ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 64 మంది కోవిడ్‌తో మృతి

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కరోనావైరస్ కారణంగా 64 మంది ప్రాణాలు కోల్పోయారు.
విజయనగరం జిల్లాలో 8 మంది, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో అయిదుగురు, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురేసి చొప్పున మరణించారు. కృష్ణ జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం 11,434 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ నిర్ధరణైంది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 2,028 మంది, చిత్తూరులో 1,982 మందికి, శ్రీకాకుళంలో 1322, నెల్లూరు జిల్లాలో 1237, విశాఖ జిల్లాలో 1067 మందికి పాజిటివ్‌గా నిర్ధరణైంది.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్-19: ఆరు రోజుల తర్వాత దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, భారత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న WHO
భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 3,23,144 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల కొత్తగా 2771 మంది చనిపోయారు.
దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307కు చేరాయని, మొత్తం మరణాల సంఖ్య 1,97,894కు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తాజా కేసులతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 28,82,204కు చేరుకుంది.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,51,827 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,45,56,209కు చేరింది.
దేశంలో ఇప్పటివరకూ 14,52,71,186 వ్యాక్సీన్ డోసులు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.
భారత్‌లో సోమవారం మొత్తం 3,52,991 కేసులు, 2812 మరణాలు నమోదయ్యాయి.
గత ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చిన కరోనా కేసులు మొదటి సారి స్వల్పంగా తగ్గాయి.
దేశంలో మరణాల సంఖ్య కూడా 13 రోజులు వేగంగా పెరిగిన తర్వాత స్వల్పంగా తగ్గింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
భారత్‌లో పరిస్థితి ఘోరం: డబ్ల్యుహెచ్ఓ చీఫ్
భారత్‌లో ప్రస్తుత కరోనా పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ చీఫ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రియేసస్ విచారం వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 26న మీడియా బ్రీఫింగ్ సమయంలో ఆయన భారత్‌లో కరోనా కేసులు పెరగడం గురించి మాట్లాడారు.
"ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వరుసగా తొమ్మిదోవారం కరోనా కేసులు పెరగడం చూస్తున్నాం. దానితోపాటూ ఆరు వారాల నుంచి వరసగా మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది" అని గెబ్రియేసస్ అన్నారు.
"చాలా దేశాల్లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. భారత్‌లో పరిస్థితిని హృదయ విదారకం కంటే ఘోరంగా ఉంది" అని ఆయన అన్నారు.
మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్ని చేయాలో అన్నీ చేస్తోందని గెబ్రియెసస్ అన్నారు.
"మేం ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోడానికి చాలా ముఖ్యమైన పరికరాలు, వాటి సరఫరా కొనసాగేలా చూస్తున్నాం. వాటిలో ఆక్సిజన్, మొబైల్ ఫీల్డ్ ఆస్పత్రులు, ల్యాబ్స్ ఉన్నాయి" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
బ్యాంకాక్ నుంచి 18 ఆక్సిజన్ ట్యాంకర్లు తెప్పిస్తున్న దిల్లీ ప్రభుత్వం
ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న దిల్లీ ప్రభుత్వం బ్యాంకాక్ నుంచి 18 ఆక్సిజన్ ట్యాంకర్లు తెప్పించాలని నిర్ణయించింది.
ఈ ట్యాంకర్లు బుధవారం నుంచి రాజధానికి చేరుకోనున్నాయి.
ట్యాంకర్ల రవాణా కోసం ఎయిర్ ఫోర్స్ విమానం ఉపయోగించుకోడానికి అనుమతించాలని మేం కేంద్రాన్ని కోరామని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పినట్లు ఏఎన్ఐ ట్విటర్‌లో చెప్పింది.
"విమానం కోసం చర్చలు కొనసాగుతున్నాయి. అవి సఫలమై, రవాణా సమస్యలు తీరిపోతాయనే మేం ఆశిస్తున్నాం" అని కేజ్రీవాల్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- తెలంగాణ: పదో తరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా
- దీర్ఘకాలిక కోవిడ్: ‘రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- స్పుత్నిక్ V: రష్యా వ్యాక్సీన్‌కు భారత్ అనుమతి.. ఈ టీకా గురించి తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్‌లో టీకాల కొరతకు కారణమేంటి..
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








