన్, టోక్యో పారాలింపిక్స్‌‌లో చరిత్ర సృష్టించిన భవీనా పటేల్‌

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)