వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్: 8 వికెట్ల తేడాతో భారత్ పై న్యూజీలాండ్ విజయం.....

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత జట్టుపై న్యూజీలాండ్ విజయం సాధించి కప్ గెలుచుకుంది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత జట్టుపై న్యూజీలాండ్ విజయం సాధించి కప్ గెలుచుకుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్

ఇండియా మొదటి ఇన్నింగ్స్ : 217; రహానే 49, జేమిసన్ 5-31

న్యూజీలాండ్ మొదటి ఇన్నింగ్స్: 249; కాన్వే 54, షమీ 4-76

ఇండియా రెండో ఇన్నింగ్స్: 170; పంత్ 41, సౌతీ 4-48

న్యూజీలాండ్ రెండో ఇన్నింగ్స్ 140-2 విలియమ్సన్ 52 నాటౌట్

बीबीसी

ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో భారత్, న్యూజీలాండ్‌ల మధ్య జరిగిన 'వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్' ఫైనల్లో భారత జట్టుపై న్యూజీలాండ్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్ జట్టు ఏమాత్రం తొణక్కుండా నింపాదిగా ఆడి 45.5 ఓవర్లలోనే విజయం సాధించి ఛాంపియన్ షిప్‌ను కైవసం చేసుకుంది.

ఆరంభ నుంచి వికెట్లను కాపాడుకుంటూనే సులభమైన లక్ష్యాన్ని వేగంగానే చేరుకుంది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విలిమ్సన్ 89 బంతులలో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

47 పరుగులు చేసిన టేలర్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాన్వే 19, లాథమ్ 9 పరుగులు చేసి అవుటయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీశాడు.

రిజర్వ్ డే అయిన ఆరో రోజున భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లకు 64 పరుగులతో ఆటను ప్రారంభించింది. అయితే, ఒక్క రిషబ్ పంత్ (41), రోహిత్ శర్మ (30) తప్ప మిగిలిన జట్టు సభ్యులెవరు మంచి స్కోరు చేయలేకపోయారు.

కోహ్లి, రహనే, పుజారా, జడేజా లాంటి ఆటగాళ్లు కూడా 16 పరుగుల లోపే అవుటయ్యారు. లంచ్ విరామంలోపే అయిదుగురు ఆటగాళ్లు పెవిలియన్ బాటపట్టగా, లంచ్ తర్వాత కూడా వరసగా వికెట్లు పడిపోయాయి.

ప్రత్యర్ధి జట్టుకు పెద్ద కష్టంకాని లక్ష్యాన్ని ఇచ్చిన భారత జట్టు బౌలింగ్‌లో సత్తా చూపకపోవడంతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫీల్డింగ్‌లో చేసిన పొరపాట్లకు మూల్యం చెల్లించుకుంది.

న్యూజీలాండ్ ఇన్నింగ్స్ 31 వ ఓవర్లో టేలర్ 26 పరుగుల వద్ద ఉన్నప్పుడు, ఛతేశ్వర్ పుజారా క్యాచ్‌ను వదిలేశాడు. న్యూజీలాండ్ జట్టు విజయానికి 12 పరుగుల దూరంలో ఉన్నప్పుడు కేన్ విలిమమ్సన్ కొట్టిన బంతిని జస్‌ప్రీత్ బుమ్రా చేజార్చుకున్నాడు. దీంతో మ్యాచ్ కూడా భారత జట్టు చేజారి పోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)