మెక్సికో: కంటైనర్‌లో దాక్కొని రహస్యంగా దేశం దాటాలనుకున్నారు కానీ రెండేళ్ల బాలుడు హైవేపై ఒంటరిగా మిగిలాడు

మెక్సికో సరిహద్దులు దాటి అమెరికాలో ప్రవేశించే ప్రయత్నంలో వైల్డర్ తండ్రి నుంచి విడిపోయాడు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రెండేళ్ల వయసున్న వైల్డర్ అనే మెక్సికన్ బాలుడు రోడ్డు పక్కన ఒంటరిగా కనిపించాడు.
    • రచయిత, డారియో బ్రూక్స్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

ఆగ్నేయ మెక్సికోలో ఒక హైవేపై చనిపోయిన వ్యక్తి పక్కనే సగం చిరిగిన బట్టలతో ఓ పసివాడు నిల్చుని కనిపించాడు. ఆ అబ్బాయి పేరు వైల్డర్ లాడినో గార్సియా.

రెండేళ్ల వైల్డర్ తన తండ్రి ఇసిడ్రో లాడినోతో కలిసి, హోండురస్‌లోని శాంటారీటా అనే చిన్న ఊరి నుంచి అమెరికా పయనమయ్యాడు.

అయితే మార్గమధ్యలో తండ్రి నుంచి వైల్డర్ తప్పిపోయాడు. జూన్ 28న వైల్డర్.. వెరాక్రూజ్ రాష్ట్రంలోని లాస్ చోవాపాస్ నగరానికి సమీపంలో రోడ్డు పక్కన మెక్సికో అధికారులకు కనిపించాడు.

తండ్రీ కొడుకులిద్దరూ మెక్సికో సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించిందుకు బయలుదేరారు. కానీ వాళ్లు అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు.

తండ్రితో కలిసి రహస్యంగా లారీలో అమెరికాకు ప్రయాణిస్తుండగా, ఊపిరాడక అందులోని వారంతా దిగి పరుగులు పెట్టారు. వారిలో ఉన్న వైల్డర్ తండ్రి తర్వాత కనిపించ లేదు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, తండ్రితో కలిసి ఒక కంటైనర్‌లో రహస్యంగా అమెరికాకు వెళ్తుండగా, ఊపిరాడక అందులోని వారంతా దిగి పరుగులు పెట్టారు. అలా పరిగెత్తిన వారిలో ఉన్న వైల్డర్ తండ్రి ఆ తర్వాత కనిపించలేదు.

లారీ వెనక ఎక్కి..

వైల్డర్ లాడినో గార్సియా మరో వందమంది వలసదారులతోపాటు కంటైనర్‌లో కూర్చుని ప్రయాణించాడని అధికారులు తెలిపారు.

ఆ కంటైనర్ మూసి ఉండడంతో సరైన గాలి, వెలుతురు లేక ప్రయాణికులు అల్లాడిపోయారు.

"వాహనం లోపల విపరీతమైన వేడి, సరిగా గాలి ఆడకపోవడంతో వలసదారుల్లో డీహైడ్రేషన్, ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు కనిపించాయి. దురదృష్టవశాత్తు వారిలో ఒక 25 ఏళ్ల యువకుడు చనిపోయాడు" అని నేషనల్ మైగ్రేషన్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎన్ఎం) ఒక రిపోర్టులో తెలిపింది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

వైల్డర్ తప్పిపోయాడన్న వార్త విని ఏడ్చానని ఆ చిన్నారి తల్లి లొరేనా గార్సియా బీబీసీకి చెప్పారు.

అయితే తన బాబు మళ్లీ దొరకడం, భర్త కూడా క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నానని ఆమె అన్నారు.

తండ్రీ కొడుకులిద్దరినీ అమెరికాలోకి అనుమతించమని లొరేనా అభ్యర్థించారు.

"నా భర్తను, బిడ్డను కలిపి అనుమతించండి. నా బిడ్డను ఒక్కడినీ మాత్రం పంపించకండి. అది సాధ్యం కాకపోతే నా బిడ్డను వెనక్కి పంపించేయండి" అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

పేదరికం నుంచి తప్పించుకునే ప్రయత్నాలు

ఇసిడ్రో లాడినో తనతో పాటు తన రెండేళ్ల కొడుకు వైల్డర్‌ను కూడా అమెరికా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

మైనర్లతో పాటు వెళితే, వెంట వచ్చినవాళ్లని కూడా సరిహద్దుల వద్ద అమెరికా లోనికి అనుమతిస్తారని ఇసిడ్రో దంపతులు విన్నారు. అందుకే కొడుకుని తీసుకుని జూన్ 25న బయలుదేరారు.

"పిల్లలున్నవాళ్లను లోపలికి అనుమతించడం మేం గమనించాం" అని లొరేనా చెప్పారు.

వాళ్ల ఊరు శాంటారిటా ప్రాంతం పేదరికంతో అల్లాడుతోంది. 2020లో ఈటా, ఐయోటా తుపానుల తరువాత ఆ ప్రాంత వాసుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

"అక్కడ రోజు గడవడం చాలా కష్టం. పని ఉంటే ఇసిడ్రోకు దాదాపు 100పెసోలు (నాలుగు అమెరికన్ డాలర్లు) వస్తాయి. కానీ రోజూ పని దొరకడం కష్టం" అని లొరేనా చెప్పారు.

