కోవిడ్-19: పిల్లలందరికీ వ్యాక్సీన్ ఇవ్వాలా

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోవిడ్ 19: పిల్లలందరికీ వ్యాక్సీన్ ఇవ్వడం అవసరమా?
    • రచయిత, జేమ్స్ గల్లఘర్
    • హోదా, బీబీసీ హెల్త్

గవద బిళ్లలు, తట్టు, డిప్తీరియా, రోటా వైరస్, మెనింజైటిస్, కోరింత దగ్గు లాంటి రకరకాల రోగాలకు పిల్లలకు వ్యాక్సీన్లు ఇవ్వడం అందరూ ఆమోదించిన విషయమే. ఈ వ్యాక్సీన్లను పిల్లలకు కొన్ని వారాల వయసు ఉన్నప్పటి నుంచే ఇవ్వడం మొదలు పెడతారు.

కోవిడ్-19 వ్యాక్సీన్ సంగతేమిటి?

అమెరికా ఇప్పటికే 12- 15 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న 600,000 మంది పిల్లలకు వ్యాక్సీన్లు ఇచ్చింది.

అంత కంటే చిన్న వయస్సు వారికి కూడా వ్యాక్సీన్లు సురక్షితమే అన్న సమాచారం లభిస్తే వచ్చే సంవత్సరం చిన్నారులందరికీ వ్యాక్సీన్లు ఇవ్వాలని భావిస్తోంది.

జులై చివరి నాటికి పెద్దవాళ్లందరికీ వ్యాక్సీన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది బ్రిటన్.

పిల్లలకు వ్యాక్సీన్ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఇక్కడొక శాస్త్రీయ ప్రశ్న ఉంది.

వ్యాక్సినేషన్ పిల్లల ప్రాణాలను కాపాడుతుందా?

ఈ ప్రశ్నకు సమాధానం ఒక దేశం నుంచి మరొక దేశానికి భిన్నంగా ఉంటుంది. దీనికి సమాధానం కూడా సంక్లిష్టంగానే ఉంటుంది.

పిల్లల కోసం కేటాయించిన డోసులను ఇతర దేశాల్లోని వైద్య సిబ్బందికి, ముప్పు ఎక్కువగా ఉన్న వారికి ఇస్తే మరిన్ని ప్రాణాలను కాపాడవచ్చేమోనన్న నైతికమైన, న్యాయబద్ధమైన కోణం కూడా ఉంది.

చిన్నారుల్లో కోవిడ్

ఫొటో సోర్స్, Getty Images

పిల్లల్లో కోవిడ్ ముప్పు చాలా తక్కువ

పిల్లలకు వ్యాక్సీన్ ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని కొందరు వాదిస్తారు.

"అయితే, ఈ ఇన్ఫెక్షన్ వల్ల పిల్లలు తీవ్ర అనారోగ్యం బారిన పడక పోవడం మంచి విషయం" అని యూకే వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యూనైజేషన్ జాయింట్ కమిటీలోని ప్రొఫెసర్ ఆడం ఫిన్ అన్నారు.

పిల్లల్లో తేలికపాటి వ్యాధి లక్షణాలే కనిపిస్తున్నాయి. ప్రతి 10 లక్షల మంది పిల్లల్లో ఇద్దరు కంటే తక్కువ మంది పిల్లలు కోవిడ్ సోకి మరణించినట్లు ఏడు దేశాల్లో నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనం వివరాలు లాన్సెట్‌లో ప్రచురితమయ్యాయి.

ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్న పిల్లలకు కూడా యూకేలో ఇంకా వ్యాక్సీన్లు ఇవ్వలేదు.

కేవలం ముప్పు ఎక్కువగా ఉన్న వారు, సంరక్షణ గృహాల్లో వైకల్యంతో బాధపడుతున్న వారికి మాత్రమే టీకాలు ఇవ్వాలని సూచించారు.

ఈ వ్యాక్సీన్లు సురక్షితమే అయినప్పటికీ, వాటి వల్ల ఉన్న లాభాలను, ముప్పును జాగ్రత్తగా పరిశీలించాలి.

పిల్లలకు వ్యాక్సీన్ ఇవ్వడం వల్ల కొన్ని దేశాలకు మేలు జరగొచ్చు

పిల్లలకు వ్యాక్సీన్ ఇవ్వడం వాళ్ల చాలా మేలు జరుగుతుంది. ఇది ఇతరుల జీవితాలను కాపాడవచ్చు.

