సిల్‌సిలా అలీఖిల్: పాకిస్తాన్‌లో అఫ్గాన్ రాయబారి కుమార్తెపై దాడి, కిడ్నాప్

ఫొటో సోర్స్, NAjibalikhil/twitter
పాకిస్తాన్‌లో అఫ్గానిస్తాన్ రాయబారి నజీబుల్లా అలీఖిల్ కుమార్తెను గుర్తుతెలియని అపహరించారని, ఆమెను గాయపరిచారని అక్కడి అధికారులు వెల్లడించారు.
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం తన ఇంటికి చేరుకుంటున్న సమయంలో సిల్‌సిలా అలీఖిల్‌ను కొందరు అపహరించారు.
కొన్ని గంటల పాటు ఆమెను నిర్బంధించి అనంతరం వదిలిపెట్టారు.

ఫొటో సోర్స్, NAjibullah alikhil/twitter
ఆమెను తీవ్రంగా హింసించారని, దీనిపై తాము ఫిర్యాదు చేస్తున్నామని అఫ్గానిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పింది.
పాక్, అఫ్గాన్ మధ్య సంబంధాలు చాలాకాలంగా దెబ్బతిన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పాకిస్తాన్ ఏమంటోంది?
సిల్‌సిలా తన కారులో ఇంటికి వెళ్తుండగా దారిలో దుండగులు ఆమెను అడ్డగించి కారులో చొరబడి కొట్టారని పాకిస్తాన్ అధికారులు చెప్పారు.
ఆ రాయబారికి మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
సిల్‌సిలాపై దాడికి పాల్పడినవారిని 48 గంటల్లోగా పట్టుకోవాలని, అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని దర్యాప్తు చేయాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలు జారీ చేసినట్లు పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు.
అపహరణ అనంతరం కొన్ని గంటలకు ఆమెను విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆమె పాకిస్తాన్‌లోనే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తన కుమార్తెపై దాడి, అపహరణపై అఫ్గాన్ రాయబారి నజీబ్ అలీఖిల్ స్పందించారు. ''ఇది అమానుష దాడి, ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది'' అని చెప్పారు.
ఈ ఘటనపై అఫ్గాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.
రాయబారులు, వారి కుటుంబాల భద్రతకు హామీ ఇవ్వాలని పాకిస్తాన్‌ను కోరింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇవి కూడా చదవండి:
- విశాఖ ఏజెన్సీలో గిరిజన గ్రామాలకు రోడ్లు, కరెంటు - బీబీసీ కథనాలకు స్పందన
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్: 'ఇంటర్నెట్ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది'
- దక్షిణాఫ్రికా: జాకబ్ జుమాను జైలుకు పంపడంపై అల్లర్లు, 72 మంది మృతి
- కోవిడ్-19: చైనా వ్యాక్సీన్లను ఇస్తున్న దేశాల్లో మళ్లీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
- ‘12 ఏళ్ల వయసులో పొట్ట పెరుగుతుంటే ఎందుకో అనుకున్నా, గర్భవతినని గుర్తించలేకపోయాను’
- 24 ఏళ్ల నిరీక్షణ, 5 లక్షల కి.మీ.ల ప్రయాణం-ఎట్టకేలకు కొడుకును కలుసుకున్న తండ్రి
- ఆంధ్రప్రదేశ్: శ్రీశైలంలో రహస్యంగా డ్రోన్లు ఎందుకు ఎగరేస్తున్నారు ? అనుమతి లేకుండా వీటిని వాడితే ఏం జరుగుతుంది?
- బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్‌లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర విజయవంతం
- పీవీ సింధు ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