తన భర్తకు కొడుకుకు ఏమైందో మొదట తనకు తెలియలేదని వైల్డర్ తల్లి లొరేనా అన్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఓ స్వచ్ఛంద సంస్థ వలంటీర్‌తో వైల్డర్

ఎక్కడ తప్పిపోయారు?

జూన్ 27న తండ్రీకొడుకులిద్దరూ గ్వాటెమాల, మెక్సికో మధ్య ఉన్న సరిహద్దులు దాటారు. ఆ తర్వాత వారి సమాచారం తనకు తెలియలేదని లొరేనా చెప్పారు.

ఆ తరువాత, తన బిడ్డ రోడ్డు మీద ఒంటరిగా కనిపించినట్లు మెక్సికోలోని హోండురస్‌ కాన్సులేట్ నుంచి ఆమెకు సమాచారం అందింది.

వైల్డర్ ఎలా తప్పిపోయాడో ఇప్పటికీ అర్థం కావడం లేదని లొరేనా అన్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 3
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 3

కంటైనర్‌లో ప్రయాణించడం వారి పాలిట పీడకలలా మారిందని మెక్సికో అధికారులు తెలిపారు.

"కంటైనర్‌ లోపల కూర్చున్నవారిలో ఒకరి తరువాత ఒకరు స్పృహ తప్పిపోవడం మొదలుపెట్టారు. దాంతో బండి ఆపమని మిగతావారు గోల చేశారు. కొంతసేపయ్యాక కంటైనర్ ఆపారు. వారికి గైడుగా వ్యవహరిస్తున్న వ్యక్తి వాహనం వెనుక భాగం తలుపులు తెరిచారు. వెంటనే లోపల ఉన్నవారు బయటకు దూకి గాలి కోసం పరుగులు తీశారు. అధికారులు అక్కడకు చేరుకునేసరికి ఎనిమిది మంది ఇంకా అక్కడే ఉన్నారు. కొంతమంది లోపల పడిపోయి ఉన్నారు. వైల్డర్ లాంటి వాళ్లు రోడ్ల మీద దొరికారు. చిరిగి పోయిన దుస్తులతో రోడ్డు పక్కన వైల్డర్ కనిపించాడు. ఆ బాబు ఎవరో తమకు తెలీదని మిగిలిన వారు చెప్పారు" అని ఐఎన్ఎం తెలిపింది.

వైల్డర్ దొరికాడని అతని తల్లికి కబురు అందించారుగానీ బాబును చూసేవరకు ఆ పసివాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆమెకు తెలియదు.

"బాబును అలా చూసేసరికి నా గుండె పగిలిపోయింది" అని లొరేనా అన్నారు.

వైల్డర్ ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నాడు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మెక్సికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వైల్డర్‌ను గుర్తించి కాపాడారు.

క్షేమమేగానీ దూరంగా ఉన్నారు

జూన్ 29న లొరేనాకు తన భర్త, బిడ్డ క్షేమ సమాచారాలు తెలిశాయి.

"వైల్డర్ బాగానే ఉన్నాడుగానీ బాబును థెరపిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లాల్సి వచ్చిందని చెప్పారు" అని లొరేనా వివరించారు.

లొరేనా భర్త ఇసిడ్రో మెక్సికోలోని తూస్త్లా గుటియారెజ్ నగరంలో ఉన్న వలస కేంద్రంలో ఉన్నారు.

"నేను నా భర్తతో ఎక్కువ మాట్లాడలేదు. అక్కడ తరచూ ఫోన్ కాల్స్ చేసుకోనివ్వరు. కానీ ఆయన క్షేమంగానే ఉన్నారు. బాబును తీసుకెళ్లినామె జూన్ 30న నాకు మెసేజ్ పంపించారు. తరువాత కూడా చాలాసార్లు మెసేజ్‌లు చేశాను. కానీ ఆమె ఎప్పుడోగానీ జవాబివ్వరు" అన్నారామె

వలసదారులను వారి దేశాలకు తిరిగి పంపించే బాధ్యతను ఐఎన్ఎం తీసుకుంటుంది. అయితే వాళ్లను వెనక్కు పంపకుండా అమెరికాకు పంపించాలని లొరేనా కోరుకుంటున్నారు.

"వాళ్లను అమెరికా లోపలికి అనుమతించేందుకు ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది" అని ఆమె అన్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 4
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 4

పెరుగుతున్న వలసలు

ఇమ్మిగ్రేషన్ రికార్డులు ప్రకారం, గత 20 ఏళ్లతో పోలిస్తే సరైన అధికారిక పత్రాలు లేకుండా మెక్సికో-అమెరికా సరిహద్దులు దాటడానికి ప్రయత్నిస్తున్న వారి సంఖ్య ఈ ఏడాది అత్యధిక స్థాయికి చేరుకుంది.

మే నెలలో సరిహద్దులు దాటడానికి ప్రయత్నిస్తున్న 1,80,034 మంది వలసదారులను అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) తెలిపింది. వీరిలో చాలామంది ఒంటరి ప్రయాణికులే.

2000 ఏప్రిల్ తరువాత ఒక నెలలో ఇంతమందిని అదుపులో తీసుకోవడం ఇదే మొదటిసారని, మధ్య అమెరికా నుంచి తరలి వస్తున్నవారి సంఖ్య ఏటా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఈక్వెడార్, వెనెజ్వేలా, క్యూబా, హైతీ, మరికొన్ని ఆఫ్రికన్ దేశాల నుంచి వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది.

ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 19,000 మంది మైనర్లు ఒంటరిగా సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించారని అమెరికా అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)