టోక్యో ఒలింపిక్స్: రవి కుమార్ దహియాకు కుస్తీలో సిల్వర్ మెడల్

ఫొటో సోర్స్, Getty Images
రవి కుమార్ దహియా పురుషుల 57 కిలోల ఫ్రీస్టయిల్ పోటీలో రజత పతకం గెల్చుకున్నారు. రష్యాకు చెందిన జవూర్ ఉగుయెవ్‌తో స్వర్ణం కోసం జరిగిన కుస్తీ పోరులో రవి కుమార్ 4-7 తేడాతో ఓడిపోయారు. దాంతో, ఆయనకు సిల్వర్ మెడల్ లభించింది.
ఒలింపిక్ గేమ్స్‌లో సుశీల్ కుమార్ తరువాత రజతం గెల్చుకున్న రెండవ కుస్తీ యోధుడిగా రవి దహియా గుర్తింపు పొందారు. ఈ పతకంతో భారత్‌కు మొత్తం అయిదు ఒలింపిక్ పతకాలు లభించాయి.
ఫైనల్ మొదటి సగంలో రవి రెండు పాయింట్లు కోల్పోయారు. ఆ తరువాత వెంటనే స్కోర్ సమం చేయగలిగారు. కానీ, ఫస్టాఫ్ ముగిసేప్పటికి రష్యన్ రెజ్లర్ 4-2తో ఆధిక్యంలో ఉన్నారు.ద్వితీయార్ధంలో కూడా రవి రెండు పాయింట్లు సాధించాడు. జోర్ మూడు పాయింట్లు సాధించి 7-4తో మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.
రవి కుమార్ దహియా గొప్ప రెజ్లర్, ఆయన పోరాట పటిమ సాటిలేనిదని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రజత పతకం సాధించిన దహియాను చూసి భారతదేశం గర్విస్తోందని ప్రధాని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఒలింపిక్ పతకం సాధించిన రవి దహియాకు క్లాస్-1 ఉద్యోగంతో పాటు హర్యానాలో ఎక్కడ కోరుకుంటే అక్కడ 50 శాతం తగ్గింపుతో ఇంటి స్థలం ఇస్తామని హర్యానా ప్రభుత్వం ప్రకటించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రవి సొంత ఊరైన నాహ్రీలో ఇండోర్ స్డేడియం నిర్మిస్తామని, అలాగే రజత పతకం విజేతలకు ప్రకటించే రూ. 4 కోట్ల బహుమతి కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
కాంస్యంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం భారత్, జర్మనీ పోటాపోటీగా తలపడ్డాయి. చివరకు 5-4 తేడాతో భారత జట్టు విజయం సాధించింది.
మొదటి 15 నిమిషాల్లోనే భారత్‌పై జర్మనీ గోల్ కొట్టి ఆధిక్యంలోకి వెళ్లింది. సెకండ్ క్వార్టర్‌లో భారత్ ఓ గోల్ కొట్టింది. అయితే, కాసేపటికే జర్మనీ మరో రెండు గోల్స్ కొట్టి తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత భారత్ కూడా మరో రెండు గోల్స్ కొట్టింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
రెండో క్వార్టర్ ముగిసేనాటికి భారత్, జర్మనీ.. చెరో 3 గోల్స్ కొట్టాయి. అయితే, మూడో క్వార్టర్‌లో భారత్ మరో రెండు గోల్స్ కొట్టి ఆధిక్యంలోకి వెళ్లింది.
మొత్తంగా జర్మనీపై 5-4 తేడాతో భారత జట్టు విజయం సాధించింది.
ప్రస్తుత మ్యాచ్‌లో గెలవడం ద్వారా, 41ఏళ్లలో ఒలింపిక్ పతకాన్ని తెచ్చిపెట్టిన తొలి భారత జట్టుగా పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది.

ఫొటో సోర్స్, Getty Images
మంగళవారం బెల్జియంపై 5-2 తేడాతో భారత పురుషుల జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
''ఇది చరిత్రాత్మకం. ప్రతి భారతీయుడికీ ఈ రోజు గుర్తుండిపోతుంది. కాంస్య పతకాన్ని గెలిచిన పురుషుల హాకీ జట్టుకు శుభాకాంక్షలు. ఈ విజయంతో యువతతోపాటు భారతీయుల అందరి కలలను వారు సాకారం చేశారు. హాకీ జట్టును చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది''అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
వినేశ్ ఓటమి..
మరోవైపు మహిళల 53 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో స్వీడన్ క్రీడాకారిణి సోఫియా మగ్దలేనాను వినేశ్ ఫోగట్ ఓడించారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, క్వార్టర్ ఫైనల్స్‌లో బెలరూస్‌కు చెందిన వెనీసా కలజిస్కాయా చేతిలో ఆమె ఓడిపోయారు.
Please wait...
ఇవి కూడా చదవండి:
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









