చైనా తన అణ్వాయుధాల నిల్వలను పెంచుకుంటోందని ఆరోపించిన అమెరికా

ఫొటో సోర్స్, Reuters
అణు క్షిపణులను నిల్వలను, ప్రయోగించే సామర్థ్యాలను చైనా విస్తరించుకుంటోందని అమెరికా శాస్త్రవేత్తలు అంటున్నారు.
చైనా, ఓ సరికొత్త అణు క్షిపణి నిల్వ క్షేత్రాన్ని (సైలో ఫీల్డ్) నిర్మిస్తున్నట్లు షిన్‌జియాంగ్ ప్రాంతపు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఏఎస్) నివేదిక వెల్లడించింది.
సైలో ఫీల్డ్ అంటే అణు క్షిపణులను నిల్వ చేసుకుంటూ, అవసరమైనప్పుడు ప్రయోగించడానికి అనువుగా ఉండే గోడౌన్.
ఈ తరహా అణు విస్తరణ పట్ల అమెరికా రక్షణ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు నెలల్లో పశ్చిమ చైనాలో నిర్మిస్తున్న రెండవ అణు క్షిపణి నిల్వ క్షేత్రం ఇది.
క్షిపణులను నిల్వ చేసేందుకు, ప్రయోగించేందుకు వీలుగా అండర్‌గ్రౌండ్ సౌకర్యాలు గల 110 సైలోలను ఆ ప్రాంతంలో నిర్మించవచ్చని అంచనా.
గన్సు ప్రావిన్సులోని యుమెన్‌లో ఉన్న ఒక ఎడారి ప్రాంతంలో 120 అణు నిల్వ క్షేత్రాలు కనిపించాయని అమెరికా వార్తాపత్రిక 'వాషింగ్టన్ పోస్ట్' గత నెలలో ఒక కథనాన్ని ప్రచురించింది.
ప్రస్తుతం, యుమెన్‌కు వాయువ్య దిశలో 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న హమీలో కొత్తగా నిర్మిస్తున్న నిల్వ క్షేత్రాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని ఎఫ్ఏఎస్ తన నివేదికలో తెలిపింది.

'ఆయుధ నిల్వలను రెట్టింపు చేస్తున్న చైనా'.. పెంటగాన్ నివేదిక
చైనా తన అణ్వాయుధాల (వార్‌హెడ్స్) నిల్వలను రెట్టింపు చేసేందుకు ప్రయత్నిస్తోందని 2020లో అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది.
అమెరికా, రష్యా దేశాలు ఆయుధాల నియంత్రణపై చర్చలకు సిద్ధం కాబోతున్న సమయంలో ఈ వార్త వెలుగులోకి వచ్చింది.
అణ్యాయుధాల సంఖ్యను తగ్గించే చర్చలను పునరుద్ధించే దిశలో ఈ రెండు దేశాలు వేస్తున్న తొలి అడుగు ఇది అని నిపుణులు అభిప్రాయపడ్డారు.
కాగా, ఆయుధాల నియంత్రణకు సంబంధించిన ఏ రకమైన చర్చల్లోనూ చైనా ఇప్పటివరకూ పాల్గొనలేదు.
అమెరికా రక్షణ శాఖ విభాగం ‘యూఎస్ స్ట్రేటజిక్ కమాండ్’, ఎఫ్ఏఎస్ నివేదికలోని అంశాల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
"ప్రపంచానికి రహస్య ముప్పు పొంచి ఉందని మేము ఎప్పటి నుంచో చెబుతున్న మాటలకు ఆధారాలు కనిపెట్టడం గత రెండు నెలల్లో ఇది రెండవసారి" అంటూ ట్వీట్ చేసింది.
కమర్షియల్ శాటిలైట్ చిత్రాల ద్వారా షిన్‌జియాంగ్ ప్రాంతంలోని సైలో ఫీల్డ్‌ను మొదట గుర్తించారు.
అనంతరం, ఉపగ్రహ చిత్రాలను సరఫరా చేసే 'ప్లానెట్' సంస్థ ఈ సైలో ఫీల్డ్‌కు సంబంధించిన హై రిజల్యూషన్ చిత్రాలను అందించింది.
2020లో చైనా వద్ద 200 కన్నా ఎక్కువ అణ్వాయుధాల నిల్వలు ఉన్నాయని, ఆ సంఖ్యను రెట్టింపు చేసే దిశగా ఆ దేశం సన్నాహాలు చేస్తోందని అమెరికా రక్షణ శాఖ తెలిపింది.
కాగా, అమెరికా వద్ద సుమారు 3,800 అణ్వాయుధాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ టిబెట్ పర్యటన భారత్‌కు ఇస్తున్న సందేశం ఏంటి?
- కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాకపోవచ్చు, దానితో కలిసి జీవించడం ఎలా?
- ప్రశాంత్ కిశోర్: జనాన్ని మెప్పించి ఎన్నికల్లో గెలవడం ఎలా?
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- చైనా వరద బీభత్సం ఫొటోలు: ఏడాదిలో పడాల్సిన వర్షం మూడు రోజుల్లో కురిసింది
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