జలుబు లాంటి వాటికి వాడే విధానమొకటి ఉంది.

రెండేళ్ల నుంచి 12 సంవత్సరాల వయస్సులో ఉన్న బ్రిటిష్ చిన్నారుల తాత, మామ్మలను కాపాడటానికి ఆ పిల్లలకు ప్రతి సంవత్సరం నాసల్ స్ప్రే ఇస్తారు.

వ్యాక్సీన్ ఇవ్వడం ద్వారా ఎక్కువ మందిని వైరస్ బారి నుంచి రక్షించి అది వ్యాప్తి చెందకుండా హెర్డ్ ఇమ్యూనిటి సాధించడానికి ఉపయోగపడుతుందేమోననే వాదన కూడా ఉంది.

వైరస్ వ్యాప్తి చెందకుండా కోవిడ్ వ్యాక్సీన్లు కాపాడగలవు. ఒక్క డోసు వ్యాక్సీన్ తీసుకున్నా కూడా వైరస్ సోకే ప్రమాదం సగానికి పైగా తగ్గిపోతుంది. ఒకవేళ వ్యాక్సీన్ తీసుకున్న వారికి వైరస్ సోకినా వారి నుంచి వ్యాప్తి చెందే అవకాశం కూడా తక్కువే ఉంటుంది.

పిల్లల ద్వారా కరోనావైరస్ వ్యాప్తి చెందకపోవచ్చు కానీ, టీనేజర్ల ద్వారా సోకే అవకాశముంది.

"సెకండరీ స్కూల్‌కు వెళుతున్న పిల్లల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఆధారాలు ఉండటంతో వ్యాక్సినేషన్ వల్ల ప్రభావం ఉండవచ్చు" అని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ డాక్టర్ ఆడమ్ కుకార్స్కి చెప్పారు.

కానీ, పిల్లలకు వ్యాక్సీన్ ఇవ్వడం ఉపయోగమా కాదా అనే అంశంపై ఒక సార్వత్రిక సమాధానం లేదు.

ఇంగ్లాండ్‌లో ఉన్న 16-17 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్లో పావు వంతు మందిలో కరోనా వైరస్ యాంటీ బాడీలు ఉన్నాయి.

ఈ దేశంలో పిల్లలకు వ్యాక్సీన్ ఇవ్వకుండా వైరస్ వ్యాప్తి ఆపేందుకు సరిపోయే రోగ నిరోధక శక్తి ఉందని కనిపెట్టవచ్చు.

"మహమ్మారులు ఎక్కువగా లేని దేశాల్లో పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వకుండా ఉండటం కూడా కష్టమే" అని డాక్టర్ కుకార్స్కి అన్నారు.

వ్యాక్సీన్ల పట్ల విముఖత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. న్యూజీలాండ్, తైవాన్ లాంటి దేశాలు వైరస్‌ను సమర్ధవంతంగా అరికట్టాయి.

ఇది నైతికంగా కరెక్టేనా?

పిల్లలకు వ్యాక్సీన్ ఇవ్వడం వల్ల టీకా ఎవరికి లభించటం లేదో ఆలోచించాలి.

పిల్లలకు టీకా ఇవ్వాలనే ధనిక దేశాల ప్రణాళికలను వాయిదా వేసి, ఆ డోసులను మిగిలిన దేశాలకు ఇమ్మని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

"పిల్లలకు వ్యాక్సీన్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వడం నైతికంగా తప్పు" అని ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ క్లినికల్ ట్రయల్స్‌కు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఆండ్రూ పోలార్డ్ అంటున్నారు.

"వ్యాక్సీన్ల సరఫరా అపరిమితంగా ఉంటే 12 సంవత్సరాల వాళ్లకి కూడా టీకాలు ఇవ్వవచ్చు. కానీ అలాంటి పరిస్థితి లేదు" అని ఎడిన్‌బరో యూనివర్సిటీలో ఇమ్యూనాలజిస్ట్ ప్రొఫెసర్ ఎలీనార్ రైలీ చెప్పారు.

"ప్రపంచంలోని ఇతర దేశాల్లో పెద్దవాళ్లు కోవిడ్ బారిన పడి మరణిస్తుండగా పిల్లలకు వ్యాక్సీన్ ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలా లేదా అనేది రాజకీయంగా తీసుకోవలసిన నిర్ణయం" అని అన్నారు.

(ఈ కథనాలను హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)