పెద్ద భోషాణం.. దాని నిండా బంగారం, వజ్ర వైఢూర్యాలు.. పద్యం ఆధారంగా గుప్త నిధిని కనిపెట్టిన వ్యక్తి

ఫొటో సోర్స్, iStock
పెద్ద భోషాణం. దాని నిండా బంగారం, కళ్లు మిరు మిట్లు గొలిపేలా వజ్ర వైఢూర్యాలు, ఆభరణాలు, ఇంకా ఎన్నో విలువైన వస్తువులు.. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 8 కోట్ల రూపాయల విలువైన నిధి... ఉత్తర అమెరికాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న రాకీ పర్వతాల్లో దొరికింది.
పురాతన వస్తువులను సేకరించే అలవాటు ఉన్న ఫార్రెస్ట్ ఫెన్ అనే వ్యక్తి ఓ కంచు భోషాణంలో ఆ నిధిని ఉంచి రాకీ పర్వతాల్లో ఉన్న ఓ నిర్జన అటవీ ప్రదేశంలో విడిచిపెట్టారు. ఆపై ఔత్సాహికుల కోసం ఓ ట్రెజర్ హంట్ నిర్వహించారు. ఆ నిధి ఎక్కడ ఉందో కనుక్కోవాలని పిలుపునిచ్చారు. ఇదంతా పదేళ్ల క్రితం జరిగింది.
దీంతో ఒక్కసారిగా వందల సంఖ్యలో జనం ఆ నిధిని వెతికేందుకు బయల్దేరారు. చాలా మంది తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి, అప్పటి వరకు కూడబెట్టిన సొమ్మును ఖర్చు పెట్టుకుంటూ నిధి వేటకు బయల్దేరారు. ఈ క్రమంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు కూడా.

ఫొటో సోర్స్, MOST WANTED/SHUTTERSTOCK
తాజాగా తూర్పు అమెరికా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆ నిధిని కనుగొన్నారని ఫెన్ వెల్లడించారు.
“రాకీ పర్వత శ్రేణుల్లో పచ్చని అడవుల మధ్య నక్షత్రాల పందిరి కింద ఆ నిధి ఉంది. పదేళ్ల క్రితం దాన్ని నేను ఎక్కడ పెట్టానో ఇప్పటికీ అది అక్కడే ఉంది” అని న్యూ మెక్సికోకి చెందిన 89 ఏళ్ల కోటీశ్వరుడు ఫెన్ తన వెబ్ సైట్ ద్వారా ప్రకటించారు.
ఆ నిధిను కనుగొన్న వ్యక్తి వివరాలు తనకు తెలియదని అయితే తన జీవిత కథలో రాసుకున్న 24 పంక్తుల పద్యం ఆయనకు ఆ నిధి జాడను కనుక్కోవడంలో స్ఫూర్తిగా నిలిచిందని ఫెన్ పేర్కొన్నారు.
నిధిని సంపాదించిన వ్యక్తి తన పేరును వెల్లడించేందుకు ఇష్టపడలేదని, కానీ ఆ నిధిని, దాన్ని కనుగొన్న ప్రదేశాన్ని ఫోటో తీసి పంపారని న్యూ మెక్సికోలోని స్థానిక పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మిస్టర్ ఫెన్ తెలిపారు.
ఎన్నో అరుదైన బంగారు నాణేలు, పురాతన ఆభరణాలుతో కూడిన ఆ నిధి బరువు సుమారు 9 కేజీలు ఉంటుందని ఫెన్ చెప్పారు. ప్రీ కొలంబియన్ కాలానికి చెందిన జంతువుల బొమ్మలు, పురాతనకాలం నాటి చేతితో చేసిన బంగారు అద్దాలు, అలాగే పచ్చలతో చెక్కిన చైనీయుల ముఖాలతో తయారు చేసిన పెట్టెలో వాటిని ఉంచినట్లు తెలిపారు.
ఇన్నేళ్ల తర్వాత ఓ వ్యక్తి ఆ నిధిని కనుగొనడం మీకు ఎలా అనిపించిందన్న ప్రశ్నకు “ నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. ఓ వైపు నిధిని ఆ వ్యక్తి కనుగొన్నందుకు సగం సంతోషంగా ఉంది. అలాగే ఆ నిధి వేట పూర్తయిపోయిందే అన్న సగం బాధ కూడా ఉంది” అని ఫెన్ సమాధానం చెప్పారు.
ఇవి కూడా చదవండి
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- ముంబయి మహా నగరానికి 125 ఏళ్లుగా నిరంతరాయంగా భోజనం అందిస్తున్న డబ్బావాలా
- న్యూజీలాండ్: డ్యాన్స్ చేసిన ప్రధాని... వైరస్ కేసులు జీరో కావడంతో లాక్డౌన్ ఎత్తివేత
- కరోనావైరస్ మహమ్మారి కాలంలో డిజిటల్ డిటాక్స్ చేయటం ఎలా
- 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 18 మందికి కరోనావైరస్.. అంతా ఎలా బయటపడ్డారంటే..
- ఐదో విడత లాక్డౌన్లో తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ విజృంభణ ఎలా ఉందంటే...
- కరోనా లాక్డౌన్: సూర్యుడు కనిపించని చీకటి జీవితం ఎలా ఉంటుంది
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- చెన్నంపల్లి కోటలో గుప్తనిధులు ఉన్నాయా?
- అప్పుడు బంగారం వేట.. ఇప్పుడు కోబాల్ట్ రష్
- మీ ఇంట్లోనే మీకు తెలియని బంగారం వంటి లోహాలను కనిపెట్టడం ఎలా
- 'రాక్షసుడి బంగారం' బయటకు తీసే కార్మికుల కథ
- ఇజ్రాయెల్: వెయ్యేళ్ల కిందటి బంగారు నాణేల నిధి
- మెటల్ డిటెక్టర్‌తో గుప్తనిధి వేట.. రూ.48 లక్షల విలువైన 1.4 కేజీల బంగారం లభ్యం
- నెపోలియన్ 80 టన్నుల బంగారాన్ని ఈ చెరువులోనే దాచారా?
- కృత్రిమ మేధస్సు: కరోనావైరస్ను ఈ అధునాతన సాంకేతికత అడ్డుకోగలదా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








